Reading Time: < 1 min

కొంచెం హాట్కే చిత్రం సాంగ్ విడుదల

శేఖర్ కమ్ముల చేతుల మీదుగా కొంచెం హాట్కే చిత్రంలోని లిరికల్ సాంగ్ విడుదల !!!

అభిమాన థియేటర్ పిక్చర్స్ నిర్మించిన కొంచెం హట్కే చిత్రం లోని  బదులేంటి ప్రశ్నేనా మొదటి పాటని దర్శకులు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ చిత్రానికి కే.ఎం.రాధాకృష్ణ సంగీతాన్ని అందించారు. ఆనంద్, గోదావరి,చందమామ వంటి అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ తర్వాత మళ్లీ కొంచెం హట్కే చిత్రంతో విభిన్నమైన సంగీతంతో మన ముందుకు రానున్నారు .ఈ సందర్భంగా దర్శకులు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ చాలా కాలం తర్వాత కే.ఎం.రాధాకృష్ణ పాట విన్నాను చాలా బాగుంది. కొత్త వాళ్లతో చేశామని టీం చెప్తున్నారు, కొత్త వాళ్లతో చేసినప్పుడు ఉండే కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని అభినందించారు. ఈ పాటకి సాహిత్యం అందించింది శ్రీనివాస మౌలి, గానం : మనీషా ఈరబత్తిని.

ఈ చిత్ర దర్శకులు : అవినాష్ కుమార్ , రచయిత : కృష్ణా రావూరి, కెమెరా : అనీల్ మల్లెల , ఎడిటర్ : మంజు కె రెడ్డి , లైన్ ప్రొడ్యూసర్ : నవ్య పోట్ల.