Reading Time: < 1 min

జెంటిల్ మన్ 2 చిత్రంలో నయనతార చక్రవర్తి

కె.టి.కుంజుమన్ నిర్మిస్తోన్న `జెంటిల్ మన్ 2`లో నాయిక గా నయనతార చక్రవర్తి

స్టార్ ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ భారీ ప్రాజెక్ట్ జెంటిల్ మన్ 2 తో తిరిగి నిర్మాణరంగం లోకి వచ్చారు. ఇది అర్జున్ సర్జా, మధు బాల నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ` జెంటిల్ మన్ `కి సీక్వెల్ గా రూపొందబోతోంది.

మలయాళం లో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిన నయనతార చక్రవర్తి జెంటిల్ మన్ 2తో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ లో అతిధి పాత్ర పోషించిన తర్వాత నయనతార చక్రవర్తి చేస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాలో మరో కథానాయిక కూడా నటించనున్నారు. ఎవరనేది త్వరలో వెల్లడికానుంది.

మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమన్ తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలియజేస్తూ,  ప్రధాన నటిగా నయనతార చక్రవర్తిని పరిచయం చేస్తున్నాము. మరో కథానాయికను త్వరలో వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు.

ఎం.ఎం. కీరవాణి జెంటిల్ మన్ 2 కి సంగీతం అందించనున్నారు. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.