డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకుల పంపిణీ

Published On: April 10, 2020   |   Posted By:
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకుల పంపిణీ
 
తెలంగాణా  ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ నిత్యావసర సరుకుల పంపిణీ
 
కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపధ్యంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్మికులు పనులు లేక నిత్యవసరాల కు  ఇబ్బందులు పడుతున్న క్రమంలో తెలంగాణా ఫిల్మ్  ఛాంబర్ లోని 24క్రాఫ్ట్ సభ్యులకు  ఈ రోజు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ లో నిత్యావసర వస్తువులు అందించారు.
 
ఈ సందర్భంగా డా.ప్రతాని రామ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ….”ఈ రోజు  తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని సభ్యులకు కొంత మంది నటీ నటులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లకు , మెక్ అప్ వారికి, కెమెరా అసిస్టెంట్స్ ఇలా దాదాపు 50 మందికి  నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది. మిగతా సభ్యులకు కూడా త్వరలో పంపిణీ చేస్తాం . ఇలా మా తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ సభ్యులందరికీ సాయపడనున్నాం. అందరూ ఇంట్లో ఉంటూ, గంట గంటకు చేతులు కడుక్కుని ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలని” అన్నారు.