
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ 22వ చిత్రం
డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించనున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సోమవారం(జూలై5), కళ్యాణ్‌రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ఇదే బ్యానర్‌లో ఇంతకు ముందు కళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం `118`సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. మరోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్‌లో కళ్యాణ్‌రామ్ చేయబోయే సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. చిత్ర దర్శకుడు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ సభ్యులు తెలియజేశారు.