ఖిలాడి చిత్రం ప్రారంభం
రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు కాంబినేషన్ ఫిల్మ్ ‘ఖిలాడి’ లాంఛనంగా ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందించే యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో హవీష్ క్లాప్ కొట్టగా, ఐ. శ్రీనివాసరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఆదివారం ఉదయమే విడుదల చేసిన ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అన్నివైపుల నుంచీ అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. టోటల్ బ్లాక్ డ్రస్‌లో తనదైన స్టైల్ డాన్స్ మూవ్‌తో ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకుంటున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.
రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
హవీష్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్) సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి నాయికగా నటించే ఈ చిత్రంలో డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్గా ఎంపికయ్యారు.
ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో రమేష్ వర్మ ‘ఖిలాడి’ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్, ‘లూసిఫర్’ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ వంటి టెక్నీషియన్లతో ఆయన పర్ఫెక్ట్ టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు.
శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
‘రాక్షసుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో తమది సూపర్ హిట్ కాంబినేషన్ అని సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో, ఉన్నత ప్రమాణాలతో తీసేందుకు వారు రెడీ అవుతున్నారు.
నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నది.
తారాగణం:
రవితేజ, మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్లు: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్)
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: సుజిత్ వాసుదేవ్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా, సాగర్
ఎడిటింగ్: అమర్ రెడ్డి
పాటలు: శ్రీమణి
ఆర్ట్: గాంధీ నడికుడికర్