Reading Time: 3 mins

కోనసీమ థగ్స్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

కోరియోగ్రాఫర్ బృందా మరో సారి డైరక్షన్ చేసారు. ఆయన స్టార్ కొరియోగ్రఫర్ గా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. ఎన్నో హిట్ మూవీస్ కి కోరియోగ్రాఫి అందించిన ఆమె నుంచి గొప్ప సినిమాలు వస్తాయని ఎక్సపెక్ట్ చేసింది పరిశ్రమ కోరియోగ్రాఫర్ గా సక్సెస్ అయిన బృంద డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమానే డిజాస్టార్ అవటం ఎవరూ ఊహించలేదు. దుల్కర్ వంటి స్టార్ ఉండి కూడా ఆ సినిమాని కాపాడలేకపోయారు. ఆ తర్వాత కోనసీమ థగ్స్తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రీ బ్యానర్ రిలీజ్ తో ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రస్ట్ అందరిలో ఏర్పడింది. ఈ యాక్షన్ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా ఇప్పుడు చూద్దాం.

స్టోరీ లైన్:

అనాద అయిన శేషు (హృదు హరూన్ ) మూగ అమ్మాయి కోయిల(అనస్వర రాజన్‌)ని ప్రేమించిన శేషు అమెను పెళ్లి చేసుకుని జీవితాన్ని హాయిగా గడుపుదామనుకుంటాడు. అదే సమయంలో అనుకోకుండా ఒక హత్య కేసులో అరెస్ట్ అవుతాడు. కాకినాడ జైలులో శేషుకు దొర(బాబీ సింహ), మధు(మునీష్ కాంత్)తో పాటు కొంతమంది ఖైదీల పరిచయం అవుతారు. వీరందరితో కలిసి జైలు నుంచి పారిపోవడానికి శేషు ఒక స్కెచ్ వేస్తాడు. జైలు గదిలో సొరంగం తవ్వి దాని గుండా పారిపోయేందుకు ప్రయత్నిస్తారు? పోలీసుల కళ్లుకప్పి సొరంగం ఎలా తవ్వారు? చివరికి వాళ్లు తప్పించుకున్నారా? లేక దొరికిపోయారా? అసలు శేషు ఒకరిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? జైలు సిబ్బంది శేషుని ఎందుకు చంపాలనుకున్నారు? కోయిల, శేషు కలిశారా లేదా? అనేదే మిగతా కథ.

ఎనాలసిస్

ఇదో జైల్ బ్రేక్ స్టోరీ. ఇలాంటి Prison Escape సినిమాలు, వెబ్ సీరిస్ లు హాలీవుడ్ లో చాలా వచ్చాయి. అయితే తెలుగులో పెద్దగా రాలేదనే చెప్పాలి. ఆ లోటు ని తీర్చటానికి అన్నట్లు ఈ సినిమా చేసారామె. కోనసీమ అని పెట్టడంతో ఎంతో ప్రశాంతంగా ఉండే కోనసీమలో థగ్స్ ఏంటా అనే ఆసక్తి కలుగుతుంది. అక్కడిదాకా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే సినిమా ప్రారంభంలో జైలులో వచ్చే ఫైట్ సీన్ మేకింగ్ కూడా అదరకొట్టారు. అయితే ఫస్టాఫ్ సగం వరకు సినిమా స్టోరీ చాలా స్లోగా , నడుద్దామా వద్దా అన్నట్లు సాగుతూంటుంది . కానీ, బాబీ సింహా ఎంటరయ్యాక సినిమా పరుగెడుతుంది. 90శాతం సినిమా జైలులోనే ఉన్నా ఇంట్రస్టింగ్ గా మార్చే ప్రయత్నం చేసారు. ఒక క్రూరమైన వాతావరణం ఉండే జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో వేసే ఎత్తులు.. అందుకు అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేలా చేసే పరిస్తితులని కథగా రాసుకున్నారు. అయితే ఇది హీరో పాయింటాఫ్ వ్యూలో కాకుండా కొందరి ఖైదీల పాయింటాఫ్ వ్యూలో జరుగుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దాలని కానీ, స్క్రీన్ ప్లే సహకరించలేదు దర్శకురాలు బృందా గోపాల్‌ కు . అయితే కథను మెల్లిగా ప్రారంభించి, ప్రేక్షకులు అయోమయానికి గురికాకుండా నేరేట్ చేయడంలో దర్శకురాలు చాలా వరకూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాగే జైలు నుంచి పారిపోవడానికి హీరో చేసే ప్రతి ప్రయత్నం సినిమాటిక్‌గా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంటడటం కూడా ఈ సినిమాకు ఉన్న మరో ప్లస్.

టెక్నికల్ గా :

శామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు బాగోలేవు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ చాలా ప్లస్‌ అయింది. ఎడిటర్‌ ప్రవీణ్ ఆంటోనీ జస్ట్ ఓకే. లాగ్ లు తీసేసి,స్పీడ్ చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

నటీనటుల్లో :

హీరో హ్రిదు హరూన్‌కి ఇది తొలి మొదటి సినిమా అయినా యాక్షన్ సీన్స్ బాగా చేసాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో మాత్రం వర్కవుట్ కాలేదు .  దొర పాత్రలో బాబీ సింహా అదరకొట్టాడు. హీరోయిన్ గా కోయిల పాత్రకు అనస్వర రాజన్‌ న్యాయం చేసింది. దొంగతనం కేసులో జైలుకు వచ్చిన మధుగా మునీష్ కాంత్ తనదైన కామెడీతో నవ్వించాడు. శరత్ అప్పనితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ప్లస్ లు:

సెకండాఫ్ లోనూ స్క్రీన్ ప్లే,
లాస్ట్ లో వచ్చే ఫైట్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

స్లోగా సాగే నేరేషన్
స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా లేకపోవడం
మిస్ గైడ్ చేసే టైటిల్

చూడచ్చా?

ఓ సారి చూడటానికి, ఓ వీకెండ్ కాలక్షేపానికి పనికి వస్తుంది

నటీనటులు :

హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునీష్ కాంత్, అనస్వర రాజన్‌, శరత్ అప్పని మరియు తదితరులు

సాంకేతికవర్గం :

నిర్మాణ సంస్థ: హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
దర్శకత్వం: బృంద
సంగీతం: శామ్ సి ఎస్
సినిమాటోగ్రఫీ: ప్రీయేష్ గురుస్వామి
ఎడిటర్‌: ప్రవీణ్ ఆంటోనీ
రన్ టైమ్ :122 మినిట్స్
విడుదల తేది: ఫిబ్రవరి 24, 2023