తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
జూలై 30న విడుదలవుతున్న `తిమ్మరుసు` పెద్ద సక్సెస్‌ను సాధించి, తర్వాత రాబోయే సినిమాలకు ఆక్సిజన్‌లా మారి బూస్టప్ ఇస్తుందనే నమ్మకం ఉంది – ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని
‘బ్లఫ్ మాస్టర్ , ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `తిమ్మరుసు`. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పి శెట్టి దర్శకుడు. జూలై 30న సినిమా థియేటర్స్‌లో విడుదలవుతుంది.
ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. బిగ్ సీడీ, లిఫ్ట్ ప్రోమో, దేవి థియేటర్ 70 ఎం.ఎం.బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. విజయవాడలోని శైలజా థియేటర్ బిగ్ టికెట్‌ను నిర్మాత మహేశ్ కోనేరు తండ్రి సాంబశివరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా…
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “సత్యదేవ్ అంటే చాలా ఇష్టం. తనపై ఉన్న అభిమానంతో ఈ ఈవెంట్‌కు వచ్చాను. సత్యదేవ్ ఎంత మంచి యాక్టరో మనకు తెలుసు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో ఆత్మను ఓ నటుడిగా రీ క్రియేట్ చేయడం తనకే సాధ్యమైంది. అప్పుడు కోవిడ్ రాకుండా ఉండి, ఆ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యుంటే, తను స్టార్‌గా కూడా జర్నీ స్టార్ట్ చేసేసి ఉండేవాడు. అయితే అది తిమ్మరుసుకి రాసి పెట్టి ఉండొచ్చు. వేరే దేశాల్లో వీకెండ్స్ వస్తే అమ్మ, నాన్నలను చూడటానికి వెళతారు. కానీ మనం అమ్మ, నాన్నలతో సినిమాకెళతాం. అలాగే వేరే దేశాల్లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌ను కలవడానికి వెళతాం. కానీ మనం ఫ్రెండ్స్‌తో పాటు సినిమా కెళతా. బోర్ కెడితే బార్ కెళ్లి అటు నుంచి థియేటర్ కెళతాం. థియేటర్స్‌లో సినిమా చూడటం అనేది మన సంస్కృతి. సాధారణంగా కోవిడ్ టైమ్‌లో ముందుగా థియేటర్స్ క్లోజ్ చేసేసి, లాస్ట్‌లో థియేటర్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. బార్స్, పబ్స్‌లో మాస్కులు తీసేసి పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటితో పోల్చితే థియేటర్స్ సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సినిమాను ఓ వైపుకే మాట్లాడకుండా చూస్తాం. అలాగని థియేటర్స్‌ను ముందుగానే ఓపెన్‌చేయాలని నేను చెప్పడం లేదు. కానీ అన్నింటితో పాటు ఓపెన్ చేయవచ్చు కదా, అని అంటున్నాను. ఇది నానిగా నేను మాట్లాడటం లేదు. ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నాను. థియేటర్ అనేది మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఇంటి తర్వాత ఎక్కువగా థియేటర్స్‌లోనే గడిపి ఉంటాం. జాగ్రత్తలు తీసుకుని వెళితే, థియేటర్స్ చాలా సేఫ్ ప్లేస్. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్‌కు మూల కారణాలైన ఆర్ట్‌ఫామ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, ఆ దేశాల్లో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో సినిమాకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. థియేటర్స్ అనేది పెద్ద ఇండస్ట్రీ. దానిపై ఆధారపడి లక్షలాది కుటుంబాలున్నాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్స్‌లో పనిచేసే వాళ్లున్నారు. అలా చాలా మంది లైఫ్‌లు ఆధారపడి ఉన్నాయి. ఎంటైర్ ఇండియాలో ఇదే సమస్య ఉంది. త్వరలోనే ఇది మారుతుందని భావిస్తున్నాను. ప్రజలకు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతున్నాయి. కానీ సినిమా పరిశ్రమ విషయానికి వచ్చేసరికి బోల్డెన్ని పరిమితులుంటున్నాయి. చాలా చిన్న సమస్యగా అనుకుంటున్నారు. ఫిల్మ్‌నగర్‌లో ఉండేవాళ్ల కోసం అది చిన్న సమస్య అయ్యుండవచ్చునేమో కానీ.. చాలా కుటుంబాలకు అది చాలా పెద్ద సమస్యగా మారింది. పరిస్థితులు వల్ల ఓ ఎకో సిస్టమ్ పాడైతే మన భవిష్యత్ తరాల వాళ్లకి ఇబ్బంది. ఓ చీకటి ప్రాంతంలో కొందరితో కలిసి సినిమా చూడటమనేది ఓ మ్యాజికల్ ఫీలింగ్. నెక్ట్స్ జనరేషన్ దాన్ని మిస్ అవుతుంది. దాని కోసం ప్రభుత్వాలు, మనం కలిసి పూనుకోవాలో ఏమో తెలియడం లేదు. కానీ మనసులో చిన్న భయం, బాధ ఉంది. ఇది త్వరగా పరిష్కారమైపోవాలి. థర్డ్ వేవ్.. తొక్కా తోలు రాకుండా, మళ్లీ మనం సినిమాలు చూడాలి. తిమ్మరుసుతో మొదలెట్టాలి. అన్ని సినిమాలు టక్ జగదీష్, లవ్‌స్టోరి, రిపబ్లిక్, ఆచార్య, రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ అన్నీ సినిమాలను మనం థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. తిమ్మరుసు విషయానికి వస్తే. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్లు నాకు చాలా బాగా తెలుసు. శ్రీచరణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అంకిత్ చక్కగా యాక్ట్ చేశాడు. బ్రహ్మాజీగారికి థాంక్స్. ప్రియాంక చక్కటి నటి. నా కెరీర్ ప్రారంభం నుంచి మహేశ్ నాకు బాగా తెలుసు. ఈ సినిమా తనకు పెద్ద హిట్ కావాలి. ఈ 30 తర్వాత వచ్చే సినిమాలన్నింటికీ తిమ్మరుసు అనేది ఆక్సిజన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పడమే కాదు.. జూలై 30 నా కుటుంబంతో కలిసి తిమ్మరుసు సినిమా చూస్తాను. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు“ అన్నారు.
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ క్వాలిఫికేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, మార్కులు ఏమీ ఉండవు. ప్యాషన్ అనే క్వాలిఫికేషన్‌తో రావాలి. 99 మంది మనకు ఇండస్ట్రీ గురించి ఎన్నో చెబుతారు. కానీ ఒకరు మాత్రమే ఏం కాదు.. ముందుకెళ్లు అని చెబుతాడు. ఆ ఒకరెవరో కాదు.. మనకు మనమే. అలా ఎంతో ధృడమైన నమ్మకంతో, ఈ ఇండస్ట్రీలో నిలదొక్కున్న వ్యక్తుల్లో మైడియరెస్ట్ నాని అన్న ఒకరు. తను ఇక్కడకు రావడం వల్ల, మాలాంటి వాళ్లకు ఎంతో ధైర్యం వస్తుంది. నాని అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. చాలా సంతోషంగా ఉంది. ఎంటైర్ వరల్డ్‌లో .. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడం మన తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమైంది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత మొదటగా వస్తున్న సినిమా మా `తిమ్మరుసు`. నిర్మాత సృజన్, మహేశ్ కాంబినేషన్‌లో సినిమా ముందడుగు వేసింది. శరణ్ కొప్పిశెట్టి, ఎప్పుడూ చాలా కూల్‌గానే కనపడతాడు. తను తిమ్మరుసును అద్భుతంగా చేశాడు. తనకి థాంక్స్. శ్రీచరణ్ పాకాల.. ఫాస్టెస్, సిన్సియర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు చాలా చక్కగా మ్యూజిక్ అందించాడు. బ్రహ్మాజీగారు మోస్ట్ పాజిటివ్ పర్సన్. నవ్విస్తూ..నవ్వుతూ ఉండటమే ఆయనలో గ్లోకి కారణం. నేషనల్ అవార్డ్ విన్నర్ అప్పూ ప్రభాకర్ ఈ సినిమాకు వర్క్ చేశాడు. కంఫర్ట్ జోన్ దాటి ఈ సినిమాలో ఫైట్స్ చేశాను. ప్రియాంక మంచి నటి, వండర్‌ఫుల్ హ్యుమన్ బీయింగ్. 39 రోజుల్లో సినిమా పూర్తయ్యింది. సెకండ్ వేవ్‌లో ముందుగా వస్తోన్న ఈ సినిమాను ఆదరించి సపోర్ట్ చేయాలని ప్రేక్షకులకు కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ “ఈ సినిమాను చేసేటప్పుడు ఎంతో ఎఫర్ట్‌తో చేశాం. అలాగే సినిమాను ఎంజాయ్
చేస్తూ చేశాం. ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి కారణమైన అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా సినిమా మంచి సక్సెస్‌ను సాధిస్తుంది. సక్సెస్ తర్వాత ఇంకా మాట్లాడుతాను. జూలై 30న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ “కోవిడ్ సమయంలో అందరి పరిస్థితులు అనుకున్నంతగా లేవనే చెప్పాలి. