తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఇంటర్వ్యూ

Published On: September 9, 2020   |   Posted By:
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఇంటర్వ్యూ
 
నిర్మాత …తుమ్మలపల్లి రామ సత్యనారాయణ..63 వ పుట్టినరోజు ఈ రోజు  సెప్టెంబర్ 10 వ తేదీన జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ

2004 లో నేను మొట్టమొదటి సినిమా తీసాను ఇప్పటికి 98 సినిమాలు పూర్తి చేశాను..99 వ చిత్రం గ్రేట్ డైరెక్టర్ RGV తో..ఉంటుంది..100 వ చిత్రం ఒక శతాధిక దర్శకుడు తీస్తాను అని మాట ఇచ్చారు..ఆయన  పిలుపు కోసం ఎదురు చూస్తున్నను..అన్నారు. ఒక వేళ కరోనా వల్ల నో మరే కారణం తో నైనా లేట్ ఐతే ఆ 100 వ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్ ను  అలాగే వెయిట్ చేస్తూ  ఆ నెంబర్ ను ఆయన కోసమే ఫిక్స్ చేసి ఉంటాను అన్నారు.

ఈ లోపుగా101 వ సినిమా  నా మరో డ్రీమ్ ప్రాజెక్ట్  అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే సినిమా స్టార్ట్ చేస్తాను. ఆ సినిమా ఓల్డ్ ఏజ్ హోమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది, అవార్డులు టార్గెట్ గా నే తీస్తున్నాను.

 ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవేంద్రరావు గారి శిష్యులు శ్రీ ఉదయభాస్కర్ దర్శకత్వంలో.. జేకే. భారవి గారి స్క్రిప్ట్ తో ఉంటది..ఇందులో చాలా మంది సినీ  ప్రముఖులు నటించుతారు..పూర్తి వివరాలు త్వరలో ప్రకటించుతాను. థియేటర్స్ ఓపెన్ ఐయ్యా వరకు ఓటిటి/ఏటిటిలే మార్గం..చిన్న సినిమాలకు మంచి ఉపయోగం. పెద్ద సినిమాలు థియేటర్ లో చుస్తే ఆ థ్రిల్ బాగుంటుంది
అని అన్నారు. పెద్ద సినిమాలకు థియేటర్ అనుభూతి సూపర్ గా ఉంటది.
ఈ కరోనా గోల వదిలిన వెంటనే నేను 4 ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నాను..ప్రముఖ దర్శకుడు శ్రీ సాయి ప్రకాష్ గారి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటది..

జీవితంలో ఎప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా తీసే ఆలోచన లేదు..నా తుది శ్వాస వరకు సినిమా తీస్తునే ఉంటాను..హిట్ ప్లోప్ ల తో నాకు సంబంధం లేదు..ఎప్పుడైనా నేను తీసిన సినిమా ప్లాప్ అవ్వవచ్చు గాని నేను ప్లాప్ అవ్వను అనేది నా సిద్ధాంతమని తెలిపారు.