Reading Time: 2 mins

గ్రంథాలయం మూవీ రివ్యూ

Image

యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”మూవీ రివ్యూ
Emotional Engagement Emoji

ఓటీటిలు వచ్చాక సస్పెన్స్ థ్రిల్లర్స్ కు డిమాండ్ పెరిగింది. చిన్న సినిమాలు అన్నీ థ్రిల్లర్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో  సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సినిమాగా ప్రమోషన్ చేస్తున్న ఈ చిత్రం మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది..అసలు కథేంటి..ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీలైన్:

రఘుపతి గ్రంథాలయంలో  ఉన్న 1965 నాటి ఒక పుస్తకం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ పుస్తకాన్ని  అందరూ చదవలేరు.  చదవాలని ప్రయత్నించిన వారు మూడు రోజులు  తరువాత చనిపోతూంటారు. ఈ పుస్తకాన్ని చదివిన దాదాపు 100 మంది మృత్యువాత పడుతారు. దాంతో ఆ పుస్తకం జోలికి ఎవరూ పోరు. ఇదిలా ఉంటే.. రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర)  ప్రేమలో పడతారు. అనుకోకుండా ఇందుమతి ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభిస్తుంది. ఆ పుస్తకాన్ని చదివితే చనిపోతారనే తెలుసుకొన్న రాజా హరిశ్చంద్ర.. ఇందుమతిని చదవకుండా ప్రయత్నిస్తుంటాడు. ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ బుక్ ఎక్కడ నుండి వచ్చింది.ఆ బుక్ ను అక్కడకు తెచ్చిన వారెవరు?. చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని తెలుసుకువాలని ఒకరోజు రాత్రి కెమెరా తీసుకొని రహస్యంగా గ్రంధాలయం లొకి వస్తాడు. గ్రంధాలయం లొకి వచ్చిన తరువాత అక్కడ తనకు ఎదురైనా సంఘటనలు ఏమిటి, ఆ బుక్ ను చదివిన తన లవర్ ను చనిపోకుండా ఆపగలిగాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే .  గ్రంధాలయం సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది :

సినిమా కథ గా చూస్తే ఇందులో ఏదో మేటర్ ఉందనిపిస్తుంది. కానీ సినిమాలో అంత విషయం కనపడదు. ఈ రోజుల్లో పుస్తకాలు చదివేదెవ్వరు. అసలు గ్రంధాలయాలు ఎక్కడున్నాయి అనే సందేహం వస్తుంది. ఒకరు..అరా లైబ్రరికి వెళ్లి పనిగట్టుకుని పుస్తకాలు చదివేవాళ్లు కూడా రిస్క్ చేసి అలాంటి పుస్తకాలు చదవరు. అలాంటప్పుడు పుస్తకాలు, చదవటం ,చనిపోవటం అనే పాయింటే అబ్సర్డ్ గా అనిపిస్తుంది. అయితే సినిమాలో ఈ పాయింట్‌ను బేస్ చేసుకొని యాక్షన్, రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా మార్చే విధానం మాత్రం బాగుంది. కాకపోతే కొత్తవారితో దర్శకుడు చేసిన కావటంతో కనెక్ట్ కావటం కష్టం అనిపిస్తుంది. ఇక మనకు తెలిసిన ఆర్టిస్ట్ లు  ఉండి ఉంటే.. మరింత రీచ్, క్రేజ్ ఉండేదనిపిస్తుంది. రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు.. లవ్ ట్రాక్‌ను అసలు పాయింట్‌కు జోడించిన విధానం బాగుంటుంది. స్క్రిప్టు పరంగా లోపాలు తగ్గించుకుని.. గ్రిప్పింగ్‌గా కథ చెప్పి ఉంటే బోర్ ఉండేది కాదు. కాకపోతే ఓ  చిన్న చిత్రం, కొత్త నటీనటులు సమిష్టిగా ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మలిచారనే ఫీలింగ్ కలుగుతుంది.

టెక్నికల్ గా :

సినిమాటోగ్రఫి బాగుంది.    గోదావరి నదీ తీరంలో సన్నివేశాలు ప్రెష్ గా ఉన్నాయి. యాక్షన్ సీన్లు కూడా నీట్ గా, రియలిస్టి గా చిత్రీకరించాడు. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు  ప్లస్ అయ్యింది నబాకాంత్, సుబ్బు, డైమండ్ వెంకట్ తదితరులు డిజైన్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. శేఖర్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. వైష్ణవీ శ్రీ క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల్లో :

లవర్  ప్రాణాలను రక్షించుకోవడానికి తెగించిన కుర్రాడు రాజా హరిశ్చంద్ర పాత్రలో విన్ను మద్దిపాటి ఒదిగిపోయాడు. ఇందుమతిగా స్మితరాణి గ్లామర్ పరంగా, నటనపరంగా ఆకట్టుకొన్నది. లావ్ ట్రాక్‌లో విన్ను, స్మిత కెమిస్ట్రీ బాగా పండింది. కాలకేయ ప్రభాకర్ తన మార్కు విలనిజాన్ని చూపించాడు. సోనియా చౌదరి, డాక్టర్ భద్రంతోపాటు మిగితా పాత్రల్లో నటించిన వారు వారి వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

చూడచ్చా :

యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే వారు గ్రంథాలయం ఓ సారి దర్శించవచ్చు

నటీనటులు :

విన్ను మద్దిపాటి, స్మ్రిత రాణి బోర, కాలకేయ ప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌ జైన్‌, జ్యోతి రానా, కాశీ శ్రీనాథ్‌, డాక్టర్ భద్రం, మేక రామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహా గుప్త తదితరులు

సాంకేతికవర్గం :

బ్యానర్: వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
సినిమాటోగ్రఫి: భాస్కర్‌ సామల
సంగీతం: విష్ణు వర్ధన్‌ కే
ఎడిటర్‌: శేఖర్‌ పసుపులేటి
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్: చిన్నా
ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అల్లంనేని అయ్యప్ప
రచన దర్శకత్వం: సాయి శివన్‌ జంపన
నిర్మాతలు: వైష్ణవి శ్రీ సూర్య దేవర, కిరణ్మయి దిగమర్తి
Runtime: 2 hrs, 10 mins
రిలీజ్ డేట్: 2023-03-03