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఓ రోజు ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సృజన్ ఫోన్ చేసి సత్యదేవ్‌తో సినిమా చేస్తావా? అన్నాడు. అప్పటికే సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. కోవిడ్ అందరికీ బ్యాడ్ టైమ్‌ను తెచ్చింది కానీ.. నాకు గుడ్ టైమ్ వచ్చిందని అప్పుడనిపించింది. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మహేశ్‌గారు మరో నిర్మాతగా యాడ్ కాగానే ప్రాజెక్ట్‌కు వెయిటేజ్ పెరిగింది. సత్యదేవ్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా కంటే ముందు నుంచే తనతో హాయ్ అని అనుకునే పరిచయం ఉంది. తను రిజర్వ్‌డ్ అని అనుకున్నాను. కానీ తనేంత సరదాగా ఉంటాడో ఇప్పుడే తెలిసింది. కోవిడ్ టైమ్‌లో రిస్ట్రిస్ట్రక్షన్స్ ఉన్నా సరే! సత్యదేవ్‌తో పాటు ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, ఝాన్సీ, అజయ్, వైవా హర్ష అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అప్పూ ప్రభాకర్ మంచి విజువల్స్ ఇచ్చాడు. శ్రీచరణ పాకాల రాక్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. అందరం కష్టపడి ఇష్టపడి సినిమా చేశాం. సెకండ్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా అందరూ జాగ్రత్తగా థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ “చాలా కఠిన పరిస్థితుల్లో షూటింగ్ చేసిన సినిమా ఇది. రిస్క్ అయినా యూనిట్ చాలా కష్టపడ్డారు. 39 రోజుల్లో సినిమాను షూటింగ్ పూర్తి చేశారు. సత్యదేవ్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. తన సినిమాకు ఎప్పుడు మ్యూజిక్ చేద్దామా? అని ఆలోచించేవాడిని. ఇప్పటికీ కుదిరింది. సృజన్, మహేశ్‌గారికి, డైరెక్టర్ శరణ్‌కి థాంక్స్. అప్పూ ప్రభాకర్ చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం“ అన్నారు.
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ “తిమ్మరుసులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. కొన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు మన పక్కనున్న వారిని చూసి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. అలా నేర్చుకునే నటుల్లో నానిగారు ఒకరు. అదే విధంగా సత్యదేవ్ కూడా. తన డైలాగ్ డెలివరీ చాలా ఇష్టం. నాని, సత్యదేవ్ నేచురల్ యాక్టర్స్. ఇద్దరూ భవిష్యత్తులో మంచి స్టార్ పోజిషన్స్‌కు వెళతారు. అంకిత్, వైవా హర్ష, భూపాల్, అజయ్ అందరూ చక్కగా నటించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. డైరెక్టర్ శరణ్.. మంచి స్నేహితుడు. ప్రేమమ్ సినిమా నుంచి పరిచయం. తన ఫస్ట్ సినిమాలోనూ యాక్ట్ చేశాను. ఈ సినిమాలోనూ మంచి పాత్ర ఇచ్చాడు శరణ్. అన్ని ఎలిమెంట్స్‌ను ఉన్న ఈ తిమ్మరుసు సినిమాను అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ “ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్…39 రోజుల్లోనే పూర్తి చేశాం. అందరూ ఎంతో ఇష్టపడి చేశారు కాబట్టి అలా చేయగలిగాం. నాకు కర్త, కర్మ, క్రియలాగా ఉండి.. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి కారణమైన వంశీ కాకకు థాంక్స్. అప్పూ ప్రభాకర్ సినిమాలో నన్నుఅందంగా చూపించారు. శరణ్.. వెరీ కూల్ పర్సన్. నాపై నమ్మకంతో మంచి పాత్రను ఇవ్వడమే కాదు.. ఆ పాత్రలో నన్ను ఇన్‌వాల్వ్ చేయించడంలో కీ రోల్ పోషించాడు. సత్యదేవ్‌తో వర్క్ చేసిన తర్వాత యాక్టింగ్ ఈజీగా, ప్యాషనేట్‌గా ఉండాలో అర్థమైంది. తన యాక్టింగ్‌ను చూసినప్పుడు నేనేం నేర్చుకోవాలో తెలిసింది. అలాగే బ్రహ్మాజీ సహా ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ రాహుల్ సంక్రిత్యాన్, వెంకట్ మహా, ఝాన్సీ, జయశ్రీ జయపాల్, వైవా హర్ష, నవీన్, అంకిత్, మ్యాంగో రామ్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
నటీనటులు:
సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
నిర్మాతలు: మహేశ్ కోనేరు, సృజన్
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
యాక్షన్: రియల్ సతీశ్