డిస్కోరాజా విలేకరుల సమావేశం
డిస్కోరాజా ఫ్రీకింగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘డిస్కోరాజా’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మౌత్ టాక్‌తో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు. తొలిరోజుతో ఈ వీకెండ్ మొత్తం థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కొత్త సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నభానషేష్, పాయల్‌రాజపుత్, తానియా, బాబిసింహా, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రామ్‌తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మించగా ఆదివారం ఆవాసా హోటల్‌లో ఫ్రీకింగ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌ను అలాగే రవితేజ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…
మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ… మా డిస్కోరాజా చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. నాకు ఈ సినిమా కోసం ముందు రవితేజగారి నుంచి ఫోన్ వచ్చింది. రవి నా సినిమాకి నువ్ వర్క్‌చెయ్యాలి అన్నారు. సంవత్సరానికి దాదాపుగా మూడు సినిమాలు ఇవ్వగల సత్తా ఉన్న హీరో రవితేజ అని చెప్పవచ్చు. ఆయన ఎనర్జీ అంత పీక్స్‌లో ఉంటది. అలాగే ఆయన ఏ ఆర్టిస్ట్ కైనా ఎనర్జీ లెవల్స్‌ని ఇస్తారు. వి.ఐ. ఆనంద్‌గారు ఈ చిత్రం కోసంచాలా కేర్‌గా ఉన్నారు. ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహించి తీశారు. సునీల్, సత్యంరాజేష్ క్యారెక్టర్లు చాలా బావున్నాయి. రామ్‌తాళ్ళూరి ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బావున్ఆనయి. తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఊపేస్తున్నాడనే చెప్పాలి.
రాంకీ మాట్లాడుతూ… రవితేజగారు చాలా పెద్ద ఆర్టిస్. ఆయన ఎనర్జీ లెవల్స్ అన్నీ నేను సెట్స్‌లో చూశాను. డైరెక్టర్ వి.ఐ. ఆనంద్‌కి మంచి క్లారిటీ ఉంది. ఆయనకి ఏం కావాలో ఆయనకు బాగా క్లారిటీతో ఉంటారు. సినిమాలని చాలా బాగా తెరకెక్కించారు. పాయల్ అద్భుతమైన నటనని కనబరిచింది. సునీల్ డ్యాన్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఈ చిత్రంలో నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
సునీల్ మాట్లాడుతూ… నాకు ఈ చిత్రంలో చాలా గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు. నా కెరియర్ అంతటిలో చాలా మంచి క్యారెక్టర్ ఇది నాకు. అంతేకాక ఏ ల్యాంగ్వేజ్ లో నైనా సరే సిక్స్ ప్యాక్ విలన్ అవ్వాలన్నది నా కోరిక అన్నారు. అలాగే సినిమా మొత్తం సస్పెన్స్ మొయిన్‌టెయిన్ చేస్తూ చాలా బాగా తీశారు వి.ఐ. ఆనంద్‌గారు. అబ్బూరిరవి నా ఫ్రెండ్. నాకోసం డైలాగ్స్ చాలా బాగా రాశారు. అంతేకాక నేను హీరోగా నటించే చిత్రాలకు కూడా స్పెషల్‌గా ఆయన డైలాగ్స్ రాసిఇస్తారు. రాంకీగారు గ్లామర్ అదుర్స్. ఇప్పటికి ఆయన్నుచూస్తుంటే సింధూరపువ్వు గుర్తుకువస్తది. రవితేజగారి స్టైల్‌ని ఈ చిత్రంలో మొయిన్‌గా గుర్తుంచుకోవాలి. రవితేజగారు ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఆయన టైమ్ వేస్ట్ చేసుకోరు. ఎవ్వరి టైమ్‌ని కూడా వేస్ట్ చెయ్యరు. ఇక పాయల్ విషయానికి వస్తే డైలాగ్స్ లేకపోయినా చాలా అద్భుతంగా నటించింది.
ప్రొడ్యూసర్ రామ్‌తాళ్ళూరి మాట్లాడుతూ… రవితేజగారి పుట్టినరోజు కి ఆయనకు మంచి సినిమాను ఇచ్చాము అని అనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మిమ్మల్ని కూడా ఈ సినిమా అంతే అలరిస్తుందని భావిస్తున్నాను అన్నారు.
బాబిసింహా మాట్లాడుతూ… ఈ మూవీకి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. హండ్రెడ్ పర్సంట్ శాటిస్‌ఫై చెయ్యడం చాలా కష్టం. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశమిచ్చనందుకు చాలా కృతజ్ఞతలు అన్నారు.
