కెప్టెన్ మూవీ రివ్యూ

Published On: September 8, 2022   |   Posted By:

కెప్టెన్ మూవీ రివ్యూ

image.png

 

ఆర్య ‘కెప్టెన్’  తెలుగు మూవీ రివ్యూ                                                                                               

Emotional Engagement Emoji (EEE)                                                                                                  

👎

త‌మిళ హీరో ఆర్య‌ మన తెలుగువాళ్లకు  సుప‌రిచిత‌మే. గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  ‘వ‌రుడు’ సినిమాతో విలన్ పాత్ర‌లో ఆర్య మెప్పించాడు. అప్ప‌టినుండి ఈయ‌న న‌టించిన సినిమాలు కొన్ని యూట్యూబ్‌లో డ‌బ్బింగ్‌ వెర్ష‌న్‌లుగా విడుద‌ల కాగా మ‌రికొన్ని  డైరక్ట్ గా థియేటర్ల‌లో విడుద‌లయ్యాయి. ప్ర‌స్తుతం ఈయ‌న తెలుగులో మార్కెట్ పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. ఇక చాలా కాలం త‌ర్వాత ఈయ‌న ‘సార్ప‌ట్ట ప‌రంప‌ర‌తో’ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. గ‌తేడాది నేరుగా ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ‘కెప్టెన్’ విడుద‌లైంది.  ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకోగలిగిందా..సినిమా ఎలా ఉంది ..కథేంటి వంటి  విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ఇండియన్ ఆర్మీ ఆఫీసర్   కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) కు ఎలాంటి కష్టమైన ఆపరేషన్ చేపట్టినా సక్సెస్ చేస్తాడని పేరు. అతనికో స్పెషల్ టీమ్ ఉంటుంది. దాంతో అతనికి ప్రభుత్వం ఓ ఎస్సైన్మెంట్ అప్పచెప్తుంది.  ఈశాన్య భారతదేశంలోని సెక్టార్ 42 చాలా కాలంగా మూతబడి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటుంది. అక్కడకి ఆర్మీ వెళ్లి ప్రోపర్ గా చెక్ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతకు ముందే ఐదుగురుతో అక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి రారు. అంతకు ముందు కూడా అలాగే జరిగింది. వెళ్లిన వాళ్లు తిరిగి రావటం లేదు. దాంతో ధైర్యం గల కెప్టెన్ తన టీమ్ తో అక్కడికి అడుగు పెడతాడు. ఓ ఛాలెంజ్ తో ఆ టాస్క్ ని ఫినిష్ చేద్దామనుకుంటాడు. అయితే అక్కడ ఎవరు ఉన్నారనే విషయం ఛేథిస్తూంటే ఏలియన్స్ ఈ మిస్టరీ వెనక అక్కడ ఉన్నారని క్లారిటీ వస్తుంది. వింత జీవులు కొన్ని అక్కడికి వెళ్లిన వారిపై ఎటాక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడీ కెప్టెన్ ఎలా ఎటాక్ చేసాడు. చివరకు ఆ వింత జీవులని అంతం చేసాడా..సెక్టార్ 42ని ప్రభుత్వానికి అప్పగించగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే  విశ్లేషణ

ఇలాంటి ఏలియన్ కాన్సెప్టులతో వచ్చిన సినిమాలకు మనకు అరుదే. అయితే హాలీవుడ్ లో వచ్చిన అనేక సినిమాలు మనవాళ్లు చూస్తూనే ఉన్నారు. దాంతో ఖచ్చితంగా ఆ స్దాయిలో లేకపోయినా కొంతలో కొంత అయినా ఉండాలనుకుంటారు. కానీ ఈ సినిమాకు ఆ సత్తా లేదని మొదటి పది నిముషాల్లో నే అర్దమవుతుంది. కథలో కావాల్సిన ఇంటెన్స్ క్రియేట్ కాలేదు. స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉండటం అందుకు కారణం. కథ చాలా ప్రెడిక్టుబుల్ గా ఉంటుంది. ఎక్కడా మనం ఊహించని ట్విస్ట్ లు, మలుపులు ఉండవు. ఇలాంటి కథలకు ఉండాల్సిన ఉత్కంఠ తర్వాత ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీని క్రియేట్ చేయటంలో దర్శకుడు ఘోరంగా ఫెయిలయ్యాడు. ఎక్కడా మనం ఆశ్చర్యపోము. దానికి తోడు లాజికల్ ఎర్రర్స్ విసిగిస్తూంటాయి. అలాగే హీరో లవ్ స్టోరీ ఏమీ స్పెషాలిటీ ఉండదు. రొటీన్ గా అనిపిస్తుంది.  ఏలియన్ క్రీచర్స్ కూడా కొత్తగా లేవు. కథలో కాస్తంత విషయం పెట్టుకుంటే ఇలాంటి కథలు ఈజిగా ఓ వర్గాన్ని అయినా ఎట్రాక్ట్ చేస్తాయి. అదే చేయలేకపోయారు. హీరో పాత్ర చాలా ప్యాసివ్ గా రవన్ అవుతుంది. మనకు చాలా సార్లు  ‘ప్రెడేటర్’ సినిమా గుర్తుకు వస్తుంది. క్యారక్టరైజేషన్స్ బాగున్నాయి.   ఆర్య పాత్ర  చాలా ఇంటెన్స్ ఉంది. కాకపోతే అది సీన్స్ లో కలవలేదు. ఇదంతా టైం పాస్ కోసం నడిపిస్తున్నట్లు కొంత దూరం వెళ్లాక ప్రేక్షకుడికి అర్ధమైపోతుంది. పోనీ ఆ టైం పాస్ అయినా పాసైపోయిందా అంటే అదీ లేదని అర్దమవుతుంది.

