జ్వాల చిత్రం ప్రారంభo
ప్రారంభమైన `జ్వాల`.
అమ్మా క్రియేషన్స్ పతాకంపై విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం జ్వాల శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది.
విజయ్ ఆంటోని తెలుగులో నటిస్తున్న స్ట్రయిట్ మూవీ ఇది. అరుణ్ విజయ్ మరో హీరోగా నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. నవీన్.ఎం దర్శకుడు. టి.శివ నిర్మాత. శుక్రవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా…నిర్మాత టి.శివ మాట్లాడుతూ – “దర్శకుడు నవీన్ చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చింది. జనవరి 3 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కోల్‌కతా, గోవా, యూరప్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించనున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. హాలీవుడ్ అహ్మద్ బట్చా కమల్ బట్చా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు“ అన్నారు.
హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ – “నవీన్ స్క్రిప్ట్ చెప్పగానే నచ్చేసింది. మంచి టాలెంటెడ్ పర్సన్. ఇప్పటి వరకు నేను నటించిన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. తొలిసారి తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ మూవీ. బ్యూటీఫుల్ స్క్రిప్ట్. నాకెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుందని చెప్పగలను. నాతో పాటు అరుణ్ విజయ్, షాలిని పాండేలు కూడా నటిస్తున్నారు. అందరికీ ఛాలెజింగ్ మూవీ. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటుందని భావిస్తున్నాను. అలాగే ప్రకాశ్‌రాజ్‌గారు, జగపతిబాబుగారు కీలకపాత్రల్లోనటిస్తున్నారు. వారికి కూడా నా థాంక్స్“ అన్నారు.
హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ – “చాలా ఎగ్జయిటెడ్‌గా ఉంది. బ్రూస్లీ, సాహో తర్వాత తెలుగులో నేను చేస్తున్న మూడో స్ట్రయిట్ మూవీ ఇది. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. అలాంటి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. విజయ్ ఆంటోనిగారితో, షాలిని పాండేతో కలిసి నటిస్తుండం హ్యాపీగా ఉంది“ అన్నారు.
షాలిని పాండే మాట్లాడుతూ – “స్క్రిప్ట్ వినగానే చాలా బాగా నచ్చింది. ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను“ అన్నారు.
విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్, షాలినిపాండే, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అహ్మద్ బట్చా కమల్ బట్చా, సంగీతం: నటరాజన్ శంకరన్, ఆర్ట్: కిశోర్, ఎగ్టిక్యూటివ్ ప్రొడ్యూసర్: దిలీపన్ సెంగొట్టయాన్, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎన్.మహేంద్ర, నిర్మాత: టి.శివ, దర్శకత్వం: నవీన్.ఎం.