Reading Time: < 1 min

గేమ్ ఆన్ మూవీ బిగ్ టికెట్ లాంచ్ ఈవెంట్

దిల్ రాజు, శ్రీకాంత్ చేతులమీదుగా గేమ్ ఆన్ బిగ్ టికెట్ లాంచ్

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆన్‌. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా గేమ్ ఆన్ మూవీ బిగ్ టికెట్ ను నిర్మాత దిల్ రాజు, నటుడు శ్రీకాంత్, హీరోలు ఆది సాయి కుమార్, అశ్విన్, తరుణ్ లాంచ్ చేసి సినిమా సక్సెస్ కావాలంటూ విష్ చేశారు. ఆస్ట్రేలియాలో జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్.. కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ ఆన్ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు. సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..

ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. గేమ్ థీమ్ లో సాగుతూ యాక్షన్, రొమాన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అభిషేక్ ఏ ఆర్ మ్యూజిక్, నవాబ్ గ్యాంగ్స్ అందించిన పాటలు ఆడియన్స్ ఇప్రెస్ చేస్తాయి అని చెప్పారు.

నటీనటులు :

గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌

సాంకేతిక వర్గం :

మ్యూజిక్ : అభిషేక్ ఏ ఆర్
సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌
ఎడిట‌ర్ : వంశీ అట్లూరి
నిర్మాత‌: ర‌వి క‌స్తూరి
క‌థ‌స్ర్కీన్ ప్లేడైలాగ్స్డైర‌క్ష‌న్: ద‌యానంద్‌