గాలోడు మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్

Published On: May 19, 2021   |   Posted By:

గాలోడు మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్

సుడిగాలి సుధీర్ హీరోగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సూప‌ర్ హిట్ అయ్యింది. మళ్లీ ఈ సూప‌ర్‌హిట్ కాంభినేష‌న్‌లో ఒక ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ప్రారంభ‌మైంది. మే19 హీరో సుడిగాలి సుధీర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి `గాలోడు` అనే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్‌లుక్, మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. క్యాచీ టైటిల్‌తో పాటు ఇన్నోవేటివ్‌గా ఉన్న ఈ మోష‌న్‌పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సంస్కృతి ఫిలింస్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించనున్నారు.

ఈ సంద‌ర్భంగా…

ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ – “మాస్‌లో సుడిగాలి సుధీర్‌కి ఎంత ఇమేజ్ ఉందో చెప్ప‌డానికి  మా సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రానికి వ‌చ్చిన భారీ ఓపెనింగ్స్ నిద‌ర్శ‌నం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్నిభారీ ఎత్తున రూపొందిస్తున్నాం. ఈ రోజు సుధీర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా `గాలోడు` అనే టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. ఈ మూవీకి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.  

సుడిగాలి సుధీర్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,
ద‌ర్శ‌క‌త్వం:  రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.