జాతిరత్నాలు ఎడిటర్‌ అభినవ్ ఇంట‌ర్వ్యూ

Published On: March 18, 2021   |   Posted By:

జాతిరత్నాలు ఎడిటర్‌ అభినవ్ ఇంట‌ర్వ్యూ

‘జాతిరత్నాలు ఎడిటర్‌ అభినవ్  ఇంట‌ర్వ్యూ. 
 
నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘జాతిరత్నాలు’. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు.  ఈ నెల 11న విడుదలైన ఈ సినిమాకు  ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ సందర్భంగా. ఎడిటర్‌ అభినవ్ మీడియాతో మాట్లాడారు.
 
ఎడిటర్‌ అభినవ్‌ మాట్లాడుతూ – ‘‘ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. వెడ్డింగ్ ఫిల్మ్స్‌, కమర్షియల్స్‌ వంటివి సరదాగా షూట్‌ చేసి ఎడిట్‌ చేసేవాడిని. నాకు ఉన్న సిల్క్స్‌లో ఎడిటింగ్‌పై మంచి గ్రిప్పు ఉంది. ఏడాదిన్నర క్రితం ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ అనే వెబ్‌సిరీస్‌ను ఎడిట్‌ చేసే చాన్స్‌ వచ్చింది. ఎడిటర్‌గా నాకు పెద్ద బిగ్‌ ప్రాజెక్ట్ అది. నెక్ట్స్‌ జాతిరత్నాలకు ఎడిటర్‌గా చేశాను. నాకు డైరక్టర్‌ కావాలని ఉంది. డైరెక్షన్‌ అంటే సినిమాటోగ్రఫీ, రైటింగ్‌ ఇలా అన్ని క్రాప్ట్స్‌పై పట్టు ఉండాలి. నేను సినిమాను డైరెక్ట్‌ చేసిన ఎడిటింగ్‌ నేనే చేయాలనుకుంటాను. సో ఎడిటింగ్‌పై మరింత దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో జోక్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా టైప్‌ ఆఫ్‌ కామెడీని ఎడిట్‌ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. వెబ్‌సిరీస్‌ ఎడిటింగ్‌ ఫార్మాట్‌ వేరు. సినిమా ఎడిటింగ్‌ వేరు. వెబ్‌సిరీస్‌కు ఒవరాల్‌ థీమ్‌తో పాటు ప్రతి ఎపిసోడ్‌ టైమ్‌ చూసుకోవాలి. సినిమాకు అలా ఉండదు. కథ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. ఎడిటింగ్‌ స్కిల్‌ పెంచుకుంటే ఏ డైరెక్టర్‌తో అయిన పని చేసే అవకాశం వస్తుందని నా నమ్మకం. ఎడిటర్స్‌ డైరెక్టర్స్‌ అయినవారు కూడ ఉన్నారు. రాజుహిరాణి, ఆంథోనీ, రాజమౌళిగా  గారికి ఎడిటింగ్‌లో మంచి స్కిల్‌ ఉంది. కథను ఎలా చెప్పాలి, క్యారెక్టర్స్‌ను ఎలా చూపించాలి అనేవి ఎడిటింగ్‌ ద్వారానే మరింత తెలుస్తాయి.