జాంబిరెడ్డి చిత్రం సక్సెస్ మీట్
ఒక మంచి సినిమా వస్తే.. తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారో మా “జాంబిరెడ్డి” తో మరోసారి రుజువైంది- హీరో తేజ సజ్జ
యంగ్ తరంగ్ తేజ సజ్జ హీరోగా ఆనంది, దక్ష నగార్కార్ హీరోయిన్స్ గా యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ లో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజ్ శేఖర్ వర్మ నిర్మించిన చిత్రం “జాంబిరెడ్డి”. ఫిబ్రవరి 5న 500 వందలకు పైగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టుకొని కొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటులు నాగ మహేష్, గెటప్ శ్రీను, హేమంత్, కళా దర్శకుడు నాగేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె. రాబిన్, కో-డైరెక్టర్ విజయ్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమచ్చ, ప్రభ చింతలపాటి తదితరులు పాల్గొన్నారు…
నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ..’ మెగాస్టార్ చిరంజీవి గారు ‘ఖైదీ నంబర్ 150’ లో ఛాన్స్ ఇచ్చారు. అక్కడనుండి వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ చిత్రంలో వీరారెడ్డి పాత్ర చేశాను. చాలా మంచి పేరు వచ్చింది. ఇంతటి అద్భుతమైన పాత్రని నాకు ఇచ్చిన ప్రశాంత్ వర్మ కృతజ్ఞతలు. నా కేరియర్ లో గొప్ప హిట్ చిత్రం ఇది. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటే చాలా సప్రయిజ్ అయ్యాను. హీరో తేజ మరింత తేజోవంతంగా వెలగాలి.. నాకు ఇంతటి గొప్ప కొత్త జీవితాన్నిప్రసాదించిన ప్రశాంతవర్మ , విజయ్ గారికి చాలా థాంక్స్.. అన్నారు.
సంగీత దర్శకుడు మార్క్ రాబిన్ మాట్లాడుతూ.. ‘ అ! సినిమా నుండి ప్రశాంత్ వర్మతో జర్నీ చేస్తున్నాను. వెరీ బ్రిలియంట్ క్రియేటివ్ డైరెక్టర్. ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన “జాంబిరెడ్డి”ని యాక్సెప్ట్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. తేజ ఫాబ్ లెస్ పెర్ఫార్మెన్స్ చేసాడు. అలాగే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. అది స్క్రీన్ పై కనిపిస్తుంది. ముఖ్యంగా నాగేంద్ర ఆర్ట్ వర్క్, మేకప్ భాష ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. నిర్మాత రాజశేఖర్ వర్మ గారు బడ్జెట్ కి వెనకాడకుండా “జాంబిరెడ్డి” మూవీ నిర్మించారు.. వెరీ అంబుల్ పర్సన్.. అన్నారు.
గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ‘ ముందుగా ఒక కొత్త కాన్సెప్ట్ ఫిల్మ్ ఒకే చేసి అన్ కాంప్రమైజ్ గా నిర్మించి సక్సెస్ చేసిన రాజశేఖర్ వర్మ గారికి థాంక్స్. ఈ చిత్రంలో కసిరెడ్డి పాత్ర చేశాను. మా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు అందరూ ఫోన్స్ చేసి సినిమా చాలా బాగుంది అని కొత్తగా ఉంది అని అభినందిఅటున్నారు. ఆర్టిస్టులనుండి తనకి కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో ప్రశాంత్ సిద్ధహస్తుడు. ప్రతిషాట్ ఇంపాక్ట్ కలిగేలా సెట్స్ వేసిన నాగేంద్ర, ప్రతీ సీన్ హైలెట్ అయ్యేలా ఆర్ ఆర్ ఇచ్చిన మార్క్ రాబిన్ చాలా థాంక్స్. తేజ పెర్ఫార్మెన్స్ ఇరగదీశాడు. నెక్స్ట్ లెవెల్ కు వెల్లి అద్భుతమైన ఫ్యూచర్ ఉండాలి. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లందరికి థాంక్స్.. అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘ బేసిగ్గా నాకు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ బాగా ఇష్టం. ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ఈ జాంబీ జోనర్ ఫిల్మ్ ఐడియా వచ్చింది. తేజ నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పటినుండో ఇద్దరం ట్రావెల్ అవుతున్నాం. చాలా మంది ప్రొడ్యూసర్స్ ని కలిసాం. ఎవరూ సపోర్ట్ చేయలేదు. అ!, కల్కి, తర్వాత నాకు ఆఫర్స్ బాగా వచ్చాయి. కానీ తేజని ఒక స్టార్ హీరోని చేయాలని ఒక ఫ్రెండ్ గా నా కోరిక. అది ఇప్పుడు జాంబిరెడ్డి సినిమాతో నెరవేరింది. కొత్త కాన్సెప్ట్ ఫిలిమ్స్ వస్తే ఎప్పుడైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ కాన్ఫిడెన్సీతోనే ఈ సినిమా చేశాం. కోవిడ్ టైంలో షూటింగ్ చేశాం. రాజశేఖర్ గారు అందర్నీ బాగా చూసుకున్నారు. సెట్లో ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని హార్డ్ వర్క్ చేసి, ఆశీర్వదించారు. వారందరి కోరిక ఫలించింది. