Reading Time: 4 mins
క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టన్నింగ్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా సింధూర పువ్వు కృష్ణారెడ్డి సమర్పణలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మించిన చిత్రం “క్రాక్” జనవరి 9న  విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
 
ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ అన్ని ఏరియాల్లోనూ విజయదుందుభి మోగిస్తోంది.
 
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ ని వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రవితేజ, వరలక్ష్మి శరత్ కుమార్, అప్సర రాణి, సముద్ర ఖని, దర్శకుడు గోపిచంద్ మలినేని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, కెమెరామెన్ జికె విష్ణు, ఫైట్ మాస్టర్స్ స్టంట్ శివ, రామ్-లక్ష్మణ్, నటులు సముద్రఖని, ఆలీ, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, సహా నిర్మాత అమ్మిరాజు, నిర్మాత బి. మధు తదితరులు పాల్గొన్నారు.

మా కాంబినేషన్ లో హ్యాట్రిక్!!
 
మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ..’ క్రాక్ సినిమాని పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్, ఫాన్స్ తమ్ముళ్లకు ముందుగా నా థాంక్స్. అందరూ మాకు ఒక కిక్ ఎనర్జీని ఇచ్చారు. నటీనటులు అందరూ ఎవరికి వాళ్ళు అద్భుతంగా నటించారు. తెరువెనుక హీరోల గురించి చెప్పాలి.. ఫస్ట్ జికె విష్ణు పెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చి నన్ను చాలా అందంగా చూపించారు. నెక్స్ట్ లెవెల్స్ కి ఈ సినిమాని తీసుకెళ్లారు. వెరీ వెరీ జోవియల్ పాజిటివ్ పర్సన్. నాకు బాగా నచ్చాడు. మళ్ళీ మళ్ళీ విష్ణుతో వర్క్ చెయ్యలను కుంటున్నాను. ఇక థమన్ టెర్రిపిక్ మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ఆర్ ఆర్ ఇరగదేశాడు. అందరూ ఆర్ ఆర్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే నాకు చాలా తక్కువమంది ఇష్టమైన వ్యక్తుల్లో రామ్-లక్ష్మణ్ లు ఒకరు. మా జర్నీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో స్టార్ట్ అయింది. అప్పటినుండి ఒకటి రెండు మినహాయిస్తే అన్నీ సినిమాలకు సూపర్బ్ ఫైట్స్ వాళ్లే కంపోజ్ చేశారు. ఈ సినిమాకి కూడా ఎక్స్ట్రార్డినరీగా చేశారు. ఆలీ నాకు మంచి ఫ్రెండ్. ఎప్పుడూ మంచి సలహాలు ఇస్తాడు.  నేను  యాభై సినిమాల వరకు చేశాం. మా కాంబినేషన్లో అన్నీ హిట్స్ అయ్యాయి. వరలక్ష్మి జయమ్మగా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. సీరియస్ గా నటించింది కానీ  తనకి చాలా వెటకారం ఎక్కువ. సరదాగా ఉంటుంది. సాయి మాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగ్స్ రాసాడు. అసలు నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు. సముద్రఖని కూడా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. మంచి రైటర్ డైరెక్టర్. కటారి కృష్ణ పాత్రకి ప్రాణం పోశారు. శృతిహాసన్ తో రెండవ సినిమా. తను ఫైట్స్ నేర్చుకుని చాలా బాగా చేసింది. ఆ ఫైట్ నాకు బాగా నచ్చింది. గోపి క్రాక్ తో హ్యాట్రిక్ కొట్టాడు. మధు, అమ్మిరాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా కోపరేట్ చేసి మంచి సినిమాని నిర్మించారు.. అన్నారు.
ఇది రవితేజ గారి జాతర!!
 
దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘ తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. థియేటర్స్ కి వచ్చి మా క్రాక్ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రతిఒక్కరికీ జీవితాంతం ఋణపడి ఉంటాను. కరోన తర్వాత థియేటర్స్ దెగ్గర రవితేజ గారి జాతర చూస్తున్నాం. నా కెరీయర్ స్టార్టింగ్ లో నన్ను నమ్మి ‘డాన్ శ్రీను’ సినిమాకి అవకాశం ఇచ్చి బలుపు, ఇప్పుడు ‘క్రాక్’ వరసగా ఛాన్స్ లు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తూ నా వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్న రవితేజ గారికి నా ధన్యవాదాలు. క్రాక్ రవితేజ కెరీయర్ లో బిగ్గెస్ట్ హిట్ అని అందరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒంగులులో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ తో ఒక కమర్షియల్ సినిమా చేయాలని కథ రెడీ చేశాను. ఆ కథ విని అందరూ ఇన్స్పైర్ అయి ఇష్టపడి వర్క్ చేశారు. నేను కన్న కలని నిజం చేసిన ప్రతి ఆర్టిస్టు, టెక్నీషియన్స్ కి నా థాంక్స్. ముఖ్యంగా థమన్ ఎక్స్ ఆర్డినరీ ఆర్ ఆర్ ఇచ్చాడు. నా మీద ఎంత ప్రేమవుందో అది ఈ సినిమాలో చూపించాడు థమన్.  జికె విష్ణు వన్డ్రఫుల్ విజువల్స్ ఇచ్చి సినిమాని ఒక రేంజ్ లో ప్రెజెంట్ చేసి నా కలను నా కళ్ళముందు చూపించాడు. రియల్ ఇన్సిడెంట్స్ తో జరిగిన కథతో సినిమా తీయడం కత్తిమీద సాములాంటిది. ఏమాత్రం మిస్ అయినా తేడా వస్తుంది. యు డిడ్ ఎక్స్తార్డినరి జాబ్ అని త్రివిక్రమ్ గారు కాల్ చేసి చెప్పడం చాలా హ్యాపీగా వుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. వారికి జీవితాంతం ఋణపడి ఉంటాను.  హీరోయిన్ కి ఫైట్ పెడతాను అంటే జనరల్ గా ఏ హీరో ఒప్పుకోడు. అలాంటిది రవితేజ గారు సూపర్ అని ఒకే అన్నారు.. ఆసీన్ కి మంచి స్పందన వస్తోంది.. అన్నారు.
 
