కొబ్బరి మట్ట మూవీ రివ్యూ

Published On: August 10, 2019   |   Posted By:

కొబ్బ‌రిమ‌ట్ట‌ మూవీ రివ్యూ

స్ఫూఫ్ ల కట్ట… (‘కొబ్బరి మట్ట’ మూవీ రివ్యూ)
Rating: 2.5/5

ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది… పాపారాయుడు చనిపోతున్నప్పుడు తన కొడుకు పెదరాయుడుతో… నీకు ఏ కష్టం వచ్చినా నన్ను నాన్నా అని పిలిస్తే చాలు సమాధిలో నుండి అయినా వచ్చేస్తా అని చెప్తాడు.  క్లైమాక్స్‌లో పెదరాయుడ్ని విలన్‌లు కొడుతుంటే.. తండ్రి పాపారాయుడు మాట గుర్తుకు వచ్చి నాన్నా అని పిలుస్తాడు. దాంతో పాపా రాయుడు సమాధిని చీల్చుకుంటూ వచ్చి విలన్‌లను చితక్కొట్టేసి. మళ్లీ సమాధిలోకి వెళిపోతాడు పాపారాయుడు. ఈ సీన్ మీకు నచ్చి, నవ్వొస్తే …మీకు ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇలాంటి సీన్స్ బోలెడు ఉంటాయి కాబట్టి. మరి ఇలాంటి సీన్స్ కలగలిసిన ఆ కథేంటో తెలుకోవాలని ఉందా…

స్టోరీ లైన్…

హాయిగా తీర్పులిచ్చుకుంటూ కాలక్షేపం చేస్తున్న ఊరి పెద్ద  పాపారాయుడు (సంపూర్నేష్ బాబు) అదే ఊరి కోసం కొన్ని తప్పని సరి పరిస్దితుల్లో మరణిస్తాడు. అయితే చనిపోయేముందు తన కొడుకు పెదరాయుడు (సంపూర్ణేష్‌ బాబు) ఆ ఊరి పెద్దరికం అప్పచెప్తాడు. అప్పటినుంచీ పెదరాయుడు ఎవరికి ఏ అన్యాయం జరిగినా అక్కడ ప్రత్యక్ష్యమవుతూంటాడు. తనకు న్యాయమనింపించిన రీతిలో చిత్ర విచిత్రమైన తీర్పులు చెప్తూ  పేరు తెచ్చుకుంటాడు. ముగ్గురు తమ్ముళ్లు , ముగ్గురు భార్యలతో  హ్యాపీగా,సుఖంగా జీవితం గడుపుతున్న అతని జీవితంలోకి సునామీలా వచ్చి పడతాడు ఆండ్రాయుడు (సంపూర్ణేష్‌బాబు). వచ్చిన వాడు వచ్చినట్లే ఉండక.. ‘నువ్వే నా నాన్నవి’ అంటాడు. ఒప్పుకోమంటూ ఛాలెంజ్ చేస్తాడు. పెదరాయుడుకు జీవితంలో పెను తుఫాన్. అసలు ఈ ఆండ్రాయుడు ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చాడు. అసలు పెదరాయుడు పోలికలతో ఎందుకు ఉన్నాడు? నువ్వే మా నాన్నవి అనేటంత సంఘటన ఏం జరిగింది వంటి ప్లాష్ బ్యాక్ లు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  
 
విశ్లేషణ

ఈ సినిమా చూడటానికి ముందే ఇది పెదరాయుడు సినిమా మీద చేసిన స్ఫూప్ అని మనకు తెలుసు కాబట్టి ఏ సమస్యా ఉండదు. అయితే కొద్ది కాలం వరకూ స్టార్స్ సినిమాల్లో స్పూఫ్ లను కమిడియన్స్ పై పెట్టి నవ్విస్తూండేవారు. అలాగ అప్పట్లో అంటే పెదరాయుడు రిలీజైన రోజుల్లో కొన్ని స్పూఫ్ లు వచ్చాయి. అయితే పెదరాయుడు వచ్చి చాలా కాలం అయ్యింది. ఇంతకాలం తర్వాత ఇంకా ఆ సినిమాపై స్పూఫ్ చేయాలనే ఆలోచన వింతే. అయితే చేసేసారు. నవ్వించే ప్రయత్నం చేసారు కానీ…అంతగా నవ్వించలేకపోయారనే చెప్పాలి. ఎందుకంటే హృదయకాలేయం వచ్చేనాటికి సంపూర్ణేష్ బాబు అనే నటుడు కొత్త. అతన్ని చూడగానే నవ్వు వచ్చింది. అతను హీరోగా చేయటమేంటి అని అనుకుంటూ ఆ సినిమా చూసేసారు. ఇప్పుడు సంపూ పాతబడ్డాడు. అతని కోసం చూసే పరిస్దితి లేదు. దాంతో ఆ ఫ్రెషనెస్ సినిమాలో రాలేదు. అలాగే హృదయకాలేయానికి ప్లస్ అయిన విషయం..అప్పటి సోషల్ మీడియా ప్రచారం. ఇప్పుడు ఈ సినిమా కు వచ్చేసరికి ఆ క్రేజ్ రాలేదు. మూమెంటరీ కామెడీ ఉంది కాబట్టి చూసేటప్పుడు ఇబ్బంది అనిపించలేదు. అలాగే ఫస్ట్ హాఫ్ పై పెట్టిన శ్రద్ద సెకండాఫ్ పై పెట్టలేదు. సీన్స్ అంతగా పండలేదు. 

హైలెట్స్ 
సినిమాకు రాసిన డైలాగులు, ఫన్నీ సిట్యువేషన్స్, లెంగ్త్ తక్కువ ఉండటం కలిసొచ్చాయి. 

మైనస్ లు
సినిమా మరీ నాశిరకంగా ఉంది, అలాగే సినిమాలో ఫ్రెషనెస్ లోపించింది.  అతి అనర్ద దాయకం అన్నట్లు ప్రారంభంలో బాగుందనిపించిన సెటైర్..పోను పోను విసుగ్గా , బోర్ గా ఉంటుంది. అలాగే సెకండాఫ్ లో సీన్స్ బాగా సాగతీస్తూ పోయారు. కొన్ని ఎపిసోడ్స్ అయితే జబర్దస్త్ లాగ అనిపించాయి. 
 
  
సాంకేతికంగా…
సినిమా కు టెక్నికల్ టీమ్ వీకే. సాంగ్స్ బాగున్నాయి కానీ మరీ ఎనభైల నాటి వాతావరణం కనపడింది. డైలాగ్స్ మాత్రమే సినిమాలో కాస్త స్టాండర్డ్స్ లో కనపడ్డాయి. ఎడిటింగ్, కెమెరా అన్ని అలాగే ఉన్నాయి. చెప్పుకోదగినంత గొప్పగా ఏమీ లేదు. 
 
చూడచ్చా..
కొంత బోర్ ని భరించగలిగితే…. 

తెర వెనక..ముందు

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, మహేష్ కత్తి తదితరులు 
దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్
 కథ, మాటలు, స్క్రీన్ ప్లే: స్టీవెన్ శంకర్
 నిర్మాత: సాయి రాజేష్ నీలం (స్టీవెన్ శంకర్) 
సంగీతం: సయ్యద్ కమ్రాన్
 సినిమాటోగ్రఫి: ముజీర్ మాలిక్ 
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ 
బ్యానర్: అమృత ప్రొడక్షన్స్ 
రిలీజ్ డేట్: 2019-08-10