Reading Time: 2 mins

ఖుషీ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

స్టోరీ లైన్ :

లెనిన్ సత్యం (సచిన్ ఖేడేకర్) నాస్తిక సంఘం అధ్యక్షుడు. అతని కొడుకు విప్లవ్ (విజయ్ దేవరకొండ), విప్లవ్ BSNL ఎంప్లాయ్, చదరంగం శ్రీనివాస రావు (మురళి శర్మ) బ్రాహ్మణుడు, అతని కూతురు ఆరాధ్య (సమంత ). ఆరాధ్య కాశ్మీర్ కు ఆఫీస్ క్యాంపు పని మీద వెళ్తుంది. విప్లవ్ కు కాశ్మీర్ BSNL ఆఫీస్ కు ట్రాన్స్ ఫర్ అవుతుంది. అక్కడ ఆరాధ్య ను చూసి ఇష్టపడతాడు. ఆరాధ్య నేను ముస్లిం అని అబద్దం చెబుతుంది అయినా విప్లవ్ ఆమెను ఇష్టపడుతుంటాడు. ఆరాధ్య విప్లవ్ కు ముస్లిం కాదు అని నిజం చెబుతుంది. తర్వాత హైదరాబాద్ కు ఇద్దరు వస్తారు. ఇద్దరి తల్లి తండ్రుల ఆచారాలు, సంప్రదాయాలు వేరు కాబట్టి  వీళ్ళ పెళ్లి కి ఒప్పుకోరు. ఆరాధ్య తండ్రి వీళ్ళ ఇద్దరి జాతకాలు కలవవు అని, పెళ్లి అయినా తర్వాత వీళ్లకు పిల్లలు పుట్టరు అని చెబుతాడు. దాంతో తల్లి తండ్రులను ఎదిరించి ఆరాధ్య, విప్లవ్ పెళ్లి చేసుకుంటారు. తరువాత ఆరాధ్య, విప్లవ్ కు పిల్లలు పుట్టారా?…. లేదా? …. వీళ్ళ మధ్యన సమస్యలు ఎలా వచ్చాయి.. వీళ్ళు దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది సినిమాలో చూడొచ్చు.

ఎనాలసిస్ :

ఆచారాలు, సంప్రదాయాల కంటే భార్య భర్తల మధ్యన ప్రేమే ముఖ్యం అని చెప్పే సినిమా

ఆర్టిస్ట్
ఫెరఫార్మెన్స్ :

సమంత, విజయ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ పెర్ఫార్మన్స్ బాగుంది

టెక్నికల్
గా :

కెమెరా పనితనం, కాశ్మీర్ లొకేషన్స్ బాగున్నాయి

చూడచ్చా :

ఒక్కసారి చూడొచ్చు

ప్లస్
పాయింట్స్ :

పాటలు, విజయ దేవరకొండ, సమంత పెర్ఫార్మన్స్ బాగున్నాయి

మైనస్
పాయింట్స్ :

స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం
అర్ధం కానీ సీన్స్

నటీనటులు:

విజయ్ దేవరకొండ, సమంత, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, సచిన్ ఖేద్ కర్

సాంకేతికవర్గం
:

సినిమా టైటిల్ : ఖుషీ
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్ : 01-09-2023
సెన్సార్ రేటింగ్ : “U/A”
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ: జి మురళి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
రన్ టైమ్ : 165 నిమిషాలు

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్