Reading Time: 2 mins

థ్యాంక్‌ యు బ్రదర్‌ మూవీ రివ్యూ
అనసూయ ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ రివ్యూ

Rating:2/5

అనసూయ కు ఓ పూర్తి సినిమా ని మోసేటంత మార్కెట్ ఉందో లేదో కానీ ఆమెని ప్రధాన పాత్రలో పెట్టి మాత్రం సినిమాలు చేసేస్తున్నారు. అయితే కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలకు,స్టార్స్ తో పనిలేదు కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా అనిపించదు. సినిమా బాగుంటే మెల్లిగా ఎక్కేస్తుంది. కాకపోతే ఇక్కడ కండీషన్ …సినిమా బాగుండాలనే. ఎక్కడా బోర్ కొట్టకూడదనే. కొత్తగా అనిపించలానేదే. ఇవన్ని ఈ రోజు ఓటీటిలో విడుదలైన ధాంక్సూ బ్రదర్ లో ఉన్నాయా..లేక ధాంక్స్ చెప్పేసిందా ఈ సినిమా రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

డబ్బుతో చెడిపోయిన కుర్రాడు అభి (విరాజ్ అశ్విన్ ). తల్లిని పెద్దగా లెక్కచేయడు..తప్పులు చేయటమే జీవితాశంగా పెట్టుకుని తిరుగుతూంటాడు. అయితే ఓ టైమ్ లో  పబ్బులో బిల్లు కట్టేందుకు డబ్బులు లేక కార్డు బ్లాక్ అవ్వుతుంది. అందుకు అమ్మే కారణం అని   అమ్మతో గొడవపడి ఇంట్లోంచి బయిటకు వచ్చేస్తాడు.తన తండ్రి  ప్రెండ్ (సమీర్‌)తో  బిజినెస్ పార్టనర్ గా చేరతానని కోరడానికి గోల్డ్‌ఫిష్‌ అపార్ట్‌మెంట్‌కు వస్తాడు.

మరోవైపు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త(ఆదర్శ్‌ బాలకృష్ణ) చనిపోవడంతో అతను పనిచేసే కంపెనీ నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రియ(అనసయా భరద్వాజ్‌) కూడా అదే అపార్ట్‌మెంట్‌కు వస్తుంది. ఆమె ఓ మిడిల్ క్లాస్ మహిళ. తన అత్తమ్మతో కలిసి కుట్లు, అల్లికలు చేసూకుంటూ జీవనాన్ని సాగిస్తుంది. నిండు గర్భిణి. ఇద్దరూ తన పనులు చూసుకుని తిరిగి వెళ్లేటప్పుడు అక్కడున్న లిప్ట్ ఎక్కుతారు.

 ఇలా ఒకరికొకరు ఎలాంటి సంబంధంలేని అభి, ప్రియ అనుకోకుండా ఆ లిఫ్ట్‌ చెడిపోవటంతో అందులో ఇరుక్కుపోతారు.  అదే సమయంలో ప్రియకు నొప్పులు మొదలవుతాయి. దీంతో ఆమెకు డెలివరీ చేయాల్సిన బాధ్యత అభి మీద పడుతుంది.ఎలాంటి బాధ్యత లేకుండా తిరిగే అభి, ప్రియను సేవ్‌ చేసాడా? లేదా?. ప్రియ ఘటన అభిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉంది..

