డెవిల్ మూవీ సాంగ్ సెప్టెంబర్ 19 విడుదల
సెప్టెంబర్ 19న నందమూరి కళ్యాణ్ రామ్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్ మూవీ నుండి సిద్ శ్రీరామ్ పాడిన మాయే చేసే.. అనే సాంగ్ విడుదల
వైవిధ్యమైన సినిమాలను చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ డెవిల్. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. టైటిల్ వింటుంటేనే కథానాయకుడు సినిమాలో విలన్స్‌ను ఏ రేంజ్లో ఓ ఆటాడుకుంటాడనే విషయం స్పష్టమవుతుంది. యాక్టర్‌గా నందమూరి కళ్యాణ్ రామ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఎలివేట్ చేయనుందనే విషయం స్పష్టమవుతుంది.
రీసెంట్గా విడుదలైన డెవిల్ టీజర్‌తో ఈ సినిమాపై అప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. నవంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మాయే చేసే.. అనే పాటను సెప్టెంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ఐకాన్ మ్యూజిక్ నుంచి ఈ సినిమా పాటలను విడుదల చేస్తున్నారు.
అభిషేక్ నామా డెవిల్ మూవీని డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలుసు. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుంది. అందులో నుంచి మాయే చేసే.. పాటను సెప్టెంబర్ 19న విడుదల చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమేనని, ప్రేక్షకులకు ఈ మూవీ మంచి మ్యూజికల్ జర్నీని మరుపురాని అనుభూతినిస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. సత్య ఆర్.వి పాటను రాశారు.
నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త అద్భుతమైన పెర్ఫామెన్స్ చేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, సినిమా కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎన్నో మంచి చిత్రాను మనకు అందించిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తోంది. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యం వహిస్తుండగా సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. గాంధీ నడికుడికర్ ఈ సినిమాకు ప్రొడఓన్ డిజైనర్‌గా బాధ్యతలను నిర్వహించారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు :
నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ: దేవాన్ష్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
డైరెక్టర్, ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: తమ్మిరాజు