డియర్ మేఘ మూవీ సెప్టెంబర్ విడుదల

Published On: August 28, 2021   |   Posted By:
 
డియర్ మేఘ మూవీ సెప్టెంబర్ విడుదల
 
ఏషియన్ సినిమాస్ ద్వారా ”డియర్ మేఘ”. సెప్టెంబర్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
 
 
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. *ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఏషియన్ సినిమాస్ ద్వారా నైజాం లో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది*. అత్యధిక కేంద్రాలలో డియర్ మేఘ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్,పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు.
 
నటీనటులు – మేఘా ఆకాష్,అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు, పవిత్రా లోకేష్ తదితరులు.
 
ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – కె.వి రమణ , పీఆర్వో – జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.