2019లో నైజారియా లో వచ్చిన ఎలివేటర్ బేబీ అనే సినిమాకు నకలుగా ఉన్న ఈ చిత్రం ఆశించిన స్దాయిలో లేదు. ఫస్టాఫ్‌ అంతా బోల్డ్‌ సీన్స్‌, లవ్‌ట్రాక్‌తో నడిపి సెకండాఫ్‌లో మెయిన్ కథలోకి వచ్చాడు. అయితే అప్పటికే మనలో సహనం చచ్చిపోతుంది. క్యారక్టర్,సెటప్ చజేయటానికే దాదాపు 50 నిమిషాల టైమ్ తీసుకోవడంతో అసలు కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా అనిపించింది. కాస్సేపటికి మొత్తానికి కథలోకి వచ్చాము అనుకున్నాక.. ఎక్కడా థ్రిల్ అనిపించకుండా ఏదో అలా అలా వెళ్లిపోవడంతో ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. అలాగే అనుకోని పరిస్దితుల్లో   డెలివరీ లాంటి విపత్కర పరిస్థితి మీదకు వచ్చినప్పుడు హీరో దాన్ని ఎలా ఎదుర్కొంటాడు వంటి ఎపిసోడ్ తో గతంలో 3 ఇడియట్స్, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాల్లో చూపించారు. అక్కడ అవి ఎమోషనల్ గా బాగా వర్కవుట్ అయ్యాయి. కానీ ఆ  భావోద్వేగాలు పండలేదు.  సింపుల్ గా ఫ్లాట్ గా నడిచిపోయింది. స్క్రీన్ ప్లే రాసుకోవటంలో దర్సకుడు తడబడ్డాడని అర్దమవుతుంది.

ఇక లాస్ట్ ఇయిర్ లాగే ఈ సంవత్సరం కూడా ఓటీటిల వైపే మన ప్రయాణం మొదలైంది.  కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతబడటంతో మళ్ళీ డిజిటల్ రిలీజుల  మొదలయ్యాయి. నేరుగా ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా కొత్త సినిమాలను ఎంజాయ్ చేద్దామనుకునే ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు షాక్ ఇస్తున్నాయి. సినిమా నేపధ్యం బాగున్నా..ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే ఎలాంటి అవుట్ ఫుట్ ఈ సినిమా చక్కటి ఉదాహరణ. అనసూయ ఉండటం వల్లనే సినిమాకు కొద్దోగొప్పో క్రేజ్ వచ్చింది. కానీ టీమ్ వాడుకోలేకపోయిందనే చెప్పాలి. డిఫరెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ప్రెజెంట్ చేయడంతో క్రియటైన హైప్ కు తగ్గట్లు సినిమా లేదు.

టెక్నికల్ గా..

ఉన్నంతలో గుణ బాలసుబ్రమణియన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే.  పాటలు ఇలాంటి సినిమాలో అనవసరం. సురేష్ రగుటు కెమెరా వర్క్ లో  కష్టం కనపడింది.  ఉదయ్-వెంకట్ ల ఎడిటింగ్ లెంగ్త్ తక్కువ లో కూడా ఇంకా ట్రిమ్ చేయచ్చు అనిపించేలా ఉంది.  రమేష్ రాపర్తి, సురేంద్ర బాబు డైలాగులు పర్వాలేదు. నిర్మాణ విలువలు చుట్టేసిన ఫీలింగ్ తెచ్చాయి.

చూడచ్చా..

కరోనా టైమ్ బయిటకు వెళ్లకుండా కొత్త తెలుగు సినిమానే చూడాలని ఫిక్సైనా, అనసూయ అభిమాని అయినా వెంటనే చూసేయండి

తెర ముందు..వెనక

నిర్మాణ సంస్థ :  జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
న‌టీటులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, , అనీశ్‌ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, వైవా హర్ష తదితరులు
ఎడిటింగ్‌: ఉదయ్‌, వెంకట్‌
సంగీతం:  గుణ బాలసుబ్రమణియన్
సినిమాటోగ్ర‌ఫీ : సురేష్ ర‌గుతు
ఆర్ట్‌: పురుషోత్తమ్‌ ప్రేమ్
కథ: రమేశ్‌ రాపర్తి, నియీ అఖిన్‌మోలయాన్‌, మోరిస్‌ కె.శశి;
నిర్మాత: మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారకనాథ్‌ బొమ్మిరెడ్డి
దర్శకత్వం: రమేశ్‌ రాపర్తి;
రన్ టైమ్:1 గంట 34 నిముషాలు
ఓటీటి: ఆహా
విడుదల తేది :  మే 07, 2021