తెనాలి రామకృష్ణ మూవీ రివ్యూ
టైటిల్ తగ్గ సినిమా కాదు (‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ రివ్యూ)
Rating:2/5
పెద్దగా కేసులు రాని లాయిర్ తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ..కోర్టు బయిట పార్టీలను రాజీలు చేస్తూ కాలక్షేపం చేస్తూంటాడు. ఓ పెద్ద కేసు వాదించి,గొప్ప లాయిర్ అనిపించుకోవాలనే అతని కోరిక తీరే క్షణం కోసం వెయిట్ చేస్తూంటారు. అదే కోర్టులో వాదించే మరో పెద్ద లాయిర్ చక్రవర్తి (మురళి శర్మను) కి తెనాలి అంటే చిన్నచూపు. అయితే ఆయన కూతురు..మరో లాయిర్ అయిన రుక్మిణి(హన్సిక) ..మన తెనాలి వెంటబడుతూండటంతో ఆయనకి మండిపోతూంటుంది. ఈ క్రమంలో ఓ విషయం తెనాలి రామకృష్ణకు తెలుస్తుంది. అదేమిటంటే…ఆ ఊళ్లో మంచి పేరున్న వరలక్ష్మి దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని పోలీసుల సహాయంతో ఓ జర్నలిస్ట్ హత్య కేసులో దొంగ సాక్ష్యాలు పుట్టించి ఇరికించారని. దాంతో ఆమెకు ఆ విషయం తెలియచేసి, ఆ కేసు ని తను తీసుకుంటాడు. ఈ క్రమంలో వరలక్ష్మి గురించి అతనికి ఓ షాకిచ్చే నిజం తెలుస్తుంది. తను ఆమెను సేవ్ చేసి చాలా పెద్ద తప్పు చేసానని అర్దం చేసుకుంటాడు. ఈ క్రమంలో..తెనాలి ఏం నిర్ణయం తీసుకున్నాడు. చివరకు ఆ కేసు ఏమైందనేది మిగతా కథ.
విషయం ఏంటంటే..
సాధారణంగా కామెడీ సినిమా అంటే హీరోలు,ఫ్యాన్స్ అనే విషయాలకు అతీతంగా అందరూ ఆసక్తి చూపుతూంటారు. అయితే కామెడీ రాయటం, తీయటం, అంతకు మించి చేయటం ఇంకా కష్టం. అందుకే చాలా మంది ఆ జానర్ జోలికి పోకుండా జాగ్రత్తపడుతూంటారు. కానీ జి నాగేశ్వరరరెడ్డి కెరీర్ ప్రారంభం నుంచీ దాదాపు కామెడీలనే నమ్ముకుని కాలక్షేపం చేస్తూ వస్తున్నాుడు. సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం, ఇలా హిట్ కామెడీ లు తీసిన ఆయన రీసెంట్ గా వరస ఫ్లాపులతో కాస్త వెనక బడ్డాడు. ఇప్పుడు మళ్లీ టైటిల్ లోనే కామెడీని నింపి నవ్వుల విందు చేస్తానని ఈ రోజు థియోటర్స్ లోకి వచ్చాడు. అయితే ఎక్సపెక్ట్ చేసినన్ని నవ్వులు పంచలేకపోయారు.
అందుకు కారణం…హీరోకు, ఫలానా వాళ్లు హీరో అని తెలిసే సరికే…ఇంటర్వెల్ అయ్యి సగం దూరం కథ ప్రయాణం చేసేస్తుంది. దాంతో మిగతా ఆ కాస్త స్క్రీన్ టైమ్ లోనే మిగతా కథనం నడపాలి. దాంతో అప్పటిదాకా ప్యాసివ్ గా నడిచిన కథ ఒక్కసారిగా కాంప్లిక్ట్ లో పడ్డా పరుగెత్తలేక చతికిలపడింది. అదే..ఇంటర్వెల్ కు అయినా ఫలానా వాళ్లు విలన్ అని తెలిస్తే..వర్కవుట్ అయ్యేది.
దానికి తోడు నాగేశ్వరరెడ్డి …రొట్టఫార్ములాతో సినిమాని లాగేంచేద్దామనుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి, వెన్నెల కిషోర్ ల కామెడీ, జబర్దస్త్ చమ్మక్ చంద్రతో తీసిన చెత్త కామెడీ విరక్తి పుట్టిస్తాయి. అప్పటిదాకా సినిమాపై ఉన్న గౌరవం కాస్త పోగొడతాయి.
నటీనటులు..మిగతా క్రాఫ్ట్ లు
అల్లరి నరేష్ తో చేయాల్సిన కథని సందీప్ కిషన్ తో చేసారేమో అని ఫస్టాఫ్ అనిపిస్తుంది. సెకండాఫ్ ఏదో యాక్షన్ సినిమాకు సీన్స్ రాసుకున్నట్లుగా పైట్స్ చేస్తూంటే అప్పటిదాకా కామెడీ సినిమా చూసామనే విషయం మర్చిపోతాము. అది స్క్రీన్ ప్లే లోపమే. సినిమా మొత్తం ఒకే పేస్ లో వెళ్లాలనే మినిమం బేస్ అనుకోలేదు. ఇక హన్సిక క్యారక్టర్ కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం.అయినా ఆమె గ్లామర్ కోల్పోయినట్లు అనిపించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ నటన బాగుంది.. ఆకట్టుకుంటుంది. ప్రభాస్ శ్రీను, సప్తగిరి, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, వై.విజయ, రఘుబాబు, సత్యకృష్ణ, అనంత్ వంటి సీనియర్స్ తమకు చేతనైంతలో నటించి నవ్వించారు.
టెక్నికల్ గా చూస్తే సాయి కార్తీక్ పాటలు జస్ట్ ఓకే. రీరికార్డింగ్ బాగోలేదు, సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ బాగుంది. నివాస్, భవానీ ప్రసాద్ డైలాగులు బాగున్నా, బూతు ఆ ఫీల్ ని చెడకొట్టేసింది. దర్శకుడుగా నాగేశ్వరరెడ్డి ఓ పదేళ్లు వెనక్కి వెళ్లిపోయారు. సినిమాని లైట్ తీసుకుని లాగేసారు.
చూడచ్చా…
కామెడీ సినిమా అని ఆవేశపడితే ఆ తర్వాత కష్టమనిపిస్తుంది.
—
తెర వెనక..ముందు
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై విజయ, సత్య కృష్ణ తదితరులు
దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్
కథ: టి.రాజసింహ
సంగీతం: సాయి కార్తీక్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
కూర్పు: ఛోటా కె. ప్రసాద్
స్క్రీన్ ప్లే: రాజు, గోపాల కృష్ణ
బ్యానర్: శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్
విడుదల: 15-11-2019