జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
1973 లో జరిగే కథ ఇది. తెల్లారితే SI అయ్యే కృప (ఎస్ జె సూర్య) అనుకోకుండా ఒక కేసు లో ఇరుక్కుని జైలు కు వెళ్తాడు. రాజకీయంగా అండ కలిగిన సీజర్ (లారెన్స్) కర్నూలు పట్టణానికి కింగ్ లా ఉంటాడు. సినిమా హీరో అయిన జయ కృష్ణ (షైన్ టామ్ చాకో) రాజకీయాల్లో కూడా ఎదగాలని చూస్తాడు. కర్నూలు పట్టణం లో జయకృష్ణ సినిమాలు ఆడనీయకుండా నలుగురు రౌడీలు అడ్డుపడతారు. దాంతో జయ కృష్ణ నలుగురు రౌడీల పైన కక్ష కడతాడు. ఆ నలుగురు రౌడీలలో ఒకడు సీజర్, జయ కృష్ణ తన తమ్ముడు అయిన DSP నవీన్ చంద్ర కు చంపమని చెప్తాడు. DSP నవీన్ చంద్ర ఆ నలుగురిని చంపడానికి శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలను ఎంచుకుంటాడు అందులో ఒకడు కృప. నవీన్ చంద్ర కృప కు సీజర్ ని చంపమని చెప్తాడు. తరువాత కృప కర్నూల్ కు ఒక డైరెక్టర్ అవతారమెత్తి సీజర్ దగ్గరికి వెళ్తాడు. సీజర్ కృప ను సినిమా తీయమని అడుగుతాడు. తర్వాత కృప సీజర్ ని చంపడా? ఇందులో ఆదివాసీల పాత్ర ఏంటి? ఇందులో CM పాత్ర ఏంటి? అడవిలో ఏనుగులను వేటాడే సెట్టయ్య పాత్ర ఏంటి? ఇలాంటి విషయాలు తెలియాలంటే థియేటర్ లో సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ :
అడవిలో ఆదివాసీలు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో తెలిపే సినిమా కథ ఇది
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
అందరి పెర్ఫార్మన్స్ బాగుంది, రాఘవ లారెన్స్ నటన, SJ సూర్య నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్
టెక్నికల్ గా :
ఫోటోగ్రఫీ, అడవి అందాలను చూపించడం బాగుంది
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
సినిమా కథ, స్క్రీన్ ప్లే బాగుంది, బి జి ఎం లు బాగున్నాయి.
సెట్టయ్య అనే అతను ఏనుగులను వేటాడడం.
సీజర్ రౌడీలను కౌ బాయ్ సినిమా స్టైల్ లో చంపడం.
సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ కథ మొదలు అయ్యే వరకు స్లో గా ఉంటుంది
నటీనటులు:
రాఘవ లారెన్స్, SJ సూర్య
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : జిగర్ డబుల్ ఎక్స్
బ్యానర్: స్టోన్ బెంచ్ ఫ్లిమ్స్
విడుదల తేదీ : 10-11-2023
సెన్సార్ రేటింగ్: U/A
దర్శకుడు: కార్తీక్ సుబ్బరాజ్ పదం
సంగీతం: సంతోష్ నారాయణన్ మ్యూజికల్
సినిమాటోగ్రఫీ: ఎస్ తిరునావుక్కరసు
ఎడిటర్: షఫీక్ మహమ్మద్ అలీ
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, ఎస్ కార్తిరేశన్
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్ LLP
రన్టైమ్: 172 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్