Reading Time: < 1 min
దక్ష (సెక్షన్ 302) సినిమా ప్రారంభం
 
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాతలలో ఒకరైన తల్లాడ శ్రీ లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా
తమ ప్రొడక్షన్ హౌస్ నుండి మరొక సినిమా ని మార్చ్ 15న ఖమ్మం లో గల శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయం నందు పూజాకార్యక్రమాలు జరిపించి లాంఛనంగా షూటింగ్ ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ” దక్ష సెక్షన్ 302″ సినిమా ద్వారా వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
 
సీనియర్ నటుడు శరత్ బాబు వాళ్ళ అబ్బాయి ఆయుష్ హీరోగా ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం, 2016 లో మార్చ్ 15న మేము శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ సంస్థ ని స్థాపించి “ఎందరో మహానుభావులు” అనే సినిమా ని మొదలు పెట్టాం, అప్పటి నుండి ఇప్పటి వరకు మాకున్న పరిధిలో మంచి మంచి కథల్ని ప్రేక్షకులకు అందిస్తున్నాము.అలాంటి జాబితాలోకే ఈ “దక్ష  సెక్షన్ 302” కూడా వస్తుంది.
 
డైరెక్టర్ వివేకానంద విక్రాంత్ మాట్లాడుతూ త్రిల్లర్ జోనర్ లో సరికొత్త అంశాల్ని జోడించి ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండేలా ఈ సినిమా  కథనం ఉంటుంది, ఒక ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల చుట్టూ కథ తిరుగుతుంటుంది.
. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ ని సొంత బ్యానర్ లా ఫీల్ అవుతాను ఎందుకంటే , నేను కథ చెప్పిన వారం రోజుల్లో సినిమా ని స్టార్ట్ చేస్తున్నారు , లోకేషన్స్ పరంగా, టెక్నీకల్ టీం పరంగా ,ఇలా అన్ని విధాలుగా నాకు సపోర్టుగా ఉన్నారు,
ఖమ్మం, అరకు, హైదరాబాద్ లో త్వరలో రెగ్యులర్ షూటింగ్  ఉంటుంది, ప్రొడ్యూసర్ తల్లాడ శ్రీ లక్ష్మి మేడమ్ బర్త్ డే సందర్భంగా నా మొదటి సినిమా లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
 
ఆయుష్,అఖిల్,పవన్,అను,నక్షత్ర,రియా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి 
రచన: శివ కాకు,
కెమేరా:  శివ రాథోడ్, ఆర్.ఎస్. శ్రీకాంత్,
సంగీతం:- వి.ఆర్.ఏ.ప్రదీప్,
మేకప్:- రాజు,
కథ-కథనం-మాటలు :- వివేకానంద విక్రాంత్,
నిర్మాత:-  తల్లాడ శ్రీనివాస్,