డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ పూరీ జగన్నాధ్ బర్త్ డే పోస్టర్ విడుదల
పవర్‌ఫుల్ పోస్టర్‌తో దర్శకుడు పూరీ జగన్నాధ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన డబుల్ ఇస్మార్ట్ టీమ్
సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రేసీ స్క్రీన్‌ప్లేలతో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో దిట్ట. ఉస్తాద్ రామ్ పోతినేనితో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ మాస్, యాక్షన్ ని ఇష్టపడే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
పూరి జగన్నాధ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, డబుల్ ఇస్మార్ట్ టీమ్ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో దర్శకుడు, హీరో రామ్, విలన్ సంజయ్ దత్‌తో కలిసి చేతిలో డబుల్ బ్యారెల్ గన్‌లు పట్టుకుని కనిపించారు. ఇందులో రామ్, సంజయ్ దత్ ట్రెండీ దుస్తులు ధరించారు. పూరీ జగన్నాధ్ తన నటులను అత్యంత స్టైలిష్ అవతార్‌లలో ప్రజెంట్ చేస్తారు. రామ్, సంజయ్ దత్ ఇద్దరూ ఇక్కడ స్టైలిష్ బెస్ట్ గెటప్‌లలో కనిపిస్తున్నారు.
రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో డబుల్ ఇస్మార్ట్ రూపొందుతోంది.
డబుల్ ఇస్మార్ట్ మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం :
రామ్ పోతినేని, సంజయ్ దత్
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
డీవోపీ: జియాని గియాన్నెల్లి