Reading Time: < 1 min

తిరగబడర సామీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

సురక్ష్ ఎంటర్ టైన్మెంట్ మీడియా పతాకంపై త్రిష సమర్పణలో తిరగబడర సామీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా, సరదాగా జరిగింది.

హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా, తాగుబోతు రమేష్ , డైరెక్టర్ రవికుమార్ చౌదరి, ప్రొడ్యూసర్ మల్కాపురం శివ కుమార్ , మ్యూజిక్ డైరెక్టర్ జె బి, సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ మీరు ఈ ట్రైలర్ చూశాక రెగ్యులర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపించొచ్చు, కానీ కోర్ ఎమోషనల్ చాలా కొత్తగా వుంటుంది, ఇలాంటి యాక్షన్ ఎంటర్టైనర్ కొత్తగా ఉంటుందని చేశా… ఖచ్చితంగా డైరెక్టర్ రవి కుమార్ చౌదరి గారి యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం లాంటి సినిమాలు చూస్తే అర్థమౌతుంది ఆయన ఇలాంటి సినిమాలు తీసి సక్సెస్ చేయడంలో ఎక్సపర్ట్ అని. చెప్పారు.

ప్రొడ్యూసర్ శివ కుమార్ గారు మాట్లాడుతూ డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఆయన వేరే హీరోల పేర్లు చెబుతుంటే, ఇలాంటి కథకి రాజ్ తరుణ్ బాడీ లాంగ్వేజ్ కి, అతని డైలాగ్ టైమింగ్ కి కరెక్ట్ సరిపోతుంది అని డైరెక్టర్ చెప్తే వెంటనే ఆలోచించి రాజ్ తరుణ్ ని ఫైనల్ చేశాం.. ఈ సినిమా కోసం ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేసారు. ముఖ్యంగా కెమెరామెన్ జవహర్ గారు, RRR సినిమా రీరికార్డింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం సమయాన్ని వెచ్చించి జె బి గారు మంచి మ్యూజిక్ తో background స్కోర్ తో సినిమా next level కి తీసుకెళ్ళారు. అని చెప్తూ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి, నటీనటులకు ధన్యవాదాలు అని చెప్పారు.

డైరెక్టర్ రవి కుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా నాకు comeback లాంటిది. నా నుండి సినిమా వచ్చి చాలా రోజులైంది అందుకే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా ఎమోషన్ తో బ్లెండ్ అయ్యేలా సినిమాని తీర్చిదిద్దడం జరిగింది.