పాయల్ మాట్లాడుతూ… నా కొత్త సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరిచ్చే ఈ ప్రేమాభిమానాలు, గౌరవమర్యాదలు నేనెప్పుడూ మర్చిపోలేను. నేను ఈ చిత్రంలో నటించిన పాత్ర నాకు పెద్ద ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా మొత్తం కేవలం నా హావభావాలను పలికిస్తూ సినిమా అంతా చెయ్యాలి. నాకు ఇంత మంచి క్యారెక్టర్‌ని ఇచ్చినందుకు డైరెక్టర్ ఆనంద్‌గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు సునీల్‌గారి పాత్ర బాగా నచ్చింది. ఎక్కువగా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా నచ్చుతాయి. రవితేజగారితో కలిసి పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక అద్భుతమైన చిత్రమని చెప్పవచ్చు అన్నారు.
దర్శకుడు వి.ఐ. ఆనంద్ మాట్లాడుతూ… ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రేమ, ఒకత్యాగం, అలాగే ఎంతో హ్యాపీనెస్‌తో పని చేశారు.ఈ మూవీ కోసం ప్రతి ఒక్కరూ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి పనిచేశారనే చెప్పాలి. రవితేజగారు ఈ సినిమా కోసం ఎక్కువ కాలం స్పెండ్ చేశారు. నిర్మాతలు రామ్, రజనీగార్లు క్యారవాన్ ఉన్నా లేకపోయినా ఎంతో కష్టపడి షూటింగ్ స్పాట్‌కి వచ్చి మరీ వెయిట్ చేసేవారు. రామ్‌గారు మాతో కలిసి ఐస్‌ల్యాండ్‌కి కూడా వచ్చారు. అక్కడ ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కెమెరామెన్‌కి అసిస్టెంట్‌గా ఇలా ఏమాత్రం ఇగో ఫీలింగ్స్ లేకుండా చాలా కష్టపడ్డారు. బాబిసంహాగారు కూడా బాగా నటించారు. నేను ఆయన సీన్స్ కొన్ని కట్ చేయడం జరిగింది. అయినా కూడా ఆయన ఏమాత్రం ఫీలవ్వలేదు. నరేష్‌గారు కూడా ఈ చిత్రంలో చాలా మంచి పాత్రని పోషించారు. సునీల్ పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరూ థియేటర్ కి వెళ్ళి మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. అబ్బూరిరవిగారు డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఆయన హెల్త్ బాలేకపోయినా మధ్యలో ఎప్పుడూ రమ్మన్నా కూడా ఏమాత్రం ఆలోచించకుండా మా కోసం వచ్చేవారు.
హీరో రవితేజ మాట్లాడుతూ… అబ్బూరిరవి నాకు చాలా చిత్రాలకు పని చేశారు. ఆయన నాకు ఫ్రెండ్ అని చెప్పాలి. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఆర్ట్ డైరెక్టర్‌నాగేంద్రగారు ఆయన కనిపించరు. కేవలం ఆయన పని మాత్రమే కనిపిస్తుంది. రాంకీగారు సింధూరపువ్వు సమయంలో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. బాబిసింహా మీ పాత్ర చాలా బాగా వచ్చింది. మీ పాత్ర మా అబ్బాయికి బాగా నచ్చేసింది అన్నారు. సునీల్ నేను ఇప్పటివరకు చాలా చిత్రాల్లో కలిసి నటించాం. కానీ ఈ చిత్రంలో మాత్రం చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటించాం. పాయల్ క్యారెక్టర్ చాలా బావుంటుంది. ఎంతో బాగా నటించింది. ఘట్టమనేని కార్తిక్ సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా బావుంది. తమన్ ప్రస్తుతం రాక్ స్టార్. ఇప్పుడు ఆయన సుక్రదశ తాండవం ఆడుతుంది. రామ్ తాళ్ళూరిగారు రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు పెద్దగా ఇష్టపడరు. ఆయన ఏదో ఒక కొత్తదనం కోరుకుంటారు. చాలా ప్యాషనేట్ నిర్మాత ఆయన. నా పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు ఇంత మంచి సక్సెస్‌ని ఇచ్చినందుకు ఆడియన్స్‌కి బిగ్ థ్యాంక్స్. అలాగే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి ఎంతో సపోర్ట్‌ని అందరజేశారు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సత్యంరాజేష్, డిఒపి కార్తీక్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.