జిగేల్ రాజా చిత్రం షూటింగ్ ప్రారంభం
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ “జిగేల్ రాజా” షూటింగ్ ప్రారంభం
అన్వేష్, సారికలను హీరోహీరోయిన్స్ గా పరిచయం చేస్తూ మాధవి కేసాని దర్శకత్వంలో జి.ఎస్. జాషువా రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జిగేల్ రాజా’. శ్రీ రిత్విక ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో శ్రీరంగం సతీష్‌కుమార్ పర్యవేక్షణలో బుధవారం ఫిల్మ్ నగర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ నివ్వగా టీ మా సెక్రటరీ స్నిగ్ధ కెమెరాస్విచ్ ఆన్ చేశారు. శ్రీరంగ సతీష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… శ్రీరంగం సతీష్ పర్యవేక్షణలో జెజెక్రియేషన్స్ బ్యానర్ పై జె.ఎస్.జాఘవా రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడ్యూసర్‌గా ఇది ఆయన రెండవ చిత్రం. ఈ చిత్రంతో మాధవికేసాని లేడీ డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నారు. ఇండస్ట్రీకి సినిమా మీద ఉన్న ప్యాషన్ తో వచ్చే చిన్న నిర్మాతలను మేము ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. చిన్న సినిమాలు ఎక్కువ రావడం వల్ల ఎక్కువ మంది టెక్నిషియన్స్ కి పని దొరుకుతుంది. ఈ చిత్రంలో నటిస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తప్పకుండా హిట్ అవుతుంది. రాజుగారికి ఈ చిత్రంతో మంచి హిట్ కొట్టి మరో సినిమాని తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
టీ మా సెక్రటరీ స్నిగ్ధ మాట్లాడుతూ… జిగేల్‌రాజా సాంగ్ ఎంత సూపర్ బంపర్ హిట్ అయిందో ఈ సినిమా కూడా అలాగే హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో నటించే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు అన్నారు.
శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ… ఈ ప్రాజెక్ట్‌ని ఎంతో కష్టపడి మూడు నెలలు నుంచి జాషువా గారు నేను మాట్లాడుకుని ముందుకు తీసుకువచ్చాం. హీరో హీరోయిన్లు కొత్తవారైనా చాలా టాలెంటెడ్ పర్సెన్స్. సబ్జక్ట్‌కి అనుకూలంగా వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ చిత్రంలో సుమన్, పోసాని లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. ఈ రోజు నుంచి ఫప్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది అని అన్నారు.
ప్రొడ్యూసర్ జాషువా రాజు మాట్లాడుతూ… 2003లో ఒక చిత్రాన్ని తీశాను. మళ్ళీ ఇప్పుడే రెండో సినిమా తీస్తున్నాను. డైరెక్టర్ కొత్త హీరో హీరోయిన్స్‌తో ఈ చిత్రం చేస్తున్నాము. ప్రాడక్ట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ఈ చిత్రాన్ని తీస్తున్నాము అన్నారు.
మాధవి మాట్లాడుతూ… డైరెక్టర్‌గా నన్ను తీసుకున్నందుకు జాషువాగారికి నా కృతజ్ఞతలు. మంచి చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం అందరూ తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను. మంచి లొకేషన్స్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాము.
సుమన్, పోసాని కృష్ణ మురళి, కృష్ణ భగవాన్, అన్నపూర్ణమ్మ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఒ.పిఃజివివిప్రసాద్, మ్యూజిక్ః బాన్ ఫ్రాంక్లిన్, ఎడిటర్ఃశీను, ఆర్ట్ఃవిజయకృష్ణ, డాన్స్ఃబాలకృష్ణ, వేణురాక్, ఫైట్స్ఃవేవరాజ్, పిఆర్ఓః బాక్సాఫీస్ రమేష్, కో-ప్రొడ్యూసర్ఃచెరువుశ్రీని వాస్, జి.కె.రావు, రచన-నిర్మాతః జి.ఎస్.జాషువారాజు, దర్శకత్వంః మాధవికేసాని.