Reading Time: < 1 min

డార్లింగ్ మూవీ జూలై 19 విడుదల

ఈ సంవత్సరం ప్రారంభంలో పాన్ ఇండియా సెన్సేషన్ హనుమాన్‌ అందించిన బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో డార్లింగ్ టైటిల్ తో రోమ్కామ్ ఎంటర్‌టైనర్‌తో వస్తోంది. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ రైటర్, డైరెక్టర్.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

రోమ్కామ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ని స్కోర్ చేయడంపై మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్‌లో మోస్ట్ రిలేటేబుల్ కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం రెడీగా వుంది.

బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నరేష్ రామదురై డీవోపీ వ్యవహరిస్తుండగా, హేమంత్ డైలాగ్స్ అందిస్తున్నారు, లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ ఇ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.

నటీనటులు :

ప్రియదర్శి, నభా నటేష్

సాంకేతిక సిబ్బంది :

రచన దర్శకత్వం: అశ్విన్ రామ్
నిర్మాతలు: కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నరేష్ రామదురై
ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