గుట్టు చప్పుడు సినిమా ఫస్ట్ లుక్ విడుదల
చవితి, మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్‌గా ‘గుట్టు చప్పుడు’ ఫస్ట్ లుక్ విడుదల
డాన్ ఎంటర్ టైన్మెంట్ ( డ్రీమ్స్ ఆఫ్ నెట్వర్క్) బ్యానర్‌పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తోన్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణింద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి.. వినాయక చవితి పర్వదినం సందర్భంగానూ.. అలాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా చిత్ర ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత లివింగ్ స్టన్ మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవిగారి పుట్టినరోజు సందర్భంగా, మరియు వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాం. ఈ చిత్రాన్ని కొత్త తరహా కథనంతో రూపొందిస్తున్నాము. డైరెక్టర్ మಣಿಂద్రన్ ఈ చిత్ర కథను మలచిన విధానం, నేటి యువతీ యువకుల విచ్చలవిడితనానికి, బాధ్యతారాహిత్యాలకు, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది. లవ్, రొమాన్స్, త్రిల్లర్ కథనంగా ఈ సినిమా ఉంటుంది. డైరెక్టర్ మಣಿಂద్రన్, నా కాంబినేషన్లో, డాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లోనే, ఆల్రెడీ ఒక పెద్ద బడ్జెట్ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా, లాక్‌డౌన్ కారణంగా నిలిపి వేయవలసి వచ్చింది. ప్రస్తుత లాక్‌డౌన్‌లో కొన్ని షరతులతో కూడి ఉన్న షూటింగ్‌లను జరుపుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి నిచ్చింది కాబట్టి తక్కువ మంది టెక్నీషియన్స్‌తో, ప్రత్యేక లొకేషన్లలో ఈ కొత్త చిత్రం చేస్తున్నాము..’’ అని అన్నారు.
డైరెక్టర్ మಣಿಂద్రన్ మాట్లాడుతూ.. ‘‘ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్‌గారు, నేను ఆల్రెడీ చేస్తున్న చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆపాల్సి వచ్చినప్పటికీ, నేటి లాక్‌డౌన్ పరిస్థితులకు, షరతులకు అనువైన కథను రెడీ చేసి ప్రొడ్యూసర్‌గారికి చెప్పడం జరిగినది. కథ-కథనం బాగా నచ్చడం వెంటనే కొత్త సినిమాకు ఒప్పుకోవడంతో చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్‌ల ముఖ చిత్రాలు, పరిచయం మా సెకండ్ లుక్‌లో రిలీజ్ చేయబోతున్నాం. వినాయక చవితి సందర్భంగా మరియు మెగాస్టార్ చిరంజీవిగారి జన్మదిన శుభాకాంక్షలతో మా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాము. నాతోపాటు ముఖ్య టెక్నీషియన్లు వెంటనే స్పందించి సహకరించినందుకు ధన్యవాదాలు..’’ అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ కున్ని గుడిపాటి మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్‌గారు కథ చెప్పగానే, నాకు వెంటనే చాలా బాగా నచ్చేసింది. ఈ కరోనా కష్టకాలంలో, లాక్‌డౌన్ సమయంలో, కాంటెంపరరీ సబ్జెక్టు, చాలా గొప్పగా రెడీ చేశారు. అందుకే ఈ కథ చాలా కొత్తగా రాబోతుంది అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గార్లకు, నా కృతజ్ఞతలు..’’ అని అన్నారు.
రైటర్ వై. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. డైరెక్టర్‌గారు, ఈ కథ చెప్పగానే స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంది అనిపించింది. మీ అందరికి ఈ కథ కథనం బాగా నచ్చుతుంది. ప్రేక్షకులకు మనోభావాలకు దగ్గరగా ఉంటుంది అని భావిస్తున్నాను. ఈ సినిమా రాయడానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గార్లకు, నా కృతజ్ఞతలు.. అని తెలిపారు.
కెమెరామెన్ రాము మాట్లాడుతూ.. నేను ఇంతవరకు చేసిన మూవీస్ అన్నిటి కంటే.. ఈ కథ, స్క్రీన్‌ప్లే బేస్ చాలా కొత్తగా అనిపించింది. ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకొని ఒక మంచి అవుట్‌పుట్ ఇస్తాను. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.
ఎడిటర్ శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘కథ డైరెక్టర్‌గారు చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఈ చిత్రం ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఒక మంచి సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. ప్రొడ్యూసర్‌గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు:
ప్రొడ్యూసర్:లివింగ్ స్టన్
డైరెక్టర్: మಣಿಂద్రన్
మ్యూజిక్ డైరెక్టర్: కున్ని గుడిపాటి
రైటర్: వై సురేష్ కుమార్
కెమెరా: రాము CM
ఎడిటర్: శివ కుమార్