ట్రావెలింగ్ సోల్జర్ చిత్రం ఫస్ట్ లుక్  రిలీజ్

Published On: January 27, 2021   |   Posted By:

ట్రావెలింగ్ సోల్జర్ చిత్రం ఫస్ట్ లుక్  రిలీజ్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం  ‘ట్రావెలింగ్  సోల్జర్’. వినాయక మూవీస్ పతాకంపై అంగముత్తు రాజా నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతనిస్తూ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు.  లక్ష్మీ ఎన్టీఆర్ లో బాలకృష్ణ క్యారెక్టర్ ప్లే చేసిన బాలు హీరోగా పరిచయం అవుతున్నాడు.

70 శాతం షూటింగ్ గోవా, చిక్ మంగళూర్, తలకోనలో  షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్  లడఖ్, మాల్దీవ్స్ లో జరగనుంది.

ఈ చిత్రానికి కెమెరా:నరేన్, మాటలు: చిట్టి రాజు, కో-డైరెక్టర్: ప్రణీత్, సంగీతం: జితేంద్ర, నిర్మాత: అంగముత్తు రాజా,  కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఫణికుమార్ అద్దేపల్లి