గద్దలకొండగణేష్ చిత్రం వైజాగ్ సక్సెస్ మీట్
‘గద్దల కొండ గణేష్’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి థాంక్స్ -వైజాగ్ గ్రాండ్ సక్సెస్ మీట్ లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘గద్దలకొండగణేష్’. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలయ్యి మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌తో సూపర్‌హిట్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 27న వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో..
నటి డింపుల్ హయాతి మాట్లాడుతూ – “నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్సర్కి థాంక్స్. అందరూ స్పెషల్‌సాంగ్ చాలా బాగుంది అని స్టేజి ఎక్కి మరి డాన్స్ వేస్తున్నారు. 4 రీల్స్ ప్లస్ బేనర్లో నేను మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను” అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ – ” గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాలో నా లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాను. హరీష్ గారు అన్ని రూల్స్ బ్రేక్ చేసి కొత్తగా ఆర్టిస్టులను ఎంపిక చేశారు. వరుణ్ ఈ క్యారెక్టర్ లో జీవించేశారు” అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ – ” గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాలో నా లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాను. హరీష్ గారు అన్ని రూల్స్ బ్రేక్ చేసి కొత్తగా ఆర్టిస్టులను ఎంపిక చేశారు. వరుణ్ ఈ క్యారెక్టర్ లో జీవించేశారు” అన్నారు.
హీరోయిన్ మృణాళిని రవి మాట్లాడుతూ – ” నేను మొదటి సారి వైజాగ్ వచ్చాను. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి వరుణ్, హరీష్, మా నిర్మాతలే కారణం. ఈ సినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బుజ్జమ్మ క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
చిత్ర నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ – ”విజయవాడలో సక్సెస్ టూర్ స్టార్ట్ చేశాం. ఈరోజు వైజాగ్ తో టూర్ ముగిస్తున్నాం. మీ అందరిని కలుసుకోవాలని ఈ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అలాగే ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అన్నారు.
చిత్ర నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ – ”విజయవాడలో సక్సెస్ టూర్ స్టార్ట్ చేశాం. ఈరోజు వైజాగ్ తో టూర్ ముగిస్తున్నాం. మీ అందరిని కలుసుకోవాలని ఈ మీట్ పెట్టడం జరిగింది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అలాగే ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు” అన్నారు.
పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ – ”ఇంకో ఆరు గంటల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని టైటిల్ మార్చినా అందరూ హీరోల ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. ఈ వేదిక మీదినుండి అందరి హీరోలకి, వారి ఫ్యాన్స్ కి మనస్ఫూర్తిగా థాంక్స్ చెపుతున్నాను. ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్. నేను ఒక స్క్రిప్ట్ అనుకోని ఇద్దరు హీరోలతో ఒక సినిమా చేద్దాం అని బయలుదేరినప్పుడు ఒక థాట్ కి వరుణ్ సీడ్ వేశారు. ఆ థాట్ నా సినిమా మేకింగ్ స్టైల్ ని మార్చింది. ఫస్ట్ టైమ్ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా నేనో సినిమా తీశాను. నేను సినిమా చేస్తున్నంత సేపు నన్ను నమ్మి చేసినందుకు వరుణ్ కి మరో సారి థాంక్స్. ఒక్కసారి ‘గద్దల కొండ గణేష్’ గెటప్ లో వరుణ్ కెమెరా ముందుకు రాగానే నాకు చాలా ఎనర్జీ వచ్చింది. వరుణ్ తన డెడికేషన్, హార్డ్ వర్క్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. నేను మనసులో ఏది అనుకుంటే అది స్క్రీన్ మీదకు రావడానికి మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట , గోపి ఆచంట నాకన్నా ఎక్కువ ఫ్యాషనేట్ గా పని చేశారు. ‘జిగర్తాండ’ సినిమా వరుణ్‌తో చేస్తున్నాం..అన్నప్పుడు వరుణ్ ఏ క్యారెక్టర్ చేస్తాడు అని కూడా అడగకుండా వెంటనే రైట్స్ తీసుకున్నారు. నేనంటే వాళ్లకు అంత నమ్మకం. ఈ 14 రీల్స్ ప్లస్ బేనర్ నా సినిమాతో స్టార్ట్ అవడం సంతోషంగా ఉంది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’ ఫంక్షన్ ఇక్కడే జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఈ సక్సెస్ ఫంక్షన్ జరగడం హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ మీట్ ను ఇంత భారీగా జరిపినందుకు శ్రేయాస్ మీడియా వారికి కృతజ్ఞతలు. పవర్ స్టార్ గారు వచ్చే వారంలో ఈ సినిమా చూస్తారు. మేమందరం సినిమాను ప్రేమించాం అందుకే సినిమా మమల్ని ప్రేమించింది “అన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ” మా ‘గద్దల కొండ గణేష్’ సినిమాకు మంచి అప్రిసియేషన్ రావడం వల్ల సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. విజయవాడలో స్టార్ట్ చేశాం. ఈరోజు వైజాగ్ తో టూర్ ముగిస్తున్నాం. సినిమాని నాకు పరిచయం చేసింది వైజాగ్. నేను నటనలో శిక్షణ తీసుకుంది కూడా ఇక్కడే. మా గురువు గారు సత్యానంద్ గారి దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ విధంగా సినిమా వల్ల నాకు వైజాగ్ కి గొప్ప రిలేషన్ షిప్ ఏర్పడింది. మీ అందరూ సినిమాను ప్రేమించినంత కాలం మేము మంచి సినిమాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం.. ప్రతి ఒక్కరికీ థాంక్స్. హరీష్ గారు బాబాయ్ కి ‘గబ్బర్ సింగ్’ తో ఎంత మంచి సినిమా ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అంత పెద్దది కాకపోయినా నాకు ‘గద్దల కొండ గణేష్’ ఇచ్చారు. ఈ సినిమాతో అధర్వ నాకు మరో బ్రదర్ అయ్యారు. ఐనాంక బోస్ విజువల్స్ చాలా బాగున్నాయి. పూజ నా ఫస్ట్ హీరోయిన్. మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి చాలా కష్టాలు పడ్డాం. కొన్ని సార్లు షూటింగ్ ఆపేసారు. రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా ఒక మంచి సినిమా మీకివ్వాలనే సంకల్పం మమల్ని ముందుకు నడిపింది. సినిమా డబ్బు, పేరు ఇస్తుంది అని విన్నాం.. కానీ ఇంత ప్రేమ ఇస్తుందని ఇలా మీ అందర్నీ చూస్తుంటే అనిపిస్తుంది. మీ అభిమానం చూస్తుంటే ఎంత చేసిన తక్కువే అనిపిస్తుంది. మీ అభిమానం కోసం నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. ఇంత పెద్ద హిట్ చేసినందుకు మెగా ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి థాంక్స్. నేను చాలా సార్లు బాబాయ్ పేరు చెప్పగానే మీరు అరుస్తుంటే నేను స్టేజ్ కి అటువైపు ఉండాలి కదా అనుకునే వాడిని. నా నెక్స్ట్ సినిమా షూటింగ్ ఇక్కడే చేస్తున్నాను. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు సత్య, రచ్చ రవి, లైన్ ప్రొడ్యూసర్ హరీష్ కట్టా తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు సత్య, రచ్చ రవి, లైన్ ప్రొడ్యూసర్ హరీష్ కట్టా తదితరులు పాల్గొన్నారు.