డ్యాన్సర్ అసోసియేషన్ ప్రెస్ మీట్
అమ్మాయిలు ధైర్యంగా వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి డ్యాన్సర్ అసోసియేషన్ మెంబర్ షిప్ కార్యక్రమంలో యానీ మాస్టర్
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ మీడియా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. డ్యాన్సర్ల కొరత ఉందని, ప్రతిభ ఉన్న డ్యాన్సర్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వాలని యూనియన్ సంస్థ కోరింది. ఫిల్మ్ చాంబర్‌లో ఈ నెల 20, 21, 22 తేదీల్లో ఆడిషన్స్ జరుగుతాయి. 33 ఏళ్లుగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ అసోసియేషన్ ఇప్పుడు డ్యాన్సర్లకు కొత్తగా మెంబర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన ఈ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ
యానీ మాస్టర్ మాట్లాడుతూ నేను ఇక్కడున్న ఎంతో మంది దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాను. ఈ నెల 20 నుంచి ఇక్కడ ఆడిషన్స్ చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్లు వచ్చి మెంబర్లుగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మన మాస్టర్లు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఈ ఇండస్ట్రీ అంటే అమ్మాయిలు భయపడతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. బిందాస్‌గా రావొచ్చు. ఏదీ కూడా సులభంగా మన దగ్గరకు రాదు. మాకు లేడీ డ్యాన్సర్లు, లేడీ కొరియోగ్రాఫర్లు కావాలి. జూలై 20 21 22న ఫిలిం చాంబర్ వద్దకు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి. ఆ తరువాత మీరే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, యానీ మాస్టర్లు కావచ్చు అని అన్నారు.
డాన్యర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ . చంద్రశేఖర్ మాట్లాడుతూ టాలెంట్ ఉన్న డ్యాన్సర్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు మా వద్ద 130 మంది మాస్టర్లు, 500 మంది డ్యాన్సర్లున్నారు. 200 మంది మెంబర్ షిప్ కానివాళ్లు ఉన్నారు. మూడ్రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ది చెందుతోంది. మన డ్యాన్సర్లు కూడా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి తీసుకురావాలని ఈ యూనియన్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆసక్తి ఉన్న వారంతా కూడా ఆడిషన్స్ ఇవ్వండి. మేం కూడా వారికి సహకరిస్తాం. ప్రతిభ ఉన్న వారికి వేదిక దొరకదు. అలాంటి వారంతా ఈ వేదికను ఉపయోగించుకోవాలని కోరారు.
ఫౌండర్ సోమరాజు మాట్లాడుతూ ఈ అసోసియేషన్‌ను ప్రారంభించేందుకు నాలుగు కారణాలున్నాయి. 1984 నుంచి మేం ఆలోచిస్తూనే ఉండేవాళ్లం. ముక్కు రాజు గారితో మేం చర్చలు జరుపుతూ ఉండేవాళ్లం. ఈ సంస్థకు ముక్కు రాజు, సోమరాజు, కేడీ ప్రభాకర్ రావు, వెంకటేష్ గారు నాలుగు స్థంభాల్లాంటివారు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మా సంస్థ జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. అన్ని భాషల్లో మా కొరియోగ్రఫర్లు పని చేస్తున్నారు. 35 ఏళ్లకు పైగా ఈ సంస్థ విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకా కొంత మంది డ్యాన్సర్లను ఆహ్వానిద్దామని ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
పాల్ మాస్టర్ మాట్లాడుతూ మీడియా సపోర్ట్ వల్లే ఇంత ఎత్తుకు ఎదిగాం. మన ఇండస్ట్రీలో డ్యాన్సర్లకు మంచి భవిష్యత్తు ఉంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ప్రకాష్ మాస్టర్ మాట్లాడుతూ మా ముప్పై ఏళ్ల జర్నీలో మీడియా మాకు ఎంతో సహకారం అందించింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ ఇలా అందరూ ఈరోజు ఇక్కడకు రావాల్సింది. కానీ షూటింగ్‌లు ఉండటం వల్ల రాలేదు. కానీ ఆడిషన్స్ సమయంలో వారంతా ఉంటారు. ఆసక్తి ఉన్న వారు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి అని అన్నారు.
శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మన డ్యాన్సర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఒక్కో పాటకు వందల మంది డ్యాన్సర్లు కావాల్సి వస్తున్నారు. డ్యాన్సర్లకు ఈవెంట్ల రూపంలోనూ డిమాండ్ ఏర్పడింది. మాకు ఎలాంటి బ్రాంచ్‌లు లేవు. ఫిలిం చాంబర్‌కు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి అని అన్నారు.
భాను మాస్టర్ మాట్లాడుతూ డ్యాన్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వొచ్చు. మూడ్రోజుల పాటు ఆడిషన్ జరుగుతుంది. వచ్చి మెంబర్ కార్డ్ తీసుకోండని అన్నారు.
యశ్ మాస్టర్ మాట్లాడుతూ రియాల్టీ షోలు చేసి వచ్చినా నాకు త్వరగానే కార్డ్ ఇచ్చారు. మాకు ఇప్పుడు డ్యాన్సర్ల కొదవ ఏర్పడుతోంది. డ్యాన్సర్లను బయటి నుంచి తీసుకుని రావాల్సి వస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఆడిషన్స్ ఇచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండని అన్నారు.
ఆడిషన్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన నంబరు.
040 29558899