ఖుషి చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ, సమంత ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ “ఖుషి”
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమా “ఖుషి” ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని
నిర్మిస్తోంది. వై రవిశంకర్, నవీన్ యేర్నేని నిర్మాతలు.
గత నెల 23 తేదీ నుంచి కశ్మీర్ లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలు పెట్టారు.అక్కడి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఫస్ట్
షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం గ్రూప్ ఫొటో దిగారు. కశ్మీర్ షెడ్యూల్ అమోజింగ్ ఫీల్ ఇచ్చింది, విజయ్, సమంతతో పాటు యూనిట్ అందరికీ కంగ్రాంట్స్ అంటూ దర్శకుడు శివ నిర్వాణ ట్వీట్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నారు.
నెక్స్ట్ త్వరలోనే హైదరాబాద్ మొదలవుతుంది. ఆ తర్వాత వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ చేయనున్నారు. ఇటీవలే విడుదల చేసిన “ఖుషి” టైటిల్,ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం,కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు
చేస్తోంది.
నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ,
రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య
ప్రదీప్ తదితరులు.
టెక్నికల్ టీమ్:
ఆర్ట్: ఉత్తర్ కుమార్, చంద్రిక
ఫైట్స్: పీటర్ హెయిన్
రచనా సహకారం: నరేష్ బాబు.పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: శివ నిర్వాణ.