Reading Time: 4 mins

జపాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

జపాన్ నా మనసుకు చాలా దగ్గరైన చిత్రం. ఖైదీ చూసినప్పుడు ఎంత సర్ ప్రైజ్ అయ్యారో జపాన్ కూడా అలాంటి సర్ ప్రైజ్ ఇస్తుంది: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ

జపాన్ లో గ్రేట్ ఎనర్జీ కనిపిస్తోంది. తప్పకుండా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది: నేచురల్ స్టార్ నాని

తెలుగు ప్రేక్షకులు కార్తీ గారిని ఎప్పుడో మనసులో పెట్టుకున్నారు. జపాన్ తో దర్శకుడు రాజు మురగన్ కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరౌతారు: దర్శకుడు వంశీ పైడిపల్లి

హీరో కార్తీ తన 25వ చిత్రం జపాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు వంశీ పైడిపల్లి, సుప్రియ యార్లగడ్డ అతిధులుగా పాల్గొన్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. నిజాయితీగా కష్టపడుతూ మన ప్రతిభని పెంచుకుంటూ వెళితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనడానికి ఉదాహరణ నాని. సహాయ దర్శకుడిగా మొదలై, నటుడిగా మారి, కొత్తకొత్త పాత్రలు చేస్తూ, కొత్త దర్శకులని, కొత్త కథలని ప్రోత్సహించే హీరో నాని. ఆయన ప్రతి సినిమా తో సర్ ప్రైజ్ ఇస్తారు. దసరాలో నానిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. జెర్సీ టైం లెస్ ఫిలిం. నాని నటన అద్భుతం. అందరినీ హత్తుకుంది. అలాగే తను నిర్మించే చిత్రాలు, వెబ్ షోస్ కూడా చాలా యూనిక్ గా వుంటాయి. నాని వండర్ ఫుల్ జర్నీకి అభినందనలు. తన హాయ్ నాన్న చిత్రానికి ఆల్ ది బెస్ట్ . హాయ్ నాన్న పెద్ద విజయాన్ని అందుకోవాలి. సర్దార్ తర్వాత నాగార్జున అన్నయ్య, అన్నపూర్ణ స్టూడియోస్ జపాన్ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున అన్నయ్య ఫస్ట్ షో చూసి సర్దార్ బాగా ఆడుతుందని కాల్ చేసి చెప్పారు. ఈ చిత్రానికి కూడా అలానే కాల్ చేస్తారనే నమ్మకం వుంది. వంశీ గారితో నాకు ఎంతో మంచి అనుబంధం వుంది. జపాన్ మన కల్చర్ లో ఉండిపోయే బలమైన కథ. దీనిని ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రజెంట్ చేయడానికి పెద్ద టెక్నిషియన్స్ ని తీసుకొచ్చాం. ఎస్ రవి వర్మన్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అలాగే జీవీ ప్రకాష్ చాలా మంచి స్కోర్ చేశారు. అను చాలా చక్కగా నటించింది. సునీల్ గారితో కలిసిపని చేయడం మంచి అనుభవం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో నాకు మంచి అనుబంధం వుంది. నా 25వ చిత్రాన్ని వారి నిర్మాణంలో చేయడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయాన్ని ఇస్తుందని నమ్మకం వుంది. జపాన్ కథ విన్నప్పుడే నాకు నేను కొత్తగా మారాలని నిర్ణయించుకున్నాను. గెటప్ తో పాటు వాయిస్ ని కూడా ఇందులో మార్చాం. ఈ చిత్రం నా మనసుకు దగ్గరైన చిత్రం. రాజు మురగన్ సమాజం పట్ల ప్రేమ వున్న దర్శకుడు. జపాన్ పాత్రలో స్వార్ధం వుంటుంది. ఈ సమాజం తనకి ఏది ఇచ్చిందో అదే తిరిగి ఇచ్చే పాత్ర తనది. వినోదంతో పాటు ఆలోచింపజేసే ప్రశ్నలు సంధించే చిత్రమిది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఖైదీ చూసినప్పుడు ఈ చిత్రాన్ని అసలు ఎలా ఒప్పుకున్నారని సర్ ప్రైజ్ అయ్యారో జపాన్ చూసి కూడా అలానే సర్ ప్రైజ్ అవుతారు, జపాన్ నాకు చాలా ముఖ్యమైన చిత్రం. జపాన్ నవంబర్ 10న రాబోతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి అని కోరారు.