నా కేరియర్ లో బిగ్ హిట్!!
 
నటి వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ ప్రేక్షకుల అభిమానానికి వారి ప్రేమకు థాంక్స్. థియేటర్స్ లో సినిమా చూసాను. ఫైట్స్ వచ్చినప్పుడల్లా  విజిల్ కొట్టి ఎంజాయ్ చేశాను. రవితేజతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెట్లో ఎప్పుడూ సరదాగా ఉంటూ మా అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు.  స్టంట్ శివ మాస్టర్ చాలా బయపెట్టాడు. విష్ణు లార్జన్ ధన్ లైఫ్ అన్నట్లుగా సూపర్బ్ విజువల్స్ ఇచ్చారు. సినిమాకి థమన్ ఇచ్చిన ఆర్ ఆర్ బుజ్ బమ్స్ వస్తున్నాయి. సముద్రఖని గారితో యాక్ట్ చేయాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాను. అది ఈ సినిమాతో తీరింది. తెలుగులో నాకు పెద్ద కెరీయర్ ని, లైఫ్ ని  జయమ్మ క్యారెక్టర్ ద్వారా ఇచ్చిన గోపిచంద్ కి, మధు, అమ్మిరాజు గారికి  నా థాంక్స్ అన్నారు.

సినిమా చూసాక నాకే భయం వేసింది!!
 
నటుడు సముద్రఖని  మాట్లాడుతూ.. ‘ కటారి కృష్ణ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. గోపిచంద్ ఏమి చెబితే అది బ్లాంక్ గా చేశాను. ప్రతిదీ యాక్ట్ చేసి చూపించాడు. నేను అలాగే చేశాను. వరలక్ష్మీ ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మెన్స్ చేసింది. రవితేజ ఇంకా హైలో చేయి అంటూ ఒక ఎనర్జీ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. నా ఇంట్రడక్షన్ సీన్ కి థమన్ థీమ్ చూసి నాకే భయం వేసింది. క్రాక్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, ఫాన్స్ అందరికీ థాంక్స్. దేవుడు మాతోనే వున్నాడు. వెరీ వెరీ హ్యాపీ అన్నారు.

ఈ క్రెడిట్ అంతా ఆయనదే,!!
 
సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ.. ‘ 2021లో క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ తో మా జర్నీ స్టార్ట్ అయింది. ప్రేక్షకులు ఐదురోజుల ముందే మాకు పండగ చూపించారు. గోపి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు. ఆర్ ఆర్ చేసేటప్పుడే ఇది పెద్ద హిట్ అని గోపీకి చెప్పాను. ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది.  విష్ణు అంత గ్రాండియర్ గా విజువల్స్ ఇచ్చాడు. అవి చూసి ఛాలెంజింగ్ తీసుకొని మ్యూజిక్ చేసాను. రవితేజతో కిక్ నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను. క్రాక్ లెవెంత్ ఫిల్మ్.  నేను ఎక్కువ సినిమాలు చేసిన హీరో రవితేజ. ఆయనలో తెలీని ఒక మ్యాజిక్ ఉంటుంది. అది పట్టుకోవడం చాలా కష్టం. రవి గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా మ్యూజిక్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు.అందరికీ నా థాంక్స్ అన్నారు.

ఇది క్రాక్ బ్లాక్ బస్టర్!!
 
మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘ నా కేరియర్ లో క్రాక్ చాలా ముఖ్యమైన సినిమా. ఎందుకంటే ఇప్పటివరకు రకరకాల జోనర్స్ లో సినిమాలకి మాటలు రాశాను. అందులో    75% శాతం సక్సెస్ రేట్ ఉంది. అవన్నీ మాస్ మెచ్చిన క్లాస్ సినిమాలు. క్లాస్ మెచ్చే మాస్ ఫిలిమ్స్ కూడా రాయగలను. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే టైములో గోపి నాకు క్రాక్ కథ చెప్పాడు. విన్న వెంటనే ఇది ష్యుర్ షాట్ హిట్ అని చెప్పాను. తర్వాత నిర్మాత మధు గారు సాయి కథ ఎలావుందీ అని అడిగారు. ఈ సినిమా హిట్  కాకపోతే నేను అభిప్రాయాలు చెప్పడం మానేస్తాను సర్ అని చెప్పాను. కథలోని క్యారెక్టర్స్ అన్నీ నేలమీద సాగు చేసేవిధంగా ఉన్నాయి. కళ్ళ ముందు కనపడే పాత్రలు. ఒక మాస్ సినిమాలో రియలిస్టిక్ పాత్రలు నేచురల్ గా కనిపించడం చాలా రేర్. బ్లాక్ బస్టర్ లు చాలా ఉంటాయి. ఇది క్రాక్ బ్లాక్ బస్టర్. ఇంత మంచి హిట్ సినిమాలో భాగం చేసిన గోపిచంద్, రవితేజ, మధులకు నా థాంక్స్. క్రాక్ ని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు తలవంచి నమస్కరిస్తున్నాను అన్నారు.