తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పత్రికా ప్రకటన

Published On: June 18, 2021   |   Posted By:

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పత్రికా ప్రకటన

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ . తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాయింట్ మీటింగ్ లో, కరోనా మహమ్మారి కారణంగా ఆగి పోయిన ఫిలిం షూటింగ్స్ తిరిగి ప్రారంభించుచున్న సందర్భంగా ఆ విషయములను చర్చించడానికి 16. 6. 2021 (బుధవారం) ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోని మండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.

 ఈ సమావేశంలో ఈ క్రింది విధంగా తీర్మానములు చేయడం జరిగినది

ఈ కరోనా వైరస్ రావడం మూలాన గత ఏప్రిల్ నెల నుండి షూటింగ్స్ ఆగిపోయినవి. ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతున్నందున ఆర్తిస్ట్స్ లు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆ షూటింగ్స్ లో పాల్గొని 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఎవరైనను ఆగిపోయి ఉన్న చిత్రాలను పూర్తి చేయవలసిందిగా నిర్ణయించ డమైనది. ఆ బ్యాలెన్సు వర్క్ పూర్తి అయిన తదుపరి మాత్రమే కొత్త సినిమాలు చేయుటకు నిర్ణయించడమైనది.

దర్శకులు దానికి సంబంధించిన అన్ని విభాగాల వారు కరోనా వలన ఆగిపోయి ఉన్న చిత్రాలకు షెడ్యూల్స్ ని కుదించుకుని తక్కువ రోజులలో నిర్మాణం పూర్తి చేయవలసిందిగా నిర్ణయించ డమైనది. గత 2 1/2 నెలల నుండి షూటింగ్ కోసం అంగీకరించిన తేదీలకు అనుగుణంగా మరల సదరు సినిమా షూటింగ్స్ లకు తేదీలు కేటాయించి బ్యాలెన్స్ గా ఉన్న షూటింగ్ ను పూర్తి చేయాలనీ, ఆ తరువాత ఇతర సినిమా షూటింగులో పాల్గొనాలని నిర్ణయించడమైనది.

షూటింగ్ చేసే ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్ట్ ల నుండి టెక్నీషియన్ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించడం అయినది.

 షూటింగ్స్ కు హాజరై ప్రతి యూనియన్ సభ్యుడు ఒక డోస్ వ్యాక్సినేషన్ కచ్చితంగా తీసుకొని ఉండవలెనని అలా తీసుకొన్న సభ్యులు మాత్రమే షూటింగ్ కి హాజరయ్యే విధంగా ఉండాలని, ఆ ప్రకారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారికి ఒక లేఖ వ్రాయుటకు నిర్ణయించడమైనది. అలాగే ఫెడరేషన్ లోని 24 విభాగాల సభ్యులందరికీ ఇన్సూరెన్సు విదిగా చేయించాలని, ఆ బాధ్యతను ఫెడరేషన్ మరియు ఆయా యూనియన్ వారు తీసుకొనవలయును.

ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలు (SOPs) విధిగా పాటించవలసిన దిగా నిర్ణయించడం అయినది. ఈ సూచనలు అన్నిటిని ప్రొడక్షన్ హౌస్ మేనేజర్స్, ఆర్టిస్ట్ మేనేజర్స్ కి తెలియ చేస్తూ వారు ఆయా టెక్నీషియన్ కు ఆయా ఆర్టిస్ట్ లకు తెలియ చేయవలసిన బాధ్యత వారిదే అని తీర్మానించడమైనది.

అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ వ్యక్తిగతంగాను, వ్యవస్థ పరంగానూ అందరు సామాజిక బాధ్యత తో మెలుగుతూ మరియు  తగు జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగ్స్ లలో పాల్గొనాలని కోరడమైనది

అలాగే ఫిలిం ఇండస్ట్రీ లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలని సూచించడం అయినది

పైన తెలియజేసిన తీర్మానాలను తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ వారు తమ సమ్మతిని తెలియచేసినారు.

ఈ విషయాలకు సంబంధించి సలహాలు గాని, ఫిర్యాదులు గాని, ఏమైనా ఉన్న యెడల లేదా వీటిని పాటించని యెడల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి వెంటనే తెలియ జేసిన యెడల, ఆ ప్రకారం వారు తగు చర్యలను తీసుకొని వాటిని అమలు చేయుటకు నిర్ణయించడం అయినది

 అధ్యక్షులు
(నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగి)

 గౌరవ కార్యదర్శులు
(కె.ఎల్.దామోదర్ ప్రసాద్) (ఎం  రమేష్)