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర బ్యూటిఫుల్ సెట్స్ వేసి, నాకు ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు. అలాగే మేకప్ భాష 200మందికి పైగా మేకప్ వేసి ది బెస్ట్ ఔట్ ఫుట్ ఇచ్చాడు. మార్క్ రాబిన్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. సినిమాని తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. తేజ నాకన్నా ఈ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాడు. అన్నీ వర్క్స్ తానే చూసుకున్నాడు. ఈ సినిమా తనకి, నాకు చాలా ఇంపార్టెంట్. చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీకి మరొక మాస్ హీరో దొరికాడు అని అంటున్నారు. పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. 500 స్క్రీన్స్ లలో ఈ సినిమా రిలీజ్ అయింది. అన్నీ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 2.26 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఒక కొత్త హీరోకి ఇంతలా కలెక్షన్స్ రావడం షాకింగ్ గా ఉంది. మా జాంబిరెడ్డి సినిమాని బ్లెడీ బ్లాక్ బస్టర్ చేసిన ఆడియెన్స్ అందరికీ చాలా చాలా థాంక్స్.. అన్నారు.
హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. ‘ ఫస్ట్ టైం కొత్త సినిమా ట్రై చేశావ్.. చాలా బాగుందని 8వేలు ట్వీట్స్ వచ్చాయి. ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్, పెద్దలు అప్రిషియేట్ చేస్తున్నారు. సినిమా నచ్చితే ఏ రేంజ్ లో ఉంటుందో తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 2.26 క్రోర్స్ కలెక్ట్ చేయడం.. ఒక డెబ్యూ హీరోకి ఈ నంబర్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ అంతా ప్రశాంత్ కె చెందుతుంది. నా క్లోజ్ ఫ్రెండ్ ప్రశాంత్ వర్మ నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సక్సెస్ తో నాకు బాధ్యత, బరువు ఎక్కువైంది. నెక్స్ట్ ఇంకా బెటర్ ఫిలిమ్స్ చేయాలని ఈ సినిమా ప్రేరణ ఇచ్చింది. గెటప్ శ్రీను క్యారెక్టర్ కి థియేటర్ లో అరుపులు కేకలు వేస్తున్నారు ఆడియెన్స్.. ఇలాంటి కొత్త కాన్సెప్టుతో సినిమా తీయాలంటే దమ్ము, ధైర్యం కావాలి.. అది ఉన్న నిర్మాత రాజశేఖర్ గారు. జీవితాంతం ఆయనపై నాకు గౌరవం ఉంటుంది. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అలాగే టెక్నీషియన్స్ కూడా ఎంతో సపోర్ట్ చేసి చాలా కష్టపడి చేశారు. వారందరికీ, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘ కోవిడ్ టైములో జాంబిరెడ్డి సినిమా షూటింగ్ జరిపామ్. మాస్క్ లు, శానిటై్జర్స్, ఇన్సూరెన్స్ అన్నీ ప్రొవైడ్ చేసి వర్క్ చేశాం. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. కలెక్షన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థియేటర్ లో రెస్పాన్స్ చూసాక సక్సెస్ అంటే ఇలా ఉంటుందా అని తెలిసింది. మా చిత్రాన్ని ఆదరించి గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు చాలా థాంక్స్.. అన్నారు.
తేజ సజ్జ, ఆనంది, దక్ష నగార్కార్ జంటగా నటించిన ఈ చిత్రంలో రఘుబాబు, పృద్వి రాజ్, గెటప్ శీను, హర్షవర్ధన్, హేమంత్, కిరీటి, హరితేజ, అదుర్స్ రఘు, మహేష్ విట్ట, అన్నపూర్ణమ్మ, విజయ్ రంగరాజు, వినయ్ వర్మ, నాగ మహేష్, ప్రియ, చరణ్ దీప్, త్రిపురనేని చిట్టి నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: మార్క్ కె.రాబిన్, కెమెరా: అనిత్ మాదాడి, ఎడిటర్: సాయిబాబు తలారి, కొరియోగ్రాఫర్స్: విజయ్, యస్వంత్, ఫైట్స్: నందు, రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ, నిర్మాత: రాజ్ శేఖర్ వర్మ.