టెక్నికల్ గా ……

ఈ సినిమాకు ఇమాన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బలంగా నిలిచింది. వీఎఫ్ఎక్స్ సీన్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి. ఏలియన్ క్రీచర్స్ ని కొత్తగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. హాలీవుడ్ సినిమాల రిఫరెన్స్ పెట్టుకుని అవే యాజటీజ్ దింపేసారు. సినిమాటోగ్రఫీ, ఎటిటింగ్ అధ్బుతం కాదు కానీ బాగున్నాయి. ఫస్టాఫ్ లో కొన్ని  విజువల్స్ బాగున్నాయి. అన్నిటికన్నా ఈ సినిమాకు పెద్ద ప్లస్ ఏదీ అంటే రన్ టైమ్. చాలా తక్కువ పెట్టుకోవటం ఉన్నంతలో కలిసివచ్చింది. దర్శకుడు మాత్రం అంతకు ముందు అతను తీసిన  “టెడ్డి”,“టిక్ టిక్ టిక్” స్దాయిలో సినిమాని తియ్యలేకపోయాడు.

నటీనటుల్లో …
ఆర్య ఎనర్జిటిక్ గా వున్నాడు. ముఖ్యంగా అతడి పాత్రకి బాడీ లాంగ్వేజ్ కి ఫెరఫెక్ట్ సింక్ నడిచింది .యాక్షన్ సీక్వెన్స్ లు  జోష్ గా చేశాడు. ఐశ్వర్య లక్ష్మి  వుంది కానీ ఆ పాత్ర బాడీ లాంగ్వేజ్ ఏమిటో నీరసంగా వుంది.సిమ్రాన్ పాత్ర అంత గొప్పగా ఏమీ లేదు. జస్ట్ ఓకే.

చూడచ్చా?

ఈ సినిమా కన్నా రీసెంట్ గా ఇలాంటి కాన్సెప్టు తో హాలీవుడ్ లో వచ్చిన Prey (2022 film) చూస్తే బెస్ట్ అనిపిస్తుంది.

నిర్మాణ సంస్థ:థింక్ స్టూడియోస్,  ది స్నో పీపుల్ పతాకం
నటీనటులు:ఆర్య ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి,  మాళవికా అవినాష్, గోకుల్ ఆనంద్, భరత్ రాజ్, ఆదిత్యా మీనన్, సురేష్ మీనన్ తదితరులు
సౌండ్ డిజైన్ : అరుణ్ శీను,
సౌండ్ మిక్స్ : తపస్య నాయక్,
కలరిస్ట్ : శివ శంకర్ .వి,
వీఎఫ్ఎక్స్‌ సూపర్ వైజర్ : వి. అరుణ్ రాజ్,
కాస్ట్యూమ్ డిజైనర్ : దీపాలీ నూర్,
స్టంట్ డైరెక్టర్ : ఆర్. శక్తి శరవణన్, కె. గణేష్,
ప్రొడక్షన్ డిజైన్ : ఎస్.ఎస్. మూర్తి,
ఎడిటర్ : ప్రదీప్ ఇ. రాఘవ్,
సినిమాటోగ్రఫీ : ఎస్. యువ,
మ్యూజిక్ : డి ఇమాన్,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : కె. మాధవన్,
ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎస్. శివ కుమార్,
Runtime:1 గంట 56 నిమిషాలు
రచన – దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్.
విడుదల తేదీ : సెప్టెంబర్ 8, 2022