Reading Time: < 1 min

జెంటిల్‌మేన్ 2 చిత్రంలో ప్రియా లాల్

మెగా నిర్మాత కె.టి. కుంజుమోన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ‘జెంటిల్‌మేన్ 2’  మరో కథానాయికగా ప్రియా లాల్.

మెగా నిర్మాత  కె.టి.కుంజుమోన్ మరోసారి సరికొత్తగా భారీ చిత్రాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అర్జున్, మధు ప్రధాన పాత్రలలో తన నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపుద్దిద్దుకొని సంచలన విజయం సాధించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సూపర్ క్రేజీ సీక్వెల్ లో కథానాయికగా నయనతార చక్రవర్తి ను ఎంపిక చేశారు నిర్మాతలు. ఇప్పుడీ సీక్వెల్ లో  నటించబోయే మరో నటి పేరుని ప్రకటించారు. తెలుగులో ‘గువ్వా గోరింక’ చిత్రంతో అరంగేట్రం చేసిన హీరోయిన్  ప్రియాలాల్ ని  మరో కథానాయికగా ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

మ్యూజికల్ బాహుబలి ఎంఎం కీరవాణి ఈ మెగా సీక్వెల్ కి సంగీతం అందించనున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ ‘జెంటిల్‌మేన్’ కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.