Reading Time: 2 mins
గ‌ల్లీరౌడీ  చిత్రం సాంగ్ ప్రోమో విడుద‌ల‌
 
 
 
గ‌ల్లీరౌడీ’ చిత్రంనుండి `ఛాంగురే ఐటెం సాంగురే…`సాంగ్ ప్రోమో విడుద‌ల‌.
 
విభిన్న క‌థా చిత్రాల్లో హీరోగా న‌టిస్తూ త‌న‌కంటూ  ఓ ప్ర‌త్యేక‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ సందీప్ కిష‌న్. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా ..బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట్‌ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. 
 
కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి హీరోయిన్‌.
 
ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్, టీజ‌ర్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల రిలీజైన `పుట్టెనే ప్రేమ` పాట‌కు మంచి స్పంద‌న ల‌భించింది. కాగా ఈ చిత్రం నుండి ఐటెం సాంగ్  `ఛాంగురే ఐటెం సాంగురే…`ను గురువారం సాయంత్రం 4గంట‌లకు హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్ విడుద‌ల‌చేయ‌నుంది. ఈ పాట‌కు సంభందించిన ప్రోమోను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. 
 
యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తిక్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల యూత్ అభిరుచికి త‌గ్గ‌ట్లుగా సాహిత్యాన్ని అందించారు. మంగ్లీ, సాయికార్తిక్‌, ద‌త్తు ఫుల్ ఎన‌ర్జిటిక్‌గా ఆల‌పించారు. ప్రేమ్ ర‌క్షిత్ హుశారైన స్టైప్పులు కుర్ర‌కారుని హీటెక్కిస్తున్నాయి. మొత్తానికి ఈ ప్రోమో సాంగ్ ఫుల్ సాంగ్‌మీద ఆస‌క్తిని మ‌రింత పెంచింది.  
 
న‌టీన‌టులు: సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు
 
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌
క‌థ‌: భాను
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