Reading Time: 2 mins
 
 
జెట్టి సినిమా లిరికల్ సాంగ్ విడుదల
 
 
శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా “జెట్టి” సినిమాలోని ‘జిల్ జిల్..’ లిరికల్ సాంగ్ విడుదల
 
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”. తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన “జెట్టి” సినిమాలోని  ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు చిత్ర బృందం.
 
సోమవారం ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ “జెట్టి” సినిమా నుంచి ‘జిల్ జిల్..’ అనే పాట లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. *ఈ పాట ఎలా ఉందో చూస్తే…..ఎటైనాదే, మీకేటైనాదే… వాటం జూస్తే యమ ఘాటున్నాదే..జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు బాబులు జిల్ జిల్ జిల్ జిల్..ఘల్ ఘల్ ఘల్ ఘల్ గాలాలు యేస్తరు ఘల్ ఘల్ ఘల్ ఘల్* అని సాగుతుంది. ఈ పాటను గీత రచయిత కాసర్ల శ్యామ్ రాయగా, పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ ఆలపించారు. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్ ఆకట్టుకుంది. ఒక సెలబ్రేషన్స్ మూడ్ లో సాగే ఈ స్పెషల్ సాంగ్  ని హుషారెత్తించే కొరియోగ్రఫీతో మరింత ఉత్సాహంగా మలిచాడు అనీష్.   శేఖర్ మాస్టర్ శిష్యుడు అనీష్ జిల్ జిల్ పాటకు అదిరిపోయే మాస్ స్టెప్పులు వేయించారు.  రీసెంట్ గా రిలీజ్ అయినా మౌనం కరిగినా అనే పాట యూత్ ని ఉర్రూతలూగిస్తుంది. సిద్ శ్రీరాం పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని మనసులు గెలుచుకుంది. 
 
*ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ*… మా అనీష్ “జెట్టి” మూవీలో ‘జిల్ జిల్..’ సాంగ్ కు చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటలో ఫర్మార్మ్ చేసింది తేజస్వినీ. తను ‘ఢీ’ షోలో లేడీ కంటెస్టెంట్. తేజస్వినీ ‘ఢీ’ లేడీ కంటెస్టెంట్స్ లో బెస్ట్ డాన్సర్. ఇది నేను చెప్పడం కాదు, రేపు పాట చూసి మీరే చెబుతారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. దర్శకుడు సుబ్రహ్మణ్యంతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. సాంగ్ చాలా బాగుంది. నిర్మాత వేణు మాధవ్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని “జెట్టి” సినిమా తెరకెక్కుతోంది. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను తెరమీద హృద్యంగా తీసుకురాబోతున్నాడు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక. 
 
 
నటీ నటులు: నందిత శ్వేత‌, కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,  ఎమ్ య‌స్
చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు
 
 
బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్
మ్యూజిక్ :  కార్తిక్ కొండ‌కండ్ల‌
డిఓపి:  వీర‌మ‌ణి
ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి
ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌
స్టంట్స్: దేవరాజ్ నునె
కోరియోగ్రాఫర్ : అనీష్
పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్
డైలాగ్స్ ః శ‌శిధ‌ర్
నిర్మాత ః వేణు మాధ‌వ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక