తెలిసిన వాళ్లు సినిమా గ్లింప్స్‌ విడుదల

Published On: February 24, 2022   |   Posted By:

తెలిసిన వాళ్లు సినిమా గ్లింప్స్‌ విడుదల

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా సిరింజ్ సినిమా బ్యానర్‌పై వస్తున్న సినిమా తెలిసిన వాళ్లు. ఈ సినిమాను విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తుంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. విప్లవ్ కోనేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ.. నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

మూవీ: తెలిసినవాళ్ళు

తారాగణం రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి

నిర్మాత: సిరెంజ్ సినిమా

ఛాయాగ్రహణం: అజయ్ వి నాగ్

కూర్పు: ధర్మేంద్ర కాకరాల

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

సాహిత్యం: డాక్టర్ జివాగో

కళ: ఉపేందర్ రెడ్డి

సమర్పణ: కేఎస్వీ ఫిలిమ్స్