Reading Time: 2 mins

కోర్ట్ – STATE vs A NOBODY మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీలైన్ :

చందు (హర్ష రోషన్) ఒక వాచ్ మెన్ కొడుకు. జాబిలి(శ్రీదేవి అపల్లా) పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. మంగపతి (శివాజీ) పరువే ప్రాణంగా బతికే వ్యక్తి. అతని కుటుంబానికి చెందిన జాబిలీ ని చందు ఇష్టపడుతున్న సంగతి తెలిసి మైనర్ అయిన జాబిలి మీద చందు అసభ్యకరంగా ప్రవర్తించాడని కేసు పెట్టిస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చందు పై ‘ఫోక్సో’ వంటి భయంకరమైన సెక్షన్లతో కేసులు పెట్టి ఇరికించేలా చేస్తాడు మంగపతి. పేద కుటుంబంలో పుట్టిన చందుకి న్యాయం చేయడానికి ఏ లాయర్ ముందుకు రారు. వచ్చినా.. మంగపతి లంచంతో కొనేస్తాడు. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసును జూనియర్ లాయర్ సూర్య తేజ (ప్రియదర్శి) వాదిస్తాడు. మరి చందుని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్య తేజ ఏం చేశాడు ?. ఎలాంటి వాదన చేశాడు ?,ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ? అనేది మిగిలిన కథ

ఎనాలసిస్ :

ఫోక్సోచట్టంని ఎలా మిస్ యూస్ చేస్తున్నారో చూపించినా చిత్రం..

ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్:

మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.అలాగే కుర్రాడి పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు.శ్రీదేవి అపల్లాజాబిలి పాత్రలో చాలా బాగా చేసింది. మిగతా నటీనటులు చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

టెక్నికల్ గా :

దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాత ప్రశాంతి తిపిర్నేని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

 చూడచ్చా :

చూడొచ్చు

ప్లస్ పాయింట్స్ :

స్టొరీ లైన్, నటీనటుల పెర్ఫార్మన్స్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్ లో కొన్ని లాగ్ సీన్స్

తీర్పు :

ఫోక్సో చట్టం గురించి బాగా చూపించారు.

నటీనటులు:

శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా తదితరులు.

సాంకేతికవర్గం :

సినిమాటైటిల్ : కోర్ట్ – STATE vs A NOBODY

బ్యానర్: WALL POSTER CINEMA

విడుదలతేదీ: 14-03-2025

సెన్సార్రేటింగ్: “ U/A “

దర్శకత్వం: రామ్ జగదీష్

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: విజయ్ బుల్గానిన్

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ ఆర్

నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని

రన్టైమ్: 150నిమిషాలు

మూవీరివ్యూ :

రావ్ సన్ ఫిలిమ్స్ టీమ్