గని మూవీ రివ్యూ

Published On: April 8, 2022   |   Posted By:

గని మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ ‘గని’రివ్యూ

👎

వరుణ్ తేజ్ కెరీర్లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్.. గని. గద్దలకొండ గణేష్  వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత మూడేళ్లకు అతడి నుంచి వచ్చిన  సినిమా ఇది. వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించారు. బిజినెస్ కూడా బాగా చేసారు. ఈ క్రమంలో  ‘గని’ మీద ఉన్న ఎక్సపెక్టేషన్స్ ప్రకారం చూస్తే మామూలు టైంలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ డేడ్ ఈజీ.  కానీ ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా థియేటర్లలో ఉంది. బాగుంటేనే జనం ఇటు కదులుతారు. మరో ప్రక్క ‘గని’ రిలీజైన ఆరు రోజులకే ‘బీస్ట్’, తర్వాతి రోజు ‘కేజీఫ్-2’ మంచిఎక్సపెక్టేషన్స్ మధ్య రిలీజవుతున్నాయి. ఈ వారంలోనే జనాలను థియోటర్స్ వైపు పరుగెట్టించగలగాలి. మరి జనాలను తనవైపు ఈ చిత్రం తిప్పుకోగలిగిందా? అసలు ఈ చిత్రం కథేంటి…వంటి విషయాలను చూద్దాం.

Storyline:

గని (వరుణ్ తేజ్) కు ఒకటే కల..పెద్ద భాక్సర్ అవ్వాలని.ఎందుకంటే అతని తండ్రి విక్రమాదిత్య (ఉపేంద్ర) ఒకప్పుడు ఫేమస్ భాక్సర్. అయితే డ్రగ్స్ వాడాడనే ఆరోపణలతో ఆట నుంచి వైదొలగాల్సిన పరిస్దితి వస్తుంది. గని అతన్ని అసహ్యించుకుంటూ పెరుగుతాడు. తను నేషనల్ ఛాంపియన్ గా నిలిచిన తన కుటుంబానికి ఉన్న చెడ్డ పేరుని తుడిచేయాలనేది గని లక్ష్యం. అందుకోసం రాత్రింబవళ్లూ కష్టపడతాడు. చివరకు తల్లి మాధురి (నదియా)కు భాక్సింగ్ రింగ్ లోకి వెళ్లను అని ఇచ్చిన మాటను సైతం ప్రక్కన పెట్టేస్తాడు. అయితే  గని ఓ రోజు విజయేంధర్ సిన్హా (సునీల్ శెట్టి ) వలన తన తండ్రి గురించి ఓ నిజం తెలుస్తుంది. అదేమింటంటే…తన తండ్రి అందరు అనుకున్నట్లు డ్రగ్స్ తీసుకోలేదని, అలా ఇరికించారని. అందుకు కారణం ఈశ్వర్ (జగపతి బాబు) అని. ఇప్పుడు కూడా గనికి ఈశ్వర్ వలన ఛాలెంజ్ లు ఎదురౌతాయి.  వాటిన్నటినీ దాటుకుని గని తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. తనం తండ్రిపై, తద్వారా తన కుటుంబంపై పడిన మచ్చని తొలిగించుకుని విజేతగా నిలుస్తాడు.

Screenplay Analysis:

స్పోర్ట్స్ కథలన్నీ దాదాపు ఒకే ఫార్ములాలో వుంటాయి. హీరోకి ఆట పై ప్యాషన్ వుండటం. లక్ష్యం  చేరే ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు, ఎత్తుపల్లాలు .. వాటిని అధికమించి చివరికి హీరో విజయాన్ని అందుకోవడం.  అయితే ఈ ఫార్ములాని ఎవరు బ్రేక్ చేస్తారా అని సగటు సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తూంటాడు. తెలిసిన కథను తలకెత్తుకోవటానికి రాడుకదా. అయితే స్టోరీ లైన్ రాసుకునేటప్పుడు  కొత్తగా అనిపించి ఉండవచ్చు. కానీ ట్రీట్మెంట్ రాసుకునేటప్పుడే అది ఫార్ములాలోకి వచ్చి చేరిపోతుంది. అప్పుడే సమస్య వచ్చేస్తుంది. గని కథ  కూడా  ఫార్ములా ట్రాప్ లోనే ఇరుక్కుూంది. ఈ కథలో ఉన్న ఏకైక  కొత్త పాయింట్ (అనుకుంటే)  తన తండ్రి ఆశయాలని నెరవేర్చే  కొడుకు కథ.  ఈ కథని డీల్ చేసిన విధానం ఈ స్టోరీ లైన్ అంత పాతగా ఉంది.

వాస్తవం  చెప్పాలంటే మాగ్జిమం ఆడియన్స్ …సినిమాలో మెయిన్  క్యారక్టర్ లేదా ఓ టీమ్ ఆటలో గెలిచి,టాప్ లో ఉండటం అనే విషయం చూడటానికి సినిమాకు వెళ్లరు. అందులో కొత్త ,బలమైన కాంప్లిక్ట్స్, ట్విస్ట్ లు ఆశిస్తారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనేది తప్పిస్తే దాన్ని మామూలు కమర్షియల్ సినిమాగానే చూస్తారు. అందుకే స్పోర్ట్స్ డ్రామాల్లో కాంప్లిక్టే ప్రధానంగా మిగతా ఎలిమెంట్స్ ని డ్రైవ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆ కాంప్లిక్ట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే హీరోకు ఎదురయ్యే ఇబ్బందులు, ఎదుర్కొనే సమస్యలు అసలు మామూలు వాడు ఎదుర్కోలేడేమో అనిపించాలి. అసలు హీరో ఈ గేమ్ లో గెలుస్తాడా, అనే సస్పెన్స్  క్రియేట్ కావాలి. అయితే ఇక్కడ ఐరనీ ఏంటంటే ప్రేక్షకుడుకి స్పష్టంగా తెలుసు..ప్రధాన పాత్ర ఎలాగైనా సినిమా చివరకు వచ్చేసరికి గెలిచేస్తుందని. కానీ ఆ గెలవటం ఎలా అన్నది గొప్పగా గనిలో చూపలేకపోయారు.

ఈ సినిమాకి ఒక కథ అనుకున్నప్పుడు ‘వావ్’ అనుకునే కొన్ని సీన్లు కన్సీవ్ చేసినట్లు లేరు.  ‘గని’ సినిమా మొదలు  నుంచి చివరి దాక అలా అలా నడిచిపోతుందే కానీ అరే భలే ఉందిరా అన్న ఫీల్ తెచ్చే సీన్ ఒక్కటీ ఉండదు. ఉన్న సీన్స్ కూడా గతంలో చాలా సినిమాల్లో చూసినవే. లవ్ స్టోరీ అయితే ఎలాంటి క్లారిటీ ఉండదు. ఫస్టాఫ్ లో కథ లేక హీరోయిన్ తో ఏదో అలా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లా సీన్స్ వేసుకుంటూ వెళ్లిపోయారు. ఉన్నంతంలో సెకండాఫ్ లో వచ్చే ఉపేంద్ర ప్లాష్ బ్యాక్ బెస్ట్. ఆ తర్వాత అంతా భాక్సింగ్ లో చూసుకుందాం అని ప్రేక్షకుడుకి సవాల్ విసిరినట్లే ఉంటుంది.

Analysis of its technical content:

స్క్రిప్టు పరంగానే ఈ సినిమా ఫెయిలైందని చెప్పాలి. ఆ తర్వాత దర్శకుడు ఈ తరహా కథని తన తొలి సినిమాకే ఎంచుకోవటంతో  తడబాటు స్పష్టంగా సీన్స్ లో కనపడింది.హీరో ఎంట్రీ, బిల్డప్ సీన్స్ మీద పెట్టిన దృష్టి కీలకమైన ఎమోషన్ సీన్స్ పై పెట్టలేదు.  ఇక మిగతా టెక్నీషియన్స్ లో కెమెరా డీల్ చేసిన  జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ వర్క్ అవుట్ స్టాండర్డ్ గా ఉంది. థమన్ ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది ..పాటల్లో సత్తా లేదు. ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్ గా చేసి ఉంటే సాగతీసిన ఫీలింగ్ వచ్చేది కాదు. నిర్మాతలు అల్లు బాబీ, సిద్దు ముద్ద  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో …..వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని అర్దమవుతోంది. చాలా నాచురుల్ గా  కనిపించాడు. కొన్ని సీన్స్ లో  రియల్ బాక్సర్ లా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్ ని కూడా బాగా చేసాడు.  హీరోయిన్ సాయీ మంజ్రేకర్ చూడ్డానికి బాగుంది కానీ   పాధాన్యత లేని పాత్ర. సెకండ్ హాఫ్ లో ఒక్క డైలాగ్ కూడా లేదు. ఉపేంద్ర మాత్రం ఫెరఫెక్ట్ ఛాయిస్. సునీల్ శెట్టి ఈ వయసులో కూడా ఫిట్ గా ఉన్నారు. సెకండ్ హాఫ్ లో జగపతి బాబు పాత్ర విలనీ కొత్తగా కాదు కానీ బాగుంది.

CONCLUSION:
చూడొచ్చా

స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడేవారు కూడా ఇష్టంగా చూడటం కష్టమే

తెర వెనక.. ముందు
న‌టీన‌టులు: వ‌రుణ్‌తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి, న‌వీన్‌చంద్ర‌, న‌దియా, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, త‌మ‌న్నా (ప్ర‌త్యేక‌గీతంలో) త‌దిత‌రులు;
ఛాయాగ్ర‌హ‌ణం:  జార్జ్ సి.విలియ‌మ్స్‌;
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ర‌వీంద‌ర్‌;
కూర్పు:  మార్తాండ్ కె.వెంక‌టేష్‌;
స‌ంగీతం: త‌మ‌న్‌,
స‌మ‌ర్ప‌ణ‌: అల్లు అరవింద్‌;
నిర్మాణం: సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ;
ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ కొర్ర‌పాటి;
సంస్థ‌లు: అల్లు బాబీ కంపెనీ, రినైస్సెన్స్ పిక్చ‌ర్స్
Runtime:149 minutes
విడుద‌ల‌: 8-04-2022