సైక్లాజికల్ థ్రిల్లర్ (‘గేమ్ ఓవర్’ మూవీ రివ్యూ)
రేటింగ్ : 3.0/5
ఓ టట్టూ ఇంత భీబత్సం చేస్తుందా..గేమ్ డిజైనర్ స్వప్న (తాప్సీ ) టాట్టు వేయించుకుంటుంది. అయితే ఆ టాటు వేయించుకున్న తర్వాత ఆమె జీవితంలో రకరకాల సమస్యలు వచ్చి పడతాయి. ఆ టట్టులో ఏముంది అంటే ఆ కలర్ లో అమృత (సంచన నటరాజన్) అనే హత్య కావింపబడ్డ అమ్మాయి అస్దికలు కలిసాయి. ఆమెను ఎవరు చంపారు అంటే ఓ సైకో కిల్లర్..ఎవరా సైకో కిల్లర్. వాడు వరస పెట్టి అమ్మాయిలనే టార్గెట్ చేసి కిరాతకంగా చంపేస్తూంటాడు. ఇప్పుడు స్వప్నను కూడా టార్గెట్ చేసాడు. ఈలోగా స్నప్నకు కొన్ని కలలు వస్తూంటాయి. దీకితోడు స్నప్నకు చీకటంటే భయం. ఆమె తన తల్లి తండ్రులతో కాకుండా కళమ్మ (వినోదిని వైద్యనాథన్)అనే పనిమనిషితో కలిసి ఓ ఇంట్లో ఉంటుంది. ఇలాంటి పరిస్దితుల్లో సైకో కిల్లర్ ఆమెపై ఎటాక్ చేసారా…ఆమె వీటికి టట్టూకి లింక్ ఉందా..ఆ సైకో కిల్లర్ ఎవరు…వాళ్ల నుంచి కాపాడుకోగలిగిందా వంటి విషయాలుతెలియాలంటే సినిమా చూడాల్సిందే.
గేమ్ ఆడేదెవరు..ఆడించేదెవరు
వీడియో గేమ్ ఆటలో మూడు లైఫ్ లైన్స్ ఉంటాయి. ఈ మూడు అయిపోతే ‘గేమ్ ఓవర్’ . మొదటి రెండు లైఫ్ లైన్స్ లైట్ తీసుకుంటాం. అయితే లాస్ట్ లైఫ్ లైన్ విషయంలో మాత్రం చాలా కష్టపడి గెలిచేందుకు ఫైట్ చేస్తారు. మనంమంతా కూడా అంతే…అన్ని దారులు మూసుకుపోయినప్పుడు …ఏ దారి లేనపుడు… జీవితం ముగిసే పరిస్థితి వచ్చినపుడు ప్రాణాలకు తెగించి పోరాడకపోతాం. అదే విషయాన్ని స్వప్న పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అది ఎంత సమర్ధవంతంగా చెప్పాడనేదే చూద్దాం.
ఈ థ్రిల్లర్ సినిమా రెండే పాయింట్ల చుట్టూ తిరుగుతుంది. అవి గేమ్ ఆడుతున్నదెవరు..ఆడిస్తోంది ఎవరు…ఓ రకంగా ఇది ఓ ఆధ్యాత్మక సంఘర్షణ. గేమ్ ఓవర్ అయ్యేదాకా ఆడాల్సిందే. తాప్సీకు చీకటంటై భయం. అందుకు ఆమె గతం కారణం. అయితే చీకట్లోనే గడపాలని ఆమె కోరుకోదు. తను దాన్ని అధిగమించాలనుకుంటుంది. తన గేమ్ డవలపింగ్ నైపుణ్యాన్ని ఆసరా తీసుకోవాలనుకుంటుంది. అయితే చీకట్లోంచి అంత తేలిగ్గా బయిటపడటం సాధ్యం కాదు. చీకట్లోనే శక్తులు విజృంభిస్తాయి. అవన్నీ ప్రతీకాత్మకంగా ఈ సినిమాలో చూపించగలిగాడు. అయితే ప్రతీది లేయర్స్ గా ఉంది..అర్దం చేసుకున్నవాడికి అర్దం చేసుకున్నంత అన్నట్లుగా సీన్స్ నడుస్తూంటాయి.
కథ,కథనం
ఇలాంటి సినిమాలకు కథ కన్నా కథనమే ప్రాధాన్యం. ఇది చాలా మంది దర్శకుడుకి చెప్పినట్లున్నారు. అందుకేనేమో దర్శకుడు సినిమాలో కథని పెద్దగా పెట్టుకోలేదు. కథనానికే ప్రయారిటి ఇచ్చాడు. అలాగే తెలివిగా పాటలు ,కామెడీ అంటూ కమర్షియల్ సూత్రాల జోలికి పోకుండా నీటుగా వంద నిముషాల్లో సినిమాని ముగించాడు.అయితే ఈ క్రమంలో కొన్ని సీన్స్ లాగ్ గానూ, మరికొన్ని అసలు మ్యాటర్ ని ఎస్టాబ్లిష్ చేయకుండానూ వెళ్లిపోతాయి. కాకపోతే వీడియో గేమ్ తరహాలోనే ముందుకు,వెనక్కి వెళ్తూ ఓ రకమైన టెన్షన్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అయితే కొన్ని సీన్స్ లాజిక్ కు అంతు చిక్కవు. కానీ సినిమా గమనంలో వాటిని పెద్దగా పట్టింకోం. అయితే సినిమా చూసి బయిటకు వచ్చాక కూడా కొన్ని అంతు పట్టని సమస్యలు వెంటాడతాయి. అసలు సినిమా మొదట్లో చూపిన అమృతని చంపిన సైకో కిల్లరే..స్వప్నదగ్గరకు రావటానికి కారణం లాజిక్ గా అనిపించదు. అలాగే స్నప్న వీల్ ఛెయిర్ లో కూర్చుని ఆ సైకో కిల్లర్ ని వేసేసిందంటే నమ్మ బుద్ది కాదు. అయితే బుద్ది (తెలివి) ప్రక్కన పెట్టి చూస్తే థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.
టెక్నికల్ గా
ఈ సినిమాలో కాన్వర్షేషన్స్ సహజంగా అనిపించినా, చాలా సార్లు అవి నాశిగా ,నసగా విసిగిస్తాయి. డైలాగులు మరింత షార్ప్ గా ఉండాల్సింది. మిగతా టెక్నికల్ టీమ్ బాగా కష్టపడ్డారు. డైరక్టర్ వాళ్ల నుంచి మంచి అవుట్ ఫుటే తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ …కొన్ని సార్లు హాంటింగ్ గా అనిపించినా చాలా సార్లు లౌడ్ గా అనిపిస్తుంది. కెమెరా వర్క్ మాత్రం హైలెట్. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. సీన్ ట్రాన్సిక్షన్స్ సైతం స్మూత్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ సూపర్బ్. మంచి రిచ్ గా తీసినట్లు అనిపిస్తుంది.
చూడచ్చా…
థ్రిల్లర్స్ ఇష్టపడితే ఓ లుక్కేయచ్చు
తెర వెనక, ముందు
తారాగణం : తాప్సీ, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురివిల్లా తదితరులు
సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ ,
ఎడిటర్: రిచర్డ్ కెవిన్,
రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్,
మాటలు: వెంకట్ కాచర్ల,
ఛాయా గ్రహణం: ఎ.వసంత్,
ఆర్ట్: శివశంకర్ ,
కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని,
పోరాటాలు: ‘రియల్’ సతీష్,
సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా),
స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం,
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, వై నాట్ స్టూడియోస్ టీమ్
కంటెంట్ హెడ్: సుమన్ కుమార్,
డిస్ట్రిబ్యూషన్ హెడ్: కిషోర్ తాళ్లూరు,
బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్,
సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర,
నిర్మాత: ఎస్.శశికాంత్,
దర్శకత్వం: అశ్విన్ శరవణన్.