డిసెంబర్ 16న ఎన్టీఆర్ ట్రైలర్.. 21న ఆడియో లాంఛ్
ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ హైదరాబాద్ లో… ఆడియో రిలీజ్ ఈవెంట్ నందమూరి తారకరామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జరగనున్నాయి. డిసెంబర్ 16న ట్రైలర్ లాంచ్.. 21న ఆడియో వేడుక భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తున్నారు. వచ్చిన ప్రతీ లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. క్రిష్ జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడుగా ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వస్తుంది. జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
2 Attachments