Reading Time: 2 mins

డిస్ట్రిబ్యూటర్ కమలకర్ రెడ్డి సంతాప సభ

డిస్ట్రిబ్యూటర్ కమలకర్ రెడ్డి మృతికి నిర్మాతలు సంతాపం సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాస్, తుమ్మల ప్రసన్న కుమార్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ వి.ఎల్.శ్రీధర్, ఎపి. ఫిలిం ఛాంబర్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామ్ దాస్, ఈనాడు సినిమా నిర్మాత కుమార్ బాబు, మాతృదేవోభవ దర్శకులు అజయ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ…
నాకు 20 ఏళ్ల క్రితం అభయ్ సినిమాతో కమలాకర్ రెడ్డి, జనార్దన్ పరిచయం. వీలిద్దరు మంచి స్నేహితులు, కమలాకర్ రెడ్డి మన మధ్య లేకపోయినా మంచి అతని ఆశయాలు మనతోనే ఉంటాయి. కే.ఎఫ్.సి సంస్థ రూపంలో కమలాకర్ రెడ్డి ఎప్పుడూ మనతోనే ఉంటాడు. జనార్దన్ కమలాకర్ గురించి చెప్పిన మాటలు మర్చిపోలేను, పోయిన తరువాత కూడా బ్రతికిఉండే మనుషుల్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి కమలాకర్ రెడ్డి, ఆయన అందరికి మంచి చేశారు. మనం  అందరూ జనార్దన్ కు అండగా ఉండాలిని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…
300 యోధులు, 1000 బీసీ, బలాదూర్ వంటి ఎన్నో మంచి చిత్రాలకు డిస్ట్రిబ్యూషన్ చేశారు కమలాకర్ రెడ్డి గారు. డిస్ట్రిబ్యూషన్ చెయ్యడంతో పూర్తి అవగాహన కలిగిన డిస్ట్రిబ్యూటర్ కమలాకర్ రెడ్డి గారు. ముంబయ్ లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కమలాకర్ రెడ్డి గారి కె.ఎఫ్.సి సంస్థను సంప్రదించేవారు. అంతటి గొప్ప డిస్ట్రిబ్యూషన్ సంస్థ కె.ఎఫ్.సి. తమిళ్, కర్ణాటక, కేరళ ఇలా ప్రతి ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎప్పుడు కాల్ చేసిన సౌమ్యంగా పలకరించేవారు కమలాకర్ రెడ్డి గారు. అలాంటి కమలాకర్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం నమ్మలేని నిజం. జనార్దన్ గారు వారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటూ, కమలాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్న అన్నారు.

నిర్మాత ముత్యాల రామ్ దాస్ గారు మాట్లాడుతూ…
మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంస్థ కె.ఎఫ్.సి. డిస్టిబ్యూటర్ గా మంచి పేరున్న కమలాకర్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం మన అందరికి బాధాకరమైన విషయం. కమలాకర్ గారి ఉన్న ఓపిక గొప్పది, మంచి మనిషిని కోల్పోయిన ఆవేదన మాకు ఉంది, ఎన్నో మంచి చిత్రాలను అందించిన కమలాకర్ రెడ్డి గారు మా మద్యే ఉన్నారని తెలిపారు.

మాతృదేవోభవ దర్శకుడు కె.అజయ్ కుమార్ మాట్లాడుతూ….
కమలాకర్ రెడ్డి నాకు మంచి స్నేహితుడు, అతనితో కలిసి ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాము, అతను లేడని నిజాన్ని నమ్మలేక పోతున్నాను, అతని ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.

నిర్మాత ఆచంట గోపినాథ్ మాట్లాడుతూ…
డిస్ట్రిబ్యూటర్ కమలాకర్ రెడ్డి గారు కె.ఎఫ్.సి సంస్థను ఎంతో ఎత్తుకు తీసుకొని వెళ్లారు. ఆయన అకాల మరణం తీరని లోటు, ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.