Reading Time: < 1 min

జపాన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

గ్రాండ్ గా జరిగిన కార్తి జపాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ – ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం జపాన్‌ తో ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇటివలే విడుదలైన జపాన్ టీజర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చెన్నైలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో జపాన్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఘనంగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోలు సూర్య, విశాల్, ఆర్య, జయం రవి, దర్శకులు లోకేష్ కనకరాజ్, పా. రంజిత్ తదితరులు హాజరయ్యారు.

ట్రైలర్ జపాన్ క్రేజీ, ఫన్ ఫిల్డ్ ఎంటర్‌టైనర్ అని హామీ ఇస్తుంది. ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కార్తీ క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్ గా వుంది. తన ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మెన్స్ తో అందరినీ ఆకటుకున్నాడు కార్తి.

కార్తి ఇష్టపడే అమ్మాయి పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ట్రైలర్‌లో సునీల్, విజయ్ మిల్టన్, తదితరులు పోషించిన ఇతర ముఖ్యమైన పాత్రలను కూడా చూపించారు. ఎస్ రవి వర్మన్ క్యాప్చర్ చేసిన విజువల్స్ ఎక్సయిటింగ్ గా వున్నాయి, జివి ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ ని మరింతగా ఎలివేట్ చేసింది. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్.

ఈ దీపావళికి జపాన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.

తారాగణం :

కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: రాజుమురుగన్
ప్రొడక్షన్ హౌస్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
తెలుగు విడుదల: అన్నపూర్ణ స్టూడియోస్
డీవోపీ: ఎస్. రవి వర్మన్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్