Reading Time: 2 mins

డాలీ ధ‌నుంజ‌య్ మీడియా స‌మావేశం

న‌టుడిగా హీరో, విల‌న్ అనేవి రెండూ ఇష్ట‌మే- `బ‌డ‌వ రాస్కెల్‌` డాలీ ధ‌నుంజ‌య్

`పుష్ప‌` సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన ధ‌నుంజ‌య్ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

క‌న్న‌డ‌లో 8 సినిమాల్లో హీరోగా చేసి, 9వ సినిమా శివ‌రాజ్ కుమార్ సినిమాలో విల‌న్‌గా చేశారు. ఆ చిత్రంలోని డాలీ పేరుతో డాలీ ధ‌నుంజ‌య్ గా పాపుల‌ర్ అయ్యారు.

ఆయ‌న తాజాగా న‌టించిన సినిమా `బ‌డ‌వ రాస్కెల్‌`. శ్రీ‌మ‌తి గీతా శివ‌రాజ్‌కుమార్ స‌మ‌ర్ప‌కులుగా ఈ సినిమాకు వ్య‌వ‌హ‌రించారు. శంక‌ర్ గురు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

డిసెంబ‌ర్‌లో ఈ సినిమా క‌న్న‌డ‌లో విడుద‌లై విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఇదే సినిమాను తెలుగులోనూ బ‌డ‌వ రాస్కెల్ గా అనువ‌దించారు.

ఈ చిత్రం ఈనెల 18న విడుద‌ల‌కాబోతోంది. ఈ సినిమా గురించి డాలీ ధ‌నుంజ‌య్ హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

– పుష్ప సినిమా అనుభూతి మాట‌ల్లో చెప్ప‌లేనిది. క‌న్న‌డ‌లోనేకాదు ఎక్క‌డికి వెళ్ళినా న‌న్ను చూడ‌గానే `త‌గ్గేదేలే` అంటూ గుర్తుపెట్టుకుని ప‌లుక‌రిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ ల‌తో ప‌నిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నా.

– నేను క‌న్న‌డ‌లో 9 సినిమాలు చేసినా పుష్ప త‌ర్వాత మ‌రింత గుర్తింపు వ‌చ్చింది. కొంత‌మంది స్నేహితులు ఎందుకు తెలుగులో న‌టించావ‌ని కూడా అడిగారు. న‌టుడికి ప‌రిధిలేదని చెప్పాను.

– నేను తెలుగులో `భైర‌వ ద్వీపం` చేశాను. ఇప్పుడు పుష్ప చేశా. ఈ సినిమా త‌ర్వాత ప‌లు క‌థ‌లు కూడా వింటున్నాను.

– క‌న్న‌డ‌లో పుష్ప విడుద‌లైన వారం త‌ర్వాత బ‌డ‌వ రాస్కెల్ రిలీజై హిట్ సంపాదించింది. బ‌డ‌వ రాస్కెల్ అనేది  స్వీట్‌గా తిట్టే తిట్టు. లెజెండ‌ర్ డా. రాజ్‌కుమార్ గారు ఎక్కువ యూజ్ చేసేవారు.

– తెలుగు డైలాగ్స్ రామ‌కృష్ణ రాశారు. డ‌బ్బింగ్ కూడా నేనే చెప్పాను. పుష్ప‌లో కూడా నేనే చెప్పాను. ఇక నా నిర్మాణంలో బ‌డ‌వ రాస్కెల్ తొలిసినిమా. ద‌ర్శ‌కుడు, మ‌రికొంత‌మంది స్నేహితులు క‌లిసి చేసిన సినిమా.  స్నేహితుడు ర‌మ‌ణ తెలుగులోకూడా రిలీజ్ చేస్తే మంచింది అని సూచించారు. అందుకే విడుద‌ల చేస్తున్నా.

– బ‌డ‌వ రాస్కెల్  క‌థ‌ప‌రంగా చెప్పాలంటే, చ‌దువు ముగిశాక ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేసే వ‌య‌స్సులో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినిమా వుంటుంది. ఇది మ‌ధ్య‌త‌ర‌గ‌తి క‌థ‌. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఇలాంటి క‌థ‌లో త‌ల్లిదండ్రులే హీరోలు. నాకు త‌ల్లిదండ్రులుగా న‌టించిన‌వారు బాగా న‌టించారు.

– నేను ప్ర‌తి సినిమా చేసేట‌ప్పుడు మార్కెట్ కూడా ప‌రిశీలిస్తాను. అలా కొన్ని మెళుకువ‌లు నేర్చుకున్నాకే నిర్మాత‌గా మారా. నా 9వ సినిమా శివరాజ్ కుమార్ తో చేశాను. అందులో విల‌న్‌. నా పాత్ర డాలీ. అది బాగా పాపుల‌ర్‌. అందుకే డాలీ ధ‌నుంజ‌య్‌గా నాకు గుర్తింపు వుంది.

– నేను సినిమారంగంలోకి వ‌చ్చి 13 ఏళ్ళ అయింది. ప్ర‌తిసారీ ప్ర‌తి ద‌ర్శ‌కుల‌నుంచీ ఏదో ఒక‌టి నేర్చుకుంటూనే వున్నా.

– నాకు చిన్న‌త‌నంనుంచే న‌టన‌పై అస‌క్తి. డ్రామాలు ఆడాను. థియేట‌ర్ బేక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చాను. మా కుటుంబంలో ఎవ‌రూ ఈ రంగంలో లేరు.

– న‌టుడిగా హీరో, విల‌న్ అనేవి రెండూ ఇష్ట‌మే. హీరోకు కొన్ని బౌండ‌రీలు వుంటాయి. కానీ విల‌న్‌కు వుండ‌వు. పెర్ ఫార్మెన్స్ ఎక్కువ‌కు అవ‌కాశం వుంటుంది.

– క‌న్న‌డ‌లో పేరున్న హీరోల సినిమాలు, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి సినిమాలు వ‌చ్చినా ఎక్క‌డా కాంపిటేష‌న్ అనిపించ‌దు. హెల్తీ కాంపిటేష‌న్‌గానే వుంటుంది. నా బ‌డ‌వ రాస్కెల్ విడుద‌లైన‌ప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా విడుల‌య్యాయి. మ‌రోవైపు ఇక్క‌డి హీరోల సినిమాలు కూడా విడుద‌ల‌య్యాయి. ఎవ‌రి సినిమాలు వారివే. నా సినిమా కూడా విడుద‌లై విజ‌య‌వంతం అయింది. అని తెలిపారు.