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా వుంది. ఈగ చిత్రం తర్వాత నేను తమిళనాడు వెళ్ళినపుడు చాలా మంది అక్కడ మా తమిళబ్బాయిలానే వున్నావని అంటారు. తమిళ్ నుంచి కార్తి కూడా అలానే మన తెలుగబ్బాయిలా అనిపిస్తారు. తెలుగు ఆడియన్స్ అందరూ కార్తిని వోన్ చేసుకున్నారు. కార్తి ప్రతి సినిమాకి కొత్తదనం చూపిస్తూ గత యేడాదే వరుస విజయాలు అందుకున్నారు. ఇప్పుడు జపాన్ తో మరింత షాకింగ్ గా ఈ గెటప్ తో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నా ప్రతి సినిమా చూసి కార్తి కాల్ చేసి అభినందిస్తారు. నాకు మంచి స్నేహితుడు. ఇలాంటి సినిమాలు చేయడం, చేసి ఒప్పించడం అంత తేలిక కాదు. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎనర్జీ కనిపిస్తుంది. ట్రైలర్ లోనే దివాళి క్రాకర్స్ వైబ్ కనిపిస్తుంది. థియేటర్స్ లో కూడా అలాంటి ఎనర్జీ ట్రాన్స్ ఫార్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అను ఇమ్మాన్యుయేల్ మజ్ను తో పరిచయమైయింది. ట్రైలర్ లో తనని చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రభు గారు మంచి అభిరుచి వున్న చిత్రాలు నిర్మిస్తుంటారు. సినిమా అంటే ఆయనకి చాలా ప్యాషన్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. జపాన్ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. ఇదే పాజిటివ్ ఎనర్జీ నవంబర్ 10న థియేటర్స్ లోకి ట్రాన్స్ ఫార్మ్ అయి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఊపిరి నా కెరీర్ ని ఒక మలుపు తిప్పిన సినిమా. కార్తి గారు లేకపోతే నిజంగా ఊపిరి సినిమాని వూహించలేను. ఊపిరితో కార్తి లాంటి బ్రదర్ ని సంపాదించుకున్నాను. రాజమురగన్ నా ఊపిరి, మహర్షి చిత్రాలకు పని చేశారు. అద్భుతమైన క్రియేటర్ ఆయన. జపాన్ చాలా కొత్తగా డిఫరెంట్ గా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులు కార్తి గారిని ఎప్పుడో మనసులో పెట్టుకున్నారు. ఈ సినిమాతో రాజు మురగన్ ని కూడా మనసులో పెట్టుకుంటారనే నమ్మకం వుంది. ప్రభు చాలా ప్యాషన్ తో సినిమాలు నిర్మిస్తుంటారు. అను ఇమ్మాన్యుయేల్ ట్రైలర్ చాలా అందంగా కనిపిస్తునారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ  జపాన్ చాలా స్పెషల్ మూవీ. చాలా కొత్తగా వుంటుంది. సినిమా పటాకా లా వుంటుంది. కార్తి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. ఇంత మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆనందంగా వుంది. నాని గారు ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. జపాన్ థియేటర్ సినిమా. నవంబర్ 10న అందరూ థియేటర్ లోనే చూడాలి అని కోరారు

సునీల్ మాట్లాడుతూ హైదరాబాద్ నాకు ఇల్లు ఐతే తమిళనాడు టెంపుల్. నన్ను ఎంతగానో ఆదరించారు. జపాన్ సినిమా మీరు అనుకున్నదాని కంటే డిఫరెంట్ గా వుంటుంది. జపాన్ సినిమాలో నటించడం గర్వంగా చెప్పుకుంటాను. దర్శకుడు రాజ్ మురగన్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి పాత్ర ఇచ్చారు. కార్తి గారికి ఇందులో ఒక స్వాగ్ వుంటుంది. ఆయన పాదరసం లాంటి నటుడు. ఏ పాత్రలోనైన ఒదిగిపోతారు. చాలా మంచి మనసున్న మనిషి. రవి వర్మన్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇందులో నన్ను చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో చూస్తారు. నిర్మాతలకు, దర్శకుడికి, కార్తి గారికి ఈ సినిమాతో పేరు డబ్బు రెండూ రావాలి అని కోరారు.

చిత్ర దర్శకుడు రాజు మురుగన్ మాట్లాడుతూ కళకు భాష వుండదు. సినిమాని ఒక పండగలా చూస్తారు తెలుగు ఆడియన్స్. ఇండియన్ సినిమాకి ఒక ఐకాన్ లాంటి తెలుగు చిత్ర పరిశ్రమ. జపాన్ వేడుక సందర్భంగా మీ అందరినీ కలవడం ఆనందంగా వుంది. జపాన్ డిఫరెంట్ మూవీ. కార్తి గారి పాత్ర అద్భుతంగా వుంటుంది. కార్తి గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. సునీల్ గారితో పని చేయడం కూడా మంచి అనుభూతి. చాలా అద్భుతమైన నటుడు. అలాగే అనుతో పాటు ఈ చిత్రంలో పని చేసిన అందరికీ థాంక్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ఈ వేడుకకు విచేసిన నాని గారికి, వంశీ గారికి థాంక్స్. జపాన్ తప్పకుండా అందరినీ అలరిస్తుంది అన్నారు.

నిర్మాత ఎస్ ఆర్ ప్రభు మాట్లాడుతూ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన దర్శకుడు రాజు మురగన్ గారితో జపాన్ చిత్రానికి కలిసిపని చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రం ఆయన స్టాంప్ లో వుంటుంది, కార్తి గారి పాత్ర అద్భుతంగా వుంటుంది. ఈ చిత్రానికి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. గత ఏడాది దీపావళికి కార్తి గారి సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది. మళ్ళీ ఈ ఏడాది జపాన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేయడం అనందంగా వుంది. సుప్రియ గారికి థాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన నాని గారికి, వంశీ గారికి ధన్యవాదాలు. మా చిత్రాలని ప్రేక్షకులు గొప్ప ఆదరిస్తున్నారు. ఈ సారి కూడా జపాన్ కి మీ అందరి సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అన్నారు. ఈ వేడుకలో భాస్కర్ భట్ల, రాకేందుమౌళి మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.