గాడ్సే మూవీ రివ్యూ

Published On: June 17, 2022   |   Posted By:

గాడ్సే మూవీ రివ్యూ

సత్యదేవ్ ‘‘గాడ్సే’’ రివ్యూ

Emotional Engagement Emoji
👎

సత్యదేవ్ ని ఓటీటీ హీరో అనే ముద్ర వేసేసారు. థియోటర్ లో కన్నా ఆయన సినిమాలోనే ఎక్కువ ఆడుతున్నాయి. అయితే ఆయన థియోటర్స్ పై తన సినిమాలతో ఎప్పటికప్పుడు దండ యాత్ర చేస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ తిమ్మరుసుతో థియేటర్లలో సందడి చేశాడు సత్యదేవ్. తాజాగా ‘‘గాడ్సే’’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. డైరెక్టర్ గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ

చాలా మంది హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు, మినిస్టర్స్ కిడ్నాప్ అవుతూంటారు. ఈ విషయం బయిటకు వస్తే రాష్ట్రంలో కలకలం పుడుతుందని ..సీక్రెట్ ఈ విషయం డీల్ చేస్తుంది. ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఆధ్వర్యంలో ఓ టీమ్ ని ఏర్పాటు చేస్తుంది. ఆమె ఇన్విస్టిగేట్ చేస్తూంటే…ఆ కిడ్నాపర్ మరెవరో కాదని..లండన్ నుంచి తెలుగు రాష్ట్రానికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) అనే బిజినెస్ మ్యాన్ అని రివీల్ అవుతుంది. దాంతో అతని మనస్సులో ఉన్న అసలు ఆలోచన ఏమిటి అనేది తెలుసుకోవాటనికి ఆమె నెగోషియోటర్ గా రంగంలోకి దిగుతుంది. అతనే ‘గాడ్సే’ పేరుతో ఈ కిడ్నాప్స్ ఎందుకు చేశాడో తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అసలు ఈ విషయం మొత్తాన్ని ఎందుకు సీక్రెట్ గా డీల్ చేయాలనుకుంటున్నారనే విషయం తెలుస్తుంది. గాడ్సే డిమాండ్స్ ఏమిటి… చివరకు ఏమైంది అనే విషయం తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ సినిమాలో హీరో కిడ్నాప్ లు అవీ చూస్తూంటే మనకు గతంలో నారా రోహిత్ చేసిన ప్రతినిధి సినిమా గుర్తుకు రాక మానదు. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సామాజిక అంశాలు చుట్టు తిరిగే కథలు గుర్తుకు వస్తాయి. అయితే వాటికి ..ఈ సినిమాకీ భిన్నం ఏమిటి అంటే డీల్ చేసిన విధానం. అయితే కథలో ఎక్కువ ప్రొసీడింగ్స్ ఉండి విసిగిస్తాయి. స్క్రీన్ ప్లే మ్యాజిక్ జరగలేదు. కథలో కంటెంట్ మాత్రం చాలా ప్రెడిక్టబుల్ గా జరుగుతుంది. ఇంట్రవెల్ దాకా కథలో ట్విస్ట్ రివీల్ కాదు. ఆ తర్వాత ఏమన్నా కొత్తగా ఉంటుందేమో అనుకుంటే చాలా పాత పద్దతిలో సినిమా సాగుతుంది. ప్లాష్ బ్యాక్ చాలా గందరగోళంగా సాగుతుంది. డ్రామా బాగానే ఉంటుంది, ఎమోషన్ ఉండదు. క్లైమాక్స్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు లైట్ తీసుకున్నాడు. కంటెంట్ కు దగ్గ ఆసక్తి కనిపించదు. సినిమా మొత్తం సాగుతూ పోతుంది. సత్యదేవ్ ఎంత సేపు అని మొయ్యగలడు.. చాలా సార్లు అతను వదిలేసాడు. అందులోనూ సందేశాలు చెప్పటం ఓ సగటు హీరో నుంచి అంటే స్టేజీపై నాటకం చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఏదైమైనా డైరక్టర్ రొటీన్ స్టోరీతో చాలా ప్రిడిక్టబిలిటీతో కథనం రాసుకున్నారు..సినిమాని ట్రీట్ చేశాడు. థియేటర్‌లకు వెంటనే వెళ్లి చూసేటంతగా ప్రేరేపించలేకపోయాడు.

టెక్నికల్ గా ..

డైరక్టర్ గా సినిమా అనుకున్న స్దాయిలో సీన్స్ పండించలేకపోయాడు. ఎక్కువ డైలాగ్స్ పై ఆధారపడ్డారు. ఇక సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ చెప్పుకోదగ్గ స్దాయిలో ఉంది. సునీల్ కశ్యప్ పాటలు బాగోలేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం నడుస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త పదను పెట్టాలి. చాలా చోట్ల బాగా స్లో అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగోలేవు. ఇంక ఈ సినిమాలో ఏదన్నా చెప్పుకునే విశేషం ఉందీ అంటే అది .. గోపీ గణేష్ రాసుకున్న డైలాగులు మాత్రమే.

నటీనటుల్లో … సత్యదేవ్ ఎప్పుడూ నటుగా ఫెయిల్ అవ్వలేదు. ఎప్పటిలాగే ఈ సినిమా మొత్తాన్నిమోసే ప్రయత్నం చేసారు. తమిళ అమ్మాయి ఐశ్వర్య బాగానే చేసింది. ప్రియదర్శి, నోయల్ సత్యదేవ్ ఫ్రెండ్స్ పాత్రల్లో బాగా చేశారు. ఇక మిగతా ఆర్టిస్ట్ లు ఓకే. రాహుల్ రామకృష్ణ, నాగబాబు కు చెప్పుకోదగన సీన్స్ లేవు. పృథ్వి రాజ్ కామెడీ బాగుంది.

చూడచ్చా

పనిగట్టుకుని వెళ్లి మరీ చూడాలనిపించే సినిమా మాత్రం కాదు.

నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, నోయెల్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో నాగబాబు, ప్రియదర్శి
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్
సంగీతం: శాండీ అద్దంకి
నిర్మాత: సి. కళ్యాణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
Run Time: 2hr 25 Mins
విడుదల తేదీ: జూన్ 17, 2022