గుర్తుందా శీతాకాలం చిత్రo ప్రీ రిలీజ్ ఈవెంట్

Published On: December 7, 2022   |   Posted By:

గుర్తుందా శీతాకాలం చిత్రo ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబరు 9న గుర్తుందా శీతాకాలం గుర్తుపెట్టుకొండి – అడవి శేష్

టాలెంటెడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ యంగ్ హీరో సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టర్స్ తమన్నా జంటగా  న‌టించిన  సినిమా ‘గుర్తుందా శీతాకాలం.

క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు మ‌రియు న‌టుడు నాగ‌శేఖ‌ర్ ఈ చిత్రంతో  తెలుగులో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ , నాగ‌శేఖ‌ర్ మూవీస్ మరియు మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై నిర్మాత‌లు చింత‌పల్లి రామారావు, భావ‌న ర‌వి, నాగ‌శేఖ‌ర్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని చిన‌బాబు, ఎం, సుబ్బారెడ్ది లు స‌మ‌ర్సించ‌గా కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు,

చిత్రాన్ని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

అందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ప్రొడ్యూసర్ చింతపల్లి రామారావు మాట్లాడుతూ….
ముందుగా మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
హిట్ సినిమాతో హిట్ అందుకుని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన శేష్ గారికి కృతజ్ఞతలు.
ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించాం. దర్శకుడు నాగ శేఖర్ ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. డిసెంబరు 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని నమ్ముతున్నాను.

రైటర్ లక్ష్మీ భూపాల మాట్లాడుతూ…
ముందుగా మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇండస్ట్రీలో స్టార్ డం ఉన్న హీరోలు చాలామంది ఉన్నా ఒక పది పదిహేళ్ళకు ఒకడు వస్తుంటాడు.అలా చిరంజీవి గారు, రవితేజ గారు లాంటి వాళ్ళలానే ఇప్పుడు సత్య దేవ్ & అడవి శేష్ ఉన్నారు వాళ్ళకంటూ ఒక సెపరేట్ వే క్రియేట్ చేసుకున్నారు. వీళ్ల వే లోకి మరొకరు రావడానికి కూడా భయపడుతున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ మరియు తమన్నా కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.ఈ సినిమా అద్భుతంగా ఉంది.మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఈ సినిమాకి కాల భైరవ మంచి సంగీతం అందించారు.ఈ సినిమాను చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.మీకు నచ్చితే ఒకరికి అయినా చెప్పండి,నచ్చకపోతే వందమందికైనా చెప్పండి.

దర్శకుడు నాగ శేఖర్ మాట్లాడుతూ….
అందరికీ నమస్కారం, ఈ సినిమాను చాలా అందంగా తీసాను.ఈ సినిమా ఇలా రావడానికి కారణం అయినా మా హీరో సత్యదేవ్,తమన్నా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి కి కృతజ్ఞతలు. లక్ష్మి భూపాల గారు మంచి మాటలు రాశారు.కాల భైరవ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అందించారు.నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం. ఈ సినిమా చూస్తే మీరు ఒక చల్లని గాలిని ఫీల్ అవుతారు. ఈ సినిమా పనిచేసిన టెక్నీషయన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

పాన్ ఇండియా హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ…
అందరికీ నమస్కారం.నాకు మామూలగా సమ్మర్ అంటే ఇష్టం. కానీ ఈ సినిమాలో యాక్ట్ చేశాక శీతా కాలంపై ఇష్టం ఏర్పడింది.నేను ఈ సినిమాలో ఉన్నానని మర్చిపోయా.మళ్ళీ లవ్ స్టోరీ తో రీ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది.నేను సత్యదేవ్ ఉమ మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా చూసిన ఆయనతో సినిమా చేయాలనుకున్న ఈ అవకాశం వచ్చింది. చాలామంది కొత్త యాక్టర్స్ కి సత్యదేవ్ & అడవి శేష్ ఇన్స్పరేషన్.ఫైనల్ గా ఈ సినిమా డిసెంబరు 9న రిలీజ్ అవుతుంది.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ…
ముందుగా శేష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ,శేష్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చాడు.శేష్ కి హిట్ వస్తే నాకు వచ్చినట్టు ఫీల్ అవుతాను. అందరూ ఈ సినిమా నాది అని అనుకుంటున్నారు,కానీ ఈ సినిమా ఫస్ట్ తమన్నా ది,కావ్య ది,మేఘా ది దానిలో నేనొక పార్ట్.భూపాల అన్న మంచి మాటలు రాశాడు. దర్శకుడు నాగ శేఖర్ మా అందరిలో హ్యాపీనెస్ నింపుతూ ఉంటారు.మా నిర్మాతలకు చాలా థాంక్యూ.కాల భైరవ గురించి చెప్పాలి మా సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు.సినిమాలో ప్రతి సాంగ్ కి ఒక సాడ్ వెర్షన్ ఉంది.సినిమా చూశాక మీ ప్లే లిస్ట్ లోకి అది యాడ్ అయిపోతుంది.సినిమాలో పనిచేసిన టెకనీషియన్లకు శుభాకాంక్షలు తెలిపాడు.ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

అడవి శేష్ మాట్లాడుతూ…
సత్య నాకు చాలా మంచి ఫ్రెండ్. డైరెక్టర్ నాగ శేఖర్ కి ఈ సినిమా మైనా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.ఈ సినిమాకి మంచి మ్యూజిక్ అందించాడు కాల భైరవ.లక్ష్మి భూపాల గారు మీ రైటింగ్ నాకు బాగా నచ్చింది.మేము మేజర్ సినిమా కోసం మీ ఓ బేబీ సినిమా రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఈ డిసెంబరు 9న పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిసెంబరు 9న గుర్తుందా శీతాకాలం గుర్తుపెట్టుకొండి.

నటీనటులు:

స‌త్య‌దేవ్, త‌మ‌న్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి, సుహ‌సిని త‌దిత‌రులు

టెక్నికల్ టీం:

స్కీన్ ప్లే, డైరెక్ష‌న్ – నాగ‌శేఖ‌ర్
బ్యాన‌ర్ – వేదాక్ష‌ర ఫిల్మ్స్‌, నాగ‌శేఖ‌ర మూవీస్‌, మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
స‌మ‌ర్ప‌కులు – ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు
నిర్మాతలు – రామారావు చింతపల్లి, భావ‌న ర‌వి, నాగ శేఖర్,
కొరియోగ్రఫి – వీజేశేఖ‌ర్
లైన్ ప్రొడ్యూస‌ర్స్ – సంప‌త్, శివ ఎస్. య‌శోధ‌ర‌
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – న‌వీన్ రెడ్డి
డైలాగ్స్ – ల‌క్ష్మీ భూపాల్
మ్యూజిక్ – కాల‌భైర‌వ‌
ఎడిటిర్ – కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సినిమాటోగ్రాఫ‌ర్ – స‌త్య హెగ్డే
స్టంట్స్ – వెంక‌ట్