కపటధారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
ఫిబ్రవరి 19న విడుదలవుతున్న `కపటధారి` సినిమా చాలా పెద్ద హిట్ కావాలి: కింగ్ నాగార్జున
`సుబ్రహ్మణ్యపురం`, `ఇదంజగత్` చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `కపటధారి`. డిఫరెంట్ కథా చిత్రాలు, విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సుమంత్ మరో వైవిధ్యమైన పాత్రలో నటించిని కపటధారి చిత్రం ఫిబ్రవరి 19న విడుదలవుతుంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై కపటధారి చిత్రాన్ని డా.ధనంజయన్ నిర్మించారు. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టిక్కెట్టును విడుదల చేశారు.
ఈ సందర్భంగా… .
కింగ్ నాగార్జున మాట్లాడుతూ – “`కపటధారి` సినిమా గురించి విన్నాను. సినిమాను ముందుగా కన్నడలో తీశారు. అక్కడ సినిమా కమర్షియల్‌గానే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుందని తెలిసిందని తెలిసింది. తెలుగులో సినిమా చాలా బాగా వచ్చిందని సుమంత్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. రేపు ఫిబ్రవరి 19న అది నిజం కావాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కోవిడ్ సమయంలో మేం సినిమాలను రిలీజ్ చేయడానికి భయపడ్డాం. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? లేదా అని అనుకున్నాం. అయితే మొన్న సంక్రాంతికి క్రాక్ సినిమా ఆ భయాలను పోగొట్టింది. ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చారు. సక్సెస్ చేశారు. అలాగే ఉప్పెన సినిమా హ్యూజ్ సక్సెస్ కొత్త హీరో వైష్ణవ్‌కి ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఇవన్నీ మాకే కాదు.. సుమంత్‌కి, ధనంజయ్‌కి, కపటధారి టీమ్‌కు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చింది. ట్రైలర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సుమంత్‌కు రోల్ బాగా సూట్ అయ్యింది. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఈ సినిమాతో పరిచయం అవుతున్న ప్రదీప్ కృష్ణమూర్తికి, నిర్మాత ధనంజయ్‌కు, నందితా శ్వేతకు ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు“ అన్నారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ – “ఇండస్ట్రీకి తొలిసారి వచ్చినప్పుడు నాకెవరూ తెలియదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో ట్రేడ్ గైడ్ ఓపెన్ చేసి ఏ స్టూడియోకి వెళ్లాలా అని ఆలోచించాను. అప్పుడు నాకు అన్నపూర్ణ స్టూడియో పేరు కనిపించింది. అలా నేను అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెట్టాను. అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. ఇక కపటధారి విషయానికి వస్తే సుమంత్ నాకు చాలా మంచి మిత్రుడు. ట్రైలర్, టీజర్, పాట అన్నీ బాగా నచ్చాయి. నిర్మాత ధనంజయ్గారికి థాంక్స్. నాగార్జున వంటి స్టార్ ఈ సినిమా వేడుకకి రావడంతో సినిమాపై ఉన్న కోణం మారుతుంది. మా గూఢచారి సినిమా సమయంలో ఆయన ప్రెజెంట్ చేసిన చిలసౌ సినిమా థియేటర్స్‌లో ఉన్నప్పటికీ ఆయన మా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. అంత మంచి హృదయమున్న వ్యక్తి ఆయన. ఆయన తన విషెష్ చెప్పడానికి వచ్చారంటే సినిమా తప్పకుండా బావుంటుందనే భావిస్తున్నాను. ఫిబ్రవరి 19న ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ – “నేను డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. జయాపజయాలు గురించి ఆలోచించలేదు. అందుకు ఇన్స్పిరేషన్ మా చిన్న మావయ్యే. నా ఉద్దేశంలో తెలుగు ఇండస్ట్రీలో ప్రతి జోనర్‌ను టచ్ చేసిన హిట్ చేసిన హీరో ఆయనే. ఆయన మాక సపోర్ట్ చేయడానికి ఇక్కడకు వచ్చినందుకు ఆయనకు థాంక్స్. అలాగే నా స్నేహితుడు అడివిశేష్‌కు థాంక్స్. సినిమాల ఎంపికలో మా చినమావయ్యను ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నాను. గౌరి, సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీరావా.. ఇలా వైవిధ్యమైన జోనర్ సినిమాలు చేశాను. అలాగే కపటధారి అనే డిఫరెంట్ జోనర్ మూవీని ట్రై చేశాను. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. చాలా ఫెంటాస్టిక్ టీమ్‌తో పనిచేశాను. సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఆల్రెడీ రెండు భాషల్లో సినిమా ఏంటో ప్రూవ్ చేసుకుంది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమాను చూసిన వారందరూ అప్రిషియేట్ చేశారు. దీంతో సినిమాపై మాకు నమ్మకం మరింత పెరిగింది. కోవిడ్ తర్వాత బాగున్న ప్రతి సినిమాను ప్రేక్షకులు చూసి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అదే మా కపటధారి చిత్రానికి కూడా కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను“ అన్నారు.
నిర్మాత ధనంజయ్ మాట్లాడుతూ – “నాగార్జునగారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయన స్పెషల్ థాంక్స్. అలాగే అడివిశేష్గారికి ధన్యవాదాలు. `కపటధారి` సినిమా కన్నడ మూవీ `కావలుధారి`కి రీమేక్. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు పెద్ద ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే కన్నడలో చాలా పెద్ద హిట్ అయ్యింది. తెలుగు స్క్రీన్‌ప్లే సమయంలో భాషా శ్రీ ఎంతగానో సపోర్ట్ చేశారు. అలాగే హీరో సుమంత్ గారు కూడా స్క్రీన్‌ప్లే విషయంలో నాతో బాగా డిస్కస్ చేస్తూ వచ్చారు. ఆయన హీరోగానే కాదు, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నటించారు. ఈ సినిమాలో ఇంత బాగా వచ్చిందంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ కారణం. మా ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయారు. ఇండియన్ సినిమాకే తెలుగు సినీ ఇండస్ట్రీ ఓ బెంచ్ మార్క్‌లా మారిపోయింది. డిసెంబర్ 25 నుంచి ప్రతి వారం ఓ సినిమా విడుదలవుతుంది. ప్రతి వారం ఓ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండియన్ సినిమాను లీడ్ చేస్తుందనే నమ్మకం పెరిగింది. అలాంటి ఇండస్ట్రీలో మేం కూడా పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కంప్లీట్ ఎంగేజింగ్ క్రైమ్ డ్రామా. ఓ స్టోరిని ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది“ అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి మాట్లాడుతూ – “సుమంత్‌గారితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కన్నడ మూవీ కావలుధారి సినిమాకు ఇది రీమేక్. తెలుగు, తమిళంలో నేనే డైరెక్ట్ చేశాను. ధనంజయ్‌గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరోయిన్ నందితా శ్వేత తదితరులు పాల్గొన్